E-Paper
Advertisement

టిప్ప‌ర్ లారీలా గిల్ ను ఢీ కొట్టిన గుర్నూర్ బ్రార్…పాకిస్తాన్ త‌ర‌హాలో ఫీల్డింగ్ అంటూ ట్రోల్స్‌

టిప్ప‌ర్ లారీలా గిల్ ను ఢీ కొట్టిన గుర్నూర్ బ్రార్…పాకిస్తాన్ త‌ర‌హాలో ఫీల్డింగ్ అంటూ ట్రోల్స్‌
Advertisement

Gurnoor Brar – Shubman Gill collided catch:  టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ (England vs India) మధ్య ప్రస్తుతం వన్డే సిరీస్ (India tour of England, 2026) కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ మూడు వన్డేల సిరీస్ నేపథ్యంలో ఇవాళ మొదటి వన్డే మధ్యాహ్నం మూడున్నర గంటలకు ప్రారంభమైంది. ఎడ్జ్‌బాస్టన్, బర్మింగ్‌హామ్ (Edgbaston, Birmingham) వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ మొదట బ్యాటింగ్ చేస్తోంది. మొదట బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా.. పక్కా ప్లాన్ ప్రకారం ఇంగ్లాండ్ టాప్ ఆర్డర్ ను కుప్ప కూల్చింది. ప్రస్తుతానికి అయితే 140 పరుగులు సాధించిన ఇంగ్లాండ్ ఆరు వికెట్లు నష్టపోయింది. అయితే ఈ మ్యాచ్ లో జోస్ బట్లర్ (Jos Buttler) ఇచ్చిన అద్భుతమైన క్యాచ్ ను గుర్నూర్ బ్రార్ ( Gurnoor Brar) పట్టుకునే క్రమంలో కెప్టెన్ గిల్ ను (Shubman Gill ) టిప్పర్ లారీ తరహాలో ఢీకొట్టాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఇక ఇది చూసిన క్రికెట్ అభిమానులు తెగ నవ్వుకుంటున్నారు. అయితే తనను ఢీ కొట్టినందుకు గుర్నూర్ బ్రార్ ( Gurnoor Brar) ను బండ బూతులు గిల్ తిట్టాడని సోషల్ మీడియాలో చర్చ కూడా మొదలైంది.

Also Read: Irfan Pathan Comments On Team India Head Coach  చెత్త వెధ‌వ‌లను గంభీర్ తీసుకొచ్చాడు..అందుకే ల‌క్ష్మ‌ణ్ ను వెంట‌నే కోచ్ గా నియామకం చేయండి

టిప్ప‌ర్ లారీలా గిల్ ను ఢీ కొట్టిన గుర్నూర్ బ్రార్

Advertisement

టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య కాసేపటి క్రితమే ఎడ్జ్‌బాస్టన్, బర్మింగ్‌హామ్ (Edgbaston, Birmingham) వేదికగా తొలి వన్డే ప్రారంభమైంది. ఈ మ్యాచ్ లో టీమిండియా బౌలర్లు అద్భుతంగా రానిస్తున్నారు. అయితే ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ వికెట్ కీపర్ జోస్ బట్లర్ 14 బంతులలో ఐదు పరుగులు చేసి వికెట్ సమర్పించుకున్నాడు. ఈ క్రమంలో ప్రసిద్ కృష్ణ బౌలింగ్ లో క్యాచ్ అవుట్ అయ్యాడు. అయితే బట్లర్ ఇచ్చిన క్యాచ్ ను గుర్నూర్ బ్రార్ ( Gurnoor Brar), కెప్టెన్ గిల్ ఇద్దరు అందుకునే ప్రయత్నం చేశారు. పాకిస్తాన్ ఫీల్డర్లు చేసే విన్యాసాలను గుర్తు చేశారు. అయితే చివరికి గిల్ ను నెట్టేసి మరీ, బట్లర్ క్యాచ్ అందుకున్నాడు గుర్నూర్ బ్రార్. దీంతో గిల్ కుప్పకూలాడు. ఈ సంఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియో వైర‌ల్ గా మారింది.

బండ బూతులు తిట్టిన గిల్… నవ్వుకున్న కోహ్లీ

బట్లర్ క్యాచ్ నేపథ్యంలో కిందపడిన గిల్.. బ్రార్ ను బండ బూతులు తిట్టినట్లు సోషల్ మీడియాలో ఫోటోలు అలాగే వీడియోలు వైరల్ అవుతున్నాయి. కళ్ళు దొబ్బాయా? నేను క్యాచ్ పడుతుంటే నువ్వెందుకు వచ్చావు ? అంటూ గిల్ రెచ్చిపోయినట్లు ఈ ఫోటోలలో స్పష్టంగా కనిపించింది. ఇక అటు ఈ క్యాచ్ నేపథ్యంలో గిల్ కింద పడ్డ సన్నివేశాన్ని చూసి విరాట్ కోహ్లీతో పాటు టీమ్ ఇండియా క్రికెటర్లు నవ్వుకున్నారు.

Advertisement

Also Read:  Munaf Patel On Dhoni Hookah Party: నోరు ఉన్న ప్ర‌తీ వెధ‌వా
మాట్లాడ‌ట‌మే..ధోనీ ‘హుక్కా’ సీక్రెట్ పై మునాఫ్ సంచ‌ల‌నం

 

 

Related News

పాక్ ప్లేయ‌ర్ల‌కు షాక్‌.. NOC ఇచ్చేందుకు లంచాలు తీసుకుంటోన్న‌ PCB

2027 వ‌ర‌ల్డ్ క‌ప్ కోసం PCB స్కెచ్….PSLను మించిన టోర్న‌మెంట్ వ‌స్తోంది

టీమిండియాలో చీలిక‌..జూనియ‌ర్లు, సీనియ‌ర్ల‌ను విడ‌దీసి గంభీర్ ట్రైనింగ్ ?

మా పాకిస్తాన్ అంటేనే చుల‌క‌న‌గా చూస్తారు..షాహిద్ అఫ్రిది సీరియ‌స్

టీమిండియాలో అంతర్యుద్ధం…గంభీర్‌, కోహ్లీ ఇద్ద‌రూ డిష్యుం..డిష్యుం !

రోహిత్ కు 87 ఛాన్సులు ఇచ్చారు..మ‌రీ స్కూల్ కు వెళ్లే వైభ‌వ్ కు 3 మ్యాచ్ లే స‌రిపోతాయా?

పెళ్లి చేసుకుందే ఇద్ద‌రు ఆడాళ్లు…ఇందులో మ‌రో అమ్మాయితో ఎ**ఫైర్‌

Big Stories

Advertisement
×