BigTV English

Viral Video: హైదరాబాద్‌ను దుబాయ్‌తో పోల్చిన రష్యన్ బ్యూటీ.. వీడియో చూస్తే ఔరా అంటారు!

Viral Video: హైదరాబాద్‌ను దుబాయ్‌తో పోల్చిన రష్యన్ బ్యూటీ.. వీడియో చూస్తే ఔరా అంటారు!

Russian model -Hyderabad: హైదరాబాద్ రోజు రోజుకు మరింత అభివృద్ధి చెందుతోంది. ముఖ్యంగా దిగ్గజ టెక్ కంపెనీలు కొలువై ఉన్న గచ్చిబౌలి, మాదాపూర్, నానక్ రామ్ గూడ లాంటి ప్రాంతాలు రోజు రోజుకు ప్రపంచ స్థాయిలో డెవలప్ అవుతున్నాయి. తాజాగా హైదరాబాద్ కు వచ్చిన ఓ రష్యన్ మోడల్ ఈ ప్రాంతాన్ని చూసి ఆశ్చర్యపోయింది. దుబాయ్ కి ఏమాత్రం తీసిపోని విధంగా ఉందంటూ ప్రశంసలు కురిపించింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


హైదరాబాద్ అందాలకు ఫిదా

రష్యాన్ మోడల్ కేన్సియా తాజాగా ఢిల్లీ పర్యటనకు వచ్చింది. పనిలో పనిగా హైదరాబాద్ కు రావాల్సి వచ్చింది. ఇక భాగ్యనగరం లోని  స్కైలైన్, మౌలిక సదుపాయాలను చూసి ఫిదా అయ్యింది. హైటెక్ సిటీని అలా చూస్తూ ఉండిపోయింది.  టెక్ హబ్ – దుబాయ్‌ తో పోలుస్తూ ఒక వీడియోను షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇప్పటి వరకు 50 లక్షలకు పైగా వ్యూస్ సాధించింది ఈ వీడియో. ఈ వీడియోలో ఆమె హైటె నగరంలోని పలు ప్రాంతాలను తిరుగుతూ కనిపంఇచింది. పట్టణ ప్రణాళిక, ఆధునిక స్కైలైన్‌ ను అభినందించింది. “హబీబీ, ఇది దుబాయ్ కాదు. ఇది హైదరాబాద్” అంటూ తన వీడియోను షేర్ చేసింది.


Read Also: టేకాఫ్ అవుతూ గాల్లోనే పేలిపోయిన విమానం.. చూస్తే నిద్రపట్టదు..

కేన్సియా వీడియోపై నెటిజన్ల కామెంట్స్

కేన్సియా షేర్ చేసిన ఈ వీడియో కొద్ది సేపట్లోనే బాగా వైరల్ అయ్యింది. హైదరాబాద్ అభివృద్ధిపై చాలా మంది పాజిటివ్ గా స్పందించారు. మరికొంత మంది హైదరాబాద్ లో అది కేవలం ఒక భాగం అంటూ కామెంట్స్ చేశారు “నేను చివరిసారిగా హైదరాబాద్‌ను సందర్శించినప్పుడు ఇలా లేదు. ఇప్పుడు హైదరాబాద్ ను చూసి ఆశ్చర్యపోతున్నాను. అద్భుతమైన అభివృద్ధి” అని ఓ నెటిజన్ రాసుకొచ్చాడు. “నేను హైదరాబాద్ వ్యక్తిని కాదు. కానీ, హైదరాబాద్ అంటే నాకు ఎంతో ఇష్టం. దానికి ముఖ్యంగా మూడు కారణాలు ఉన్నాయి. 1. భాషా వివాదం లేదు. 2. మంచి వాతావరణం. 3. భారతదేశానికి గర్వం. ఈ కారణాల వల్ల నేను హైదరాబాద్ ను ఇష్టపడుతున్నాను” అని మరో వ్యక్తి చెప్పుకొచ్చాడు. ఈ వీడియోపై విదేశాల్లో ఉన్న హైదరాబాదీయులు కూడా పాజిటివ్ గా స్పందిస్తున్నారు. “ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు  హైదరాబాద్ ను చూసి ప్రశంసించినప్పుడు, నేను కూడా  హైదరాబాద్‌ లో పుట్టి పెరిగానని చెప్పుకునేందుకు గర్వంగా ఉంటుంది” అని మరో వ్యక్తి కామెంట్ పెట్టాడు. మరో నెటిజన్ “ఇది పూర్తి హైదరాబాద్ కాదు, కేవలం ఒక మూల మాత్రమే” అని మరో వ్యక్తి రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

https://www.instagram.com/vegkseniia/p/DNrzWnwZBjM/

Read Also:  వారెవ్వా మొబైల్ బార్లు, రమ్మన్న చోటుకు వచ్చేస్తాయ్!

Related News

Nude Cruises: ఏవండోయ్ ఇది విన్నారా.. బట్టలు లేకుండా సముద్ర ప్రయాణం.. ఎక్కడో తెలుసా?

Pakistan Bullet Train: ఇండియా కంటే ముందుగానే పాక్‌లో బుల్లెట్ రైల్? లాహోర్ నుంచి కరాచీకి కేవలం 5 గంటలేనట!

Train To Mizoram: 142 వంతెనలు, 48 సొరంగాలు.. ఐజ్వాల్‌ కు తొలి రైలు వచ్చేస్తోంది!

IRCTC Ticket Booking: రైలు ప్రయాణం చేస్తున్నారా? ఈ రూల్ గురించి కచ్చితంగా తెలుసుకోవాల్సిందే!

Train Running Status: రైలు లైవ్ రన్నింగ్ స్టేటస్ ఇన్ని రకాలుగా తెలుసుకోవచ్చా? ఇన్నాళ్లు ఈ విషయం తెలియక…

Big Stories

×