Mobile Bar: మందు బాబుల కోసం కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ఇప్పటికే మద్యం డోర్ డెలివరీ ఇస్తుండగా, ఇప్పడు మొబైల్ బార్లను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. పార్టీ ఎక్కడ జరిగితే అక్కడికే వచ్చి మద్యం సరఫరా చేస్తాయి ఈ మొబైల్ బార్లు. ఇంకా చెప్పాలంటే, కేరళలో మొబైల్ బార్లు ఇటీవలి కాలంలో పార్టీలు, వివాహాలు, కార్పొరేట్ ఈవెంట్లు సహా పలు కార్యక్రమాలకు సర్వీసులు అందిస్తున్నాయి.
వ్యాన్ లో బార్ ఏర్పాటు
మొబైల్ బార్లు సాధారణంగా ఒక వ్యాన్ లో ఏర్పాటు చేయబడి ఉంటాయి. ఇవి కస్టమర్లు కోరుకున్న చోటుకు వచ్చి డ్రింక్స్, కాక్ టెయిల్స్, మాక్ టెయిల్స్ లాంటివి సర్వ్ చేస్తాయి. కొన్ని మొబైల్ బార్లు కస్టమైజ్డ్ డ్రింక్ మెనూలు, థీమ్లతో సర్వీస్ అందిస్తాయి, ఇవి అతిథులకు ప్రత్యేక అనుభవాన్ని ఇస్తాయి. ఈ బార్లలో మద్యం సాధారణ ధర కంటే కాస్త ఎక్కువగా ఉంటుంది. కావాలి అనుకుంటే ఇందులో స్టఫ్ కూడా తయారు చేయించుకునే అవకాశం ఉంటుంది.
మొబైల్ బార్లు ఎప్పటి నుంచి అందుబాటులోకి వచ్చాయంటే?
మొబైల్ బార్లు ఈ ఏడాది(2025) మే చివరి నుంచి మొబైల్ బార్లు ప్రారంభమయ్యాయి. గాడ్స్ ఓన్ కంట్రీ అని పిలిచే కేరళలో కొత్త ట్రెండ్ గా మారింది. ఈ మొబైల్ బార్లు ఇళ్లలో జరుపుకునే పార్టీలు, వెడ్డింగ్ రిసెప్షన్లు, బర్త్ డేలు, కార్పొరేట్ ఈవెంట్లకు బుక్ చేసుకోవచ్చు. మద్యంతో కూడిన వ్యాన్ వినియోగదారులు కోరుకున్న చోటుకు వచ్చి మద్యం సరఫరా చేస్తాయి. వ్యాన్ లో బార్ కు అవసరమైన సామగ్రి, డ్రింక్స్, బార్టెండర్ లు ఉంటారు. Elite Bar Solutions వంటి కంపెనీలు మొబైల్ బార్లను అందుబాటులోకి తీసుకొచ్చాయి. ఇవి కార్పొరేట్ ఈవెంట్లకు ప్రత్యేకం. గత కొద్ది కాలంగా కేరళకు చెందిన ఈ మొబైల్ బార్లు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.
Mobile Bar launched in Kerala. If you have a party at home… this bar cum van will come to your venue n serve your guests.!!
Good concept.
🥃🍺🥂🍷🍸🍹 pic.twitter.com/Evkpv0Vt9Z— Alex James Murikan (@chennai123) June 5, 2025
Read Also: రీల్ కోసం ఫ్లై ఓవర్ మీది నుంచి దూకిన యువకుడు.. కాళ్లు రెండూ…
గతంలో మొబైల్ బార్లను సీజ్ చేసిన అధికారులు
నిజానికి కేరళలో మొబైల్ బార్లు అనే 2021 నుంచి అందుబాటులోకి వచ్చాయి. కానీ, మద్యం నిబంధనలు విరుద్ధంగా అమ్ముతున్నారనే కారణంగా 2022లో పలు మొబైల్ బార్లను పోలీసులు సీజ్ చేశారు. డ్రై డే రోజు మద్యాన్ని అమ్ముతున్న పలువురిపై చర్చలు తీసుకున్నారు. కానీ, ఇప్పుడు మొబైల్ బార్లను లీగల్ గా, లైసెన్స్ తీసుకుని నడిపిస్తున్నారు. పూర్తిగా పారదర్శకంగా వీటి సర్వీసులు కొనసాగుతున్నాయి. అయితే, లైసెన్స్ ఉన్నప్పటికీ కొంత మంది నిబంధనలు పాటించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా టైమింగ్స్ పాటించడం లేదనే విమర్శలు ఉన్నాయి. అయితే, మొబైల్ బార్లకు టైమ్ పరిమితి విషయంలో ప్రభుత్వం మినహాయింపు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఫ్రెండ్స్ అంతా కలిసి పార్టీ చేసుకోవాలనుకున్నా, మొబైల్ బార్ ను బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది. మన దగ్గర కూడా ఇలాంటి సదుపాయం అందుబాటులోకి వస్తే బాగుంటుందని మందుబాబులు ఆశపడుతున్నారు.
Read Also: బాత్రూమ్ లోకి తొంగి చూసిన పులి.. ఆ తర్వాత..