Air Force Fighter Jet: ఫైటర్ జెట్లు ఎలాంటి విపత్కర పరిస్థితుల్లోనూ దూసుకెళ్తాయి. శత్రు టార్గెట్లపై విరుచుకుపడుతాయి. కానీ, తాజాగా ఓ ఫైటర్ జెట్ టేకాఫ్ అవుతూనే పేలిపోయిన ఘటన సంచలనం కలిగింది. రాయల్ మలేషియన్ ఎయిర్ ఫోర్స్ (RMAF) కు చెందిన F/A-18D హార్నెట్ ఫైటర్ జెట్ ఒకటి టేకాఫ్ సమయంలో కూలిపోయింది. క్వాంటన్ లోని సుల్తాన్ అహ్మద్ షా విమానాశ్రయం నుంచి పైకి ఎగురుతుండగా ఈ ఘటన జరిగింది. ఫైటర్ జెట్ క్రాష్ కు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. జెట్ విమానం విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన వెంటనే మంటల్లో చిక్కుకున్నట్లు కనిపిస్తోంది. ఈ ఘటనలో పైలెట్ చాకచక్యంగా తప్పించుకున్నట్లు తెలుస్తోంది.
ప్రమాదంపై RMAF విచారణ
ఈ ఫైటర్ జెట్ ప్రమాదానికి గల కారణాన్ని నిర్ధారించడానికి దర్యాప్తు చేపట్టినట్లు RMAF వెల్లడించింది. ఈ యుద్ధ విమానం అధునాతన సాంకేతికత, RMAF కఠినమైన నిర్వహణ ప్రోటోకాల్ లను బట్టి విచారణ కొనసాగించనున్నారు. ఈ సంఘటన సైనిక విమానల్లో అంతర్లీనంగా ఉన్న ప్రమాదాల గురించి ఆందోళనలను రేకెత్తించింది. అనుభవజ్ఞులైన పైలట్లు, మంచి మెయింటెనెన్స్ ఉన్న జెట్లు కూడా కూలడం RMAFను షాక్ కి గురి చేస్తోంది. ముఖ్యంగా, F/A-18 హార్నెట్ సైనిక కార్యకలాపాలకు ఉపయోగించే శక్తివంతమైన యుద్ధ విమానం. ఇక కువాంటన్ విమానాశ్రయం అని కూడా పిలువబడే సుల్తాన్ అహ్మద్ షా విమానాశ్రయంలో ప్రస్తుతం కూలిపోయిన విమాన శకలాలను తొలగించడం, రన్ వే క్లియరింగ్ పనులను సులభతరం చేయడానికి విమాన కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేసింది. తాజా విమాన సమాచారం కోసం ప్రయాణీకులు తమ విమానయాన సంస్థలను సంప్రదించాలని సూచించారు.
https://twitter.com/Tar21Operator/status/1958606993129972082
మలేషియా సైనిక సామర్థ్యాల అప్‌గ్రేడ్
గత కొద్ది సంవత్సరాలుగా మలేషియా తన వైమానిక దళంతో సహా సైనిక సామర్థ్యాలను అప్ గ్రేడ్ చేస్తోంది. రష్యన్ Su-57 ఫెలోన్, దక్షిణ కొరియా KF-21 బోరామే వంటి కొత్త విమానాలను కొనుగోలు చేస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా అత్యాధునిక యుద్ధ విమానం కూలిపోవడంతో, ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు నిర్వహించనున్నట్లు RMAF వెల్లడించింది. ఈ దర్యాప్తులో విమానయానం, ఇంజనీరింగ్, భద్రతతో సహా వివిధ రంగాలకు చెందిన నిపుణులు పాల్గొంటారు. ఈ ప్రమాదం RMAF కార్యకలాపాలు, శిక్షణ షెడ్యూల్ లను కూడా ప్రభావితం చేయనున్నట్లు తెలుస్తోంది. దర్యాప్తులో వెల్లడైన అంశాలను బట్టి, నిర్వహణ విధానాలు, పైలట్ శిక్షణ కార్యక్రమాలలో మార్పులు జరిగే అవకాశం ఉంది. మలేషియా రక్షణ వ్యూహం దాని వైమానిక దళంపై ఎక్కువగా ఆధారపడుతుంది. దాని ఫైటర్ జెట్ల భద్రత, ప్రభావం జాతీయ భద్రతకు కీలకమైనదిగా భావిస్తోంది.
Read Also: నోరా ఫతేహిలా కనిపించాలంటూ భార్యను అలా చేసిన భర్త.. సీన్ కట్ చేస్తే..