E-Paper
Advertisement

Sankranthi Special Trains: ముగిసిన సంక్రాంతి సంబురాలు.. విశాఖ నుంచి చర్లపల్లికి ప్రత్యేక రైళ్లు

Sankranthi Special Trains: ముగిసిన సంక్రాంతి సంబురాలు.. విశాఖ నుంచి చర్లపల్లికి ప్రత్యేక రైళ్లు
Advertisement

South Central Railway Special Trains: మూడు రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగిన సంక్రాంతి వేడుకలు ముగిశాయి. పండుగ కోసం సొంతూళ్లకు వెళ్లిన ప్రజలు హైదరాబద్ కు తిరుగు ప్రయాణం అయ్యారు. సొంత వాహనాలు ఉన్న వాళ్లు కార్ల, బైకుల మీద హైదరాబాద్ కు వస్తుండగా, లేని వాళ్లు ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను ఆశ్రయిస్తున్నారు. బుధ, గురు వారాల్లో పెద్ద సంఖ్యలో వాహనాలు రావడంతో హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ట్రాఫిక్ క్లియర్ చేసేందుకు ట్లోల్ ప్లాజాల దగ్గర అదనపు ఏర్పాట్లు చేశారు. పోలీసులు ఎప్పటికప్పుడు ట్రాఫిక్ జామ్ కాకుండా తగిన చర్యలు తీసుకున్నారు.

ఆంధ్రా నుంచి హైదరాబాద్ కు ప్రత్యేక రైళ్లు

Advertisement

ఇక ప్రయాణీకుల రద్దీ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సంక్రాంతికి హైదరాబాద్ కు వచ్చే వారి సంఖ్య ఎక్కువగా ఉండటంతో అదనపు రైళ్లను ఏర్పాటు చేసింది. గత రెండు రోజులుగా ఆంధ్రా నుంచి హైదరాబాద్ కు వచ్చే రైళ్లలో ఇసుకేస్తే రాలనంత మంది ప్రయాణీకులు ఉంటున్నారు. ఈ నేపథ్యంలో రైల్వే అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. సంక్రాంతి రద్దీ కొనసాగుతున్న వేళ ప్రత్యేక  రైళ్లను అందుబాటులోకి తెస్తున్నట్లు ప్రకటించారు. ఈ రైళ్లు ఈ నెల 18, 19 తేదీల్లో అందుబాటులో ఉంటాయని వెళ్లడించారు. ఈ రైళ్లు విశాఖపట్నం నుంచి హైదరాబాద్ లో నూతనంగా నిర్మించిన చర్లపల్లి స్టేషన్ వరకు నడవనున్నట్లు తెలిపారు.

సంక్రాంతి అదనపు రైళ్ల వివరాలు

Advertisement

⦿ విశాఖ- చర్లపల్లి- భువనేశ్వర్ రైలు: సంక్రాంతి సందర్భంగా అందుబాటులోకి తీసుకురాబోతున్న ఈ రైలు ఈనెల 18న రాత్రి 7.45 గంటలకు విశాఖలో బయల్దేరుతుంది. మరుసటి రోజు అంటే 19న ఉదయం 7 గంటలకు చర్లపల్లి రైల్వే స్టేషన్ కు చేరుకుంటుంది. అటు 19న ఉదయం 9 గంటలకు చర్లపల్లిలో బయల్దేరి సాయంత్రం 7.30 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. అక్కడ 7.50 గంటలకు బయల్దేరి 20న తెల్లవారు జామున 2.15 గంటలకు భవనేశ్వర్ కు చేరుకుంటుంది.

Read Also: ఒక్కో రైలు తయారీకి అన్ని కోట్లు ఖర్చు అవుతుందా? మీరు అస్సలు ఊహించి ఉండరు!

⦿ విశాఖ- చర్లపల్లి- విశాఖ రైలు: ఈ రైలు ఈ నెల 18న సాయంత్రం 6.20 గంటలకు విశాఖలో బయల్దేరుతుంది. మరుసటి రోజు అంటే 19న ఉదయం 8 గంటలకు చర్లపల్లి రైల్వే స్టేషన్ కు చేరుకుంటుంది. అటు 19న ఉధయం 10 గంటలకు చర్లపల్లిలో బయల్దేరుతుంది. రాత్రి 10 గంటలకు విశాఖకు చేరుకుంటుంది.

⦿ విశాఖ- చర్లపల్లి- విశాఖ రైలు: ఈ రైలు ఈ నెల 19న సాయంత్రం 6.20 గంటలకు విశాఖలో బయల్దేరుతుంది. మరుసటి రోజు అంటే ఈ నెల 20న ఉదయం 8 గంటలకు చర్లపల్లి రైల్వే స్టేషన్ కు చేరుకుంటుంది. అదే రోజు ఉదయం 10 గంటలకు చర్లపల్లి నుంచి బయల్దేరి.. రాత్రి 10 గంటలకు విశాఖ చేరుకుంటుంది. ఇక సంక్రాంతి సందర్భంగా సౌత్ సెంట్రల్ రైల్వే సుమారు 170 రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు వెల్లడించింది.

Read Also:  ఆలస్యంగా ‘సంక్రాంతి’ రైళ్లు.. ఆ రైలు ఏకంగా 11 గంటలు ఆలస్యం, ప్రయాణికులకు చుక్కలు!

Related News

ట్రెక్కింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారా? దేశంలో సురక్షితమైన 7 అద్భుతమైన ట్రెక్కింగ్ ప్రాంతాలివే

ఈ తప్పులు చేస్తే తిరుమలలో రూమ్ దొరకదు.. టీటీడీ కొత్త గైడ్‌లైన్స్ ఇవే!

చివరి నిమిషంలోనూ కన్ఫర్మ్ సీట్.. రైల్వేలో సీక్రెట్ రూల్ గురించి తెలుసా?

12 రోజుల ఆధ్యాత్మిక యాత్ర.. అదీ EMIలో.. IRCTC ప్యాకేజ్ అదిరింది భయ్యా!

నల్లగొండ జిల్లాలో దాగిన ఉన్న అద్భుతాలు.. ఒక్కో చోట ఒక్కో విశేషం!

దుబాయ్ 5 ఏళ్ల మల్టిపుల్ ఎంట్రీ విజిట్ వీసా.. తక్కువ ధరలోనే.. భారతీయులకు అర్హత వివరాలు

హోటళ్లలో చెక్ ఇన్.. చెక్ అవుట్ ఆ సమయాల్లో ఎందుకు? దీని వెనుక అసలు కారణాలివే?

తాజ్ మహల్ కింద ఉన్న ఆ 22 గదులను ఎందుకు తెరవరు? నిజంగానే అక్కడ నిధులు, విగ్రహాలు ఉన్నాయా?

Big Stories

Advertisement
×