Intinti Ramayanam Today Episode January 17th : నిన్నటి ఎపిసోడ్ లో.. అక్షయ్ కు తన అమ్మ అనురాధ సమాధిని రాజేంద్రప్రసాద్ చూపిస్తాడు. తల్లి సమాధిని చూసి అక్షయ్ ఎమోషనల్ అవుతాడు. ఏడుస్తాడు.. ఇకమీదట నీ గుండెల్లో బాధ తగ్గేంత వరకు మీ అమ్మ సమాధి మీద పడి ఏడువు నీకు కన్నీళ్ళతో ఆ సమాధిని కడుగు అనేసి రాజేంద్రప్రసాద్ అంటాడు.. అమ్మలేని లోటుని నీకు తెలియకుండా పార్వతి నీకు అన్ని దగ్గరుండి చేసింది. పార్వతి ప్రేమను నువ్వు అనుమానిస్తున్నావ్ అవమానిస్తున్నావని రాజేంద్రప్రసాద్ అంటాడు. కన్నతల్లి ప్రేమ ఎలా ఉంటుందో నీకు పార్వతి చూపించింది నిన్ను ఏ రోజు సవతి కొడుకు అని చూడలేదు ఇప్పటికే తను నీకోసం పరితపిస్తుంది నీకు పార్వతినే అమ్మ పార్వతి లోనే నీకు మీ అమ్మని చూసుకో అనేసి రాజేంద్రప్రసాద్ అక్షయ్ ని ఇంటికి తీసుకెళ్ళిపోతాడు.. అక్షయ్ బాధపడుతూ ఇంటికి వెళ్తాడు.. ఇంటికి వెళ్లగానే చక్రధర్ ఇంటికి ఆవేశంగా వస్తాడు. ఏంటి ఏం చేస్తున్నావ్ రాజేంద్రప్రసాద్ అని గట్టిగా అరుస్తాడు. చక్రధర్ మాటలకు ఇంట్లోనే వాళ్ళందరూ బయటకు వస్తారు.. ఏమైంది మర్యాద లేకుండా అలా మాట్లాడుతున్నారని వినోద్ అడుగుతాడు. పెద్ద కొడుకుకు ఆస్తి రాసిస్తావని చక్రధర్ అడగ్గానే రాజేంద్రప్రసాద్ పళ్ళు రాలగొడతానంటాడు. దానికి చక్రధర్ రెచ్చగొడతాడు.. అక్షయ్ చక్రధర్ ని కొడతాడు కమల్ పల్లవిని కొడతాడు అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది..
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. ఇంట్లో జరిగిన విషయాన్ని అవని శ్రీకర్ తో చెప్తుంది. చక్రధరత్ మా అన్న మాటలు అసలు పట్టించుకోవద్దు వదిన మీరేంటో అన్న ఏంటో మాకు తెలుసు ఆస్తి విషయం మాకు అవసరం లేదు అది నాన్న అన్నయ్య ఇద్దరు కలిసి డెవలప్ చేశారు మాకు ఇందులో సంబంధం లేదు అని శ్రీకర్ అవనికి భరోసా ఇస్తాడు. కానీ అవని మాత్రం మాకు అలాంటి ఉద్దేశం లేకపోయినా మమ్మల్ని కావాలని దోషున్ని చేశారు శ్రీకర్ అని అంటుంది.. ఇక పల్లవి బ్యాగ్ సర్దుకొని తన పుట్టింటికి వెళ్లడానికి కిందకు వస్తుంది. భానుమతి ఏమైందని అడుగుతుంది.. భానుమతి అందర్నీ అరిచి పిలుస్తుంది. అందరూ రాగానే పల్లవి వెళ్ళిపోతుందని ప్రభావతి కంగారుపడుతుంది. అమ్మ ఎందుకు వెళ్ళిపోతున్నావ్ అంటే మీ ఇంటి పరువు కాపాడడానికి నేను పెళ్లి చేసుకున్నాను అలాంటిది మా నాన్నకి ఇంట్లో గౌరవం లేదు అవమానం జరిగింది మీ పెద్దబ్బాయి మా నాన్నని కొట్టాడు. మా నాన్నకు అవమానం జరిగిందంటే నాకు అవమానం జరిగింది కదా అది ఆలోచించడం మీరు అని పల్లవి నిలదీస్తుంది..
ఇక పల్లవి రాజేంద్ర ప్రసాద్ ని అడుగుతుంది. మీ అబ్బాయి మా నాన్నని కొట్టాడు మామయ్య అది ఆలోచించకుండా నాదే తప్పు అని అంటున్నారు మీకు కొంచమైనా న్యాయం ఉందా మా నాన్న ఆవేశంలో తప్పేముంది చెప్పండి కూతురు గురించి ఆలోచించాడు అది తప్ప అని అడుగుతుంది.. దానికి రాజేంద్రప్రసాద్ మీ నాన్న ఆవేశంలో ఆస్తి గురించి అడిగాడు నాకు కాలర్ పట్టుకున్నాడు అందుకే నా కొడుకు కొట్టాడమ్మా నీ చెల్లిని నీ తమ్ముడిని ఏ రోజైనా కొట్టాడా మా నాన్న పరాయివాడు కాబట్టే మీ కొడుకు కొట్టారు.. అందరినీ నిలదీస్తుంది పల్లవి ఒక్కొక్కరిని ఒక్క మాట అడుగుతుంది కానీ కమల్ ని పెళ్లి ఎందుకు చేసుకున్నాను అనే విషయాన్ని బయట పెడుతుంది. అక్షయ సారీ చెప్పాలని చివరికి చెప్తుంది పల్లవి. పల్లవి ఎందుకు సారీ చెప్పాలి అని అందరూ అడుగుతారు. అక్షయ సారి చెప్పాల్సిన అవసరం లేదు అని ప్రతి ఒక్కరూ అక్షయ ని సపోర్ట్ చేస్తూ మాట్లాడతారు కానీ పార్వతి మాత్రం పల్లవికి సపోర్ట్ గా నిలుస్తుంది అక్షయ్ సారీ చెప్పు అని అడుగుతుంది.. అవని అక్షయ సారీ చెప్పడానికి అసలు ఒప్పుకోదు ఇక పార్వతి భార్య మాట వింటావా? అమ్మ మాట వింటావా అని అడుగుతుంది. అక్షయ్ అమ్మ మాట విని సారీ చెప్పడానికి ముందుకు వస్తాడు. తనకి పార్వతి పంతం నెగ్గించుకుంటుంది. పల్లవికి సారీ చెప్తాడు.
పల్లవి అక్షయ్ ని ఆపుతుంది. మీరు ఈ ఇంట్లో అవమానపడ్డ నాకు సారీ చెప్పారు నాకన్నా ఎక్కువ అవమానపడ్డ మా నాన్నకి మీరు ఇంకా సారీ చెప్పలేదు అని అడుగుతుంది. ఇక తల్లి మాట విని చక్రధర్ కూడా అక్షయ్ సారి చెప్తాడు. ఇక పల్లవి పంతం నెగ్గడంతో ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతుంది.. ఇక అక్షయ్ సారీ చెప్పి లోపలికి రాగానే అవని వచ్చి అడుగుతుంది మీరు సారీ ఎందుకు చెప్పారు అత్తయ్య కోసం సారీ చెప్పడం తప్పు కాదు ఒక సంస్కారం ఉన్న వాళ్ళకి సారీ చెప్తే నేను ఫీలయ్యేదాన్ని కాదు తల్లి మాట మీద మీకు గౌరవం ఉంది భారీ మాట అంటే మీకు లెక్క లేదా అని నిలదీస్తుంది. దానికి అక్షయ్ అమ్మ మాట గౌరవించాలంటే భార్యని అవమానించినట్టు కాదు ఆ గౌరపరిచినట్టు కాదు అవని అని అక్షయ్ చెప్తాడు. అమ్మను బాధ పెట్టడం ఇష్టం లేక నేను సారీ చెప్పానని అంటాడు అక్షయ్.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది ఇక రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి…