Unstoppable Ram Charan Episode Part 2 :రామ్ చరణ్(Ram Charan) .. రాజమౌళి (Rajamouli)దర్శకత్వంలో వచ్చిన ‘ ఆర్ఆర్ఆర్ ‘ సినిమాతో ఏకంగా గ్లోబల్ స్టార్ గా మారిపోయారు. ఈ సినిమా తర్వాత అరుదైన గుర్తింపులు.. ఆయన ఎన్నో అందుకున్నారని చెప్పవచ్చు. ఒకటి డాక్టరేట్, మరొకటి మేడం టుస్సాడ్స్ మ్యూజియంలో మైనపు విగ్రహం ఇలా చెప్పుకుంటూ పోతే పలు అవార్డులు, గౌరవాలు ఆయనకు లభించాయని చెప్పవచ్చు. ఇకపోతే ఎన్నో అంచనాల మధ్య శంకర్ (Shankar) దర్శకత్వంలో చేసిన చిత్రం గేమ్ ఛేంజర్ (Game Changer). జనవరి 10వ తేదీన సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా.. కథపరంగా డిజాస్టర్ గా మిగిలినా.. కలెక్షన్ల పరంగా బాగానే రాబడుతోందని సమాచారం.
బాలయ్య షోలో సందడి చేసిన రామ్ చరణ్..
ఇదిలా ఉండగా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా విడుదలకు ముందే రామ్ చరణ్.. బాలయ్య(Balakrishna ) హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ విత్ ఎన్బికె షో లో పాల్గొన్నారు. ఈ ఎపిసోడ్ ను మొత్తం రెండు భాగాలుగా స్ట్రీమింగ్ చేస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే గత వారం మొదటి పార్ట్ విడుదల చేయగా.. ఇక నిన్న రెండవ పార్ట్ విడుదల చేశారు. అందులో భాగంగానే రామ్ చరణ్.. తన భార్య ఉపాసన (Upasana)తో.. లవ్ ఎలా స్టార్ట్ అయింది ? ఇద్దరు ఎలా కలిశారు? ఎక్కడ కలిశారు ?అనే విషయాలను చెప్పుకొచ్చారు.
లవ్ స్టోరీ రివీల్ చేసిన రామ్ చరణ్..
షోలో.. రామ్ చరణ్ ఉపాసనతో నీ లవ్ స్టోరీ ఎలా మొదలయ్యింది? అని బాలయ్య ప్రశ్నించగా.. రాంచరణ్ మాట్లాడుతూ.. ఒక కాఫీ షాప్ లో ఫ్రెండ్ ద్వారా మా పరిచయం జరిగింది .ఆ తర్వాత అమ్మాయిలు, అబ్బాయిలు ఎలాగైతే గొడవపడతారో మేము కూడా అలాగే గొడవపడే వాళ్ళం. కానీ ఆమె క్యారెక్టర్ కి నేను పడిపోయాను. ఇక అలా కొన్నేళ్లు ప్రేమించుకున్న తర్వాత ఇంట్లో ఒప్పించాం. ఆ తర్వాత జరిగిందంతా మీకు తెలుసు అంటూ తెలిపారు రామ్ చరణ్. ఇక రామ్ చరణ్.. ఉపాసన నిన్ను ఏమని పిలుస్తుంది? అని అడగగా.. రాంచరణ్ అని పిలుస్తుంది సార్ అని చెప్పాడు రామ్ చరణ్. అయితే కోపం వచ్చినప్పుడు ఏమని పిలుస్తుంది అంటే? పేరు అదే.. కాకపోతే టోన్ మారుతుంది అంటూ అందరినీ నవ్వించారు రామ్ చరణ్. ఇకపోతే రామ్ చరణ్ , ఉపాసన జంట ఎంతో మందికి ఆదర్శమని చెప్పవచ్చు. రామ్ చరణ్ ఒకవైపు సినిమాలలో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంటే.. ఉపాసన కూడా సమాజానికి సేవ చేస్తూ.. అపోలో హాస్పిటల్ చైర్పర్సన్ గా బాధ్యతలు నిర్వహిస్తోంది.. ముఖ్యంగా వైద్యరంగంలో ఎన్నో అవార్డులు అందుకున్న ఆమె.. అంతర్జాతీయంగా కూడా పేరు దక్కించుకుంది.
టాలీవుడ్ లోనే ఖరీదైన పెళ్లిగా గుర్తింపు..
ఇకపోతే రామ్ చరణ్, ఉపాసన పెళ్లి టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోనే అత్యంత ఖరీదైన పెళ్లిగా కూడా రికార్డు సృష్టించింది. 2012 జూన్ 15వ తేదీన జరిగిన వీరి వివాహానికి దాదాపుగా రూ.60 – 70 కోట్ల వరకు ఖర్చయిందని అప్పట్లో వార్తలు వినిపించాయి. అయితే ఇందులో నిజానిజాలు తెలియాల్సి ఉంది. అంతేకాదు ఉపాసనా కూడా కొన్ని వందల కోట్లను కట్నంగా తీసుకొచ్చిందని సమాచారం. ఇకపోతే వివాహం జరిగిన 11 ఏళ్ల తర్వాత గత ఏడాది పండంటి బిడ్డకు జన్మనిచ్చింది ఉపాసన..మొత్తానికైతే ఈ జంట ఎంతో అన్యోన్యంగా కనిపిస్తూ.. ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తోంది. ఇక కలకాలం ఇలాగే ఉండాలని అభిమానులు కూడా కోరుకుంటున్నారు.