South Central Railway: సంక్రాంతి రద్దీని దృష్టిలో పెట్టుకుని ఏకంగా 176 రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు చెప్పినప్పటికీ.. ప్రయాణీకులకు ఇబ్బందులు తప్పడం లేదు. పండుగకు సొంతూరికి వెళ్లి తిరిగి హైదరాబాద్ కు వచ్చే వారికి చుక్కలు కనపడుతున్నాయి. గుంటూరు మీదుగా వెళ్లే సంత్రగచి- సికింద్రాబాద్ (రైలు నెంబర్ 07222) ప్రత్యేక రైలు ఏకంగా 11 గంటలు ఆలస్యంగా నడవడంతో ప్రయాణీకులు లబోదిబోమంటున్నారు.
నిన్న మధ్యాహ్నం 12.20కి బయల్దేరాల్సి ఉన్నా…
వాస్తవానికి సంత్రగచి – సికింద్రాబాద్ రైలు బెంగాల్ లో నిన్న మధ్యాహ్నం 12.20 గంటలకు బయల్దేరాలి. కానీ, ముందుగా 9.40 గంటలు ఆలస్యంగా నడుస్తున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. ఆ తర్వాత 11 గంటలు ఆలస్యంగా నడుస్తున్నట్లు చెప్పారు. అంటే రాత్రి 11. 35 గంటలకు పలాస చేరుకోవాల్సిన ఈ రైలు మరుసటి రోజు ఉదయం 10.30కి చేరుకోనున్నట్లు వెల్లడించారు. రైలు ఆలస్యానికి గల కారణాలను కూడా సరిగా చెప్పకపోవడంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చిన్నపిల్లలు ఉన్న తల్లింద్రడులు, వృద్ధులు రైల్వే స్టేషన్లకు వచ్చి వెనుదిరుగాల్సిన పరిస్థితి నెలకొన్నది. రైల్వే అధికారుల తీరుపై ప్రయాణీకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు ఉద్యోగులు కూడా ఒక రోజు ఆఫీస్ కు డుమ్మా కొట్టాల్సిన పరిస్థితి నెలకొన్నది.
సంత్రగచి – సికింద్రాబాద్ రైలు గురించి..
సంత్రగచి- సికింద్రాబాద్ రూట్ లో నడిచే ఈ రైలు వారానికి రెండు రోజుల పాటు అందుబాటులో ఉంటుంది. ఆదివారం, బుధవారం పశ్చిమ బెంగాల్ లోని సంత్రగచి రైల్వే స్టేషన్ నుంచి బయల్దేరుతుంది. మధ్యాహ్నం 12.20 గంటలకు జర్నీ మొదలు పెడుతుంది. మరుసటి రోజు మధ్యాహ్నం 3 గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు చేరుకుంటుంది. మొత్తం 1524 కిలో మీటర్ల దూరం ప్రయాణించే ఈ రైలు నాలుగు రాష్ట్రాలను కలుపుతుంది. మొత్తం 25 స్టేషన్లలో ఆగుతుంది. పశ్చిమ బెంగాల్ లో మధ్యాహ్నం 12.20 గంటలకు తన ప్రయాణాన్ని మొదలుపెట్టే ఈ రైలు 3.38 గంటలకు ఒడిషాలోకి అడుగు పెడుతుంది.
Read Also: దేశంలో అత్యంత చౌకైన ఏసీ రైలు ప్రయాణం ఇదే.. వేగంలో వందే భారత్ కు ఏమాత్రం తీసిపోదు!
రాత్రి 11.35 గంటలకు పలాసకు రీచ్
రాత్రి 11.35 గంటలకు ఆంధ్ర ప్రదేశ్ లోని పలాసకు రీచ్ అవుతుంది. శ్రీకాకుళం, విజయనగరం, దువ్వాడ, అనకాపల్లి, సామర్లకోట, రాజమండ్రి, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ, గుంటూరు, సత్తెనపల్లి, పిడుగురాళ్ల మీదుగా ప్రయాణించి మధ్యాహ్నం 12.20 గంటలకు తెలంగాణలోని మిర్యాలగూడకు చేరుకుంటుంది. అక్కడి నుంచి నల్లగొండ మీదుగా మధ్యాహ్నం 3 గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు చేరుకుంటుంది. అయితే, ఈ రైలు ప్రస్తుతం 11 గంటలు ఆలస్యంగా తన ప్రయాణాన్ని మొదలు పెట్టింది. రేపు మధ్యాహ్నం 2 గంటల వరకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు చేరే అవకాశం ఉంటుంది. అయితే, అర్జంట్ పని ఉన్న చాలా మంది ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకుంటున్నారు.
Read Also: నార్త్ టు సౌత్, శీతాకాలంలో బెస్ట్ ట్రైన్ జర్నీస్, లైఫ్ లో ఒక్కసారైనా ప్రయాణించాల్సిందే!
Read Also: టూరిస్టులకు గుడ్ న్యూస్, ఇక ఆ రూట్ లో విస్టాడోమ్ రైలు వచ్చేస్తోంది!