Sreemukhi : తెలుగు బుల్లితెర పై వరుస షోలతో ఫుల్ బిజీగా ఉన్న యాంకర్స్ లలో ఒక శ్రీముఖి. బుల్లితెరపై ప్రసారమవుతున్న పలు షోలలో శ్రీముఖి యాంకర్ గా చేస్తుంది. ప్రముఖ తెలుగు ఛానల్ స్టార్ మా లో ప్రసారమవుతున్న ‘ఆదివారం విత్ స్టార్ మా పరివారం’ శ్రీముఖి యాంకర్ గా వ్యవహరిస్తున్నారు. సీరియల్ సెలబ్రిటిలతో సందడిగా సాగే ఆ షోలో శ్రీముఖి చేసే అల్లరి అంతా ఇంతా కాదు.. ఒక మాటలో చెప్పాలంటే శ్రీముఖి కోసమే ఆ షో ని చూసే వాళ్ళు కూడా ఉన్నారు. తాజాగా ఈ షో నెక్స్ట్ ఎపిసోడ్ ప్రోమో ని రిలీజ్ చేశారు మేకర్స్.. ఫాదర్స్ డే సందర్భంగా ఈ ఎపిసోడ్‌కి పలువురు సీరియల్ సెలబ్రిటీలు తమ పిల్లలతో వచ్చారు. ప్రభాకర్ తన కూతురు దివిజతో కలిసి షోలో సందడి చేశారు. అంతేకాదు సీరియల్ యాక్టర్స్ అందరు వాళ్ళ నాన్నలతో వచ్చి సందడి చేశారు.. ప్రోమో ఆకట్టుకుంటుంది.
శ్రీముఖి పరువు తీసిన నటుడి కూతురు..
ఈ ప్రోమో వీడియోలో ముందుగా బ్రహ్మముడి ఫేమ్ శ్రీకర్ కృష్ణ తన తండ్రితో రాగానే శ్రీముఖి ఆప్యాయంగా పలకరించింది. విఠల్ గారు కాసేపు మీరే నా నాన్న అని శ్రీముఖి అనగానే అయ్యయ్యో మావయ్య అనిపిలవాల్సింది నాన్న అని పిలిచింది అంటూ శ్రీకర్ కామెడీ చేశాడు. మీ అబ్బాయి ఏంటండీ నామీద కన్నేసాడు అని శ్రీముఖి అంటుంది. శ్రీముఖి మాట వినగానే ఆయన మీ ఇద్దరి మధ్యలో నాకెందుకు అని పక్కకు వెళ్ళిపోతాడు. ఆ తర్వాత నటుడు ప్రభాకర్ తన కూతురుతో ఎంట్రీ ఇస్తాడు. శ్రీముఖి గారు అని పిలవడంతో ప్రభాకర్ షాక్ అవుతాడు. దాంతో శ్రీముఖి ప్రభ అని పిలుద్దాం అనుకున్నాను మీ అమ్మాయి ఉంది కదా అందుకే పిలవలేకపోయాను అని అంటుంది. ఆ మాట వినగానే ప్రభాకర్ కూతురు మీ ఇద్దరి మధ్యలో నేనెందుకు మీరు మాట్లాడుకోండి అని అంటుంది. ఈ ప్రోమో వీడియో వైరల్ అవ్వడంతో శ్రీముఖిపై నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు. ఆఖరికి ముసలోడిని కూడా వదలట్లేదు కదా అని కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం ఈ ప్రోమో వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..
Also Read :మళ్ళీ బన్నీని పక్కపెట్టేసిన త్రివిక్రమ్.. ఈ సారి ఈ హీరోతో కానిస్తున్నాడా?
ఇక చివరిగా కౌశిక్ తన కొడుకుతో వచ్చాడు. ఏంటండీ మీ అబ్బాయితో రమ్మంటే మీ తమ్ముడు తో వచ్చారు అని శ్రీముఖి పంచ్ వేస్తుంది. అయ్యో వాడు నా కొడుకే అంటూ కౌశిక్ చెప్పాడు. ఇంతలో రోహిణి వచ్చి శ్రీముఖిపై మాములు పంచ్ వేయలేదు. హలో పెళ్లయి ఉంటే నీకూ అంతే కొడుకు ఉండేవాడు. అని రోహిణి సైలెంట్ గా సెటైర్ వేస్తుంది. మొత్తానికి ఫాదర్స్ డే ఎపిసోడ్ కాస్త ఫన్నీగా ఎమోషనల్ గా ఉండబోతుందని ప్రోమో ని చూస్తే అర్థమవుతుంది.. ఏది ఏమైనా శ్రీముఖి షోలో వేసే పంచులు మాత్రం అందరిని ఆకట్టుకుంటాయి.