Trivikram : టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ని సంపాదించుకున్న స్టార్ డైరెక్టర్లలో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒకరు. గత ఏడాది మహేష్ బాబుతో గుంటూరు కారం సినిమా తెరకెక్కించారు. ఆ మూవీ మిక్స్డ్ టాక్ ని అందుకున్న సరే కలెక్షన్ల పరంగా మాత్రం దుమ్ము దులిపేసింది. ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎవరితో సినిమా చేస్తారని ఇండస్ట్రీలో ఓ వార్త చక్కర్లు కొడుతుంది.. అయితే ఈయన బన్నీతో ఓ సినిమా చేస్తున్నాడని కొద్ది రోజుల క్రితం వార్తలు వినిపించాయి. స్టోరీలో కొన్ని మార్పులు ఉండడంతో బన్నీ త్రివిక్రమ్ సినిమాకి గ్యాప్ ఇచ్చినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం బన్నీ తమిళ డైరెక్టర్ అట్లీతో కలిసి యాక్షన్ సీక్వెల్ గా ఓ మూవీ చేస్తున్నాడు. దాంతో త్రివిక్రమ్ బన్నీ కోసం రాసుకున్న కథతో మరో స్టార్ హీరోతో సినిమా చేస్తున్నట్లు ఇండస్ట్రీలో టాక్. ఆ హీరో ఎవరో వివరాల్లోకి వెళితే..
బన్నీని పక్కనపెట్టేసిన గురూజీ..
పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్,త్రివిక్రమ్ కాంబో ఫిక్స్ అయిందని దాదాపు అందరూ అనుకున్నారు. అయితే అల్లు అర్జున్ కి స్టోరీ లైన్ నచ్చలేదని త్రివిక్రమ్ ను పక్కన పెట్టేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక త్రివిక్రమ్ సినిమా ఇప్పట్లో ఉండే అవకాశం లేదని అట్లీతో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు బన్నీ.. భారీ యాక్షన్ నేపథ్యంలో రాబోతున్న సినిమా కావడంతో దానిపై అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి. అటు త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా బన్నీని పక్కన పెట్టేసాడని నెట్టింట ప్రచారంలో ఉంది. ఇప్పుడు బన్నీకోసం రాసుకున్న కథతో మరో హీరోతో సినిమా చేస్తున్నాడని ఫిలిం నగర్లో టాక్..
Also Read :గీతా ఆర్ట్స్ నుంచి బన్నీ వాసు గుడ్ బై… ఒక్క మాటతో ఫుల్ క్లారిటీ ఇచ్చేశాడు..
ఎన్టీఆర్ – త్రివిక్రమ్ కాంబోలో మూవీ..
బన్నీ కోసం అద్భుతమైన మైథాలజికల్ స్టోరీని రాశాడు త్రివిక్రమ్.. బన్నీ వేరే సినిమాకు వెళ్లడంతో త్రివిక్రమ్ మరో ఏడాది వెయిట్ చెయ్యలేక వేరే హీరోతో సినిమాను పట్టాలెక్కించబోతున్నాడు. 2025- 26 లో వెంకటేష్ తో సినిమా చేయాల్సి ఉంది. 2026- 27లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో సినిమా చేస్తాడు. మరి ఆ తర్వాత ఎన్టీఆర్ తో సినిమా చేయబోతున్నాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. బన్నీ కోసం రాసుకున్న కథతోనే ఎన్టీఆర్ తో సినిమా చేసే ఆలోచనలో గురూజీ ఉన్నట్లు తెలుస్తుంది. ఒకవేళ రామ్ చరణ్ సినిమా ఆలస్యమైతే ఎన్టీఆర్ తో సినిమాని పట్టాలెక్కించే అవకాశం ఉందని సమాచారం. ప్రస్తుతం ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ తో డ్రాగన్ మూవీ చేస్తున్నాడు. ఆ తర్వాత నెల్సన్ తో మూవీ చేస్తున్నాడు. ఆ తర్వాత త్రివిక్రమ్ తో సినిమా సెట్స్ మీదకి వెళ్లబోతుంది..
అటు రామ్ చరణ్ సినిమాల విషయానికొస్తే.. ఉప్పెన ఫేమ్ డైరెక్టర్ బుచ్చిబాబుతో ‘పెద్ది’ సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ తర్వాత సుకుమార్ తో మరో సినిమా చేయబోతున్నాడు. ఆ తర్వాత త్రివిక్రమ్ తో సినిమా చేస్తాడా? లేదా ముందుగానే త్రివిక్రమ్ తో సినిమా చేస్తారా చూడాలి..