Actress Seetha:ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరియర్ మొదలుపెట్టి.. ఆ తర్వాత ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన వారు ఎంతోమంది ఉన్నారు. అందులో అమ్మాయిలు కొంతమంది హీరోయిన్లుగా మారితే.. మరి కొంతమంది క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి పేరు సొంతం చేసుకున్న వారు కూడా ఉన్నారు. అలాంటి వారిలో చైల్డ్ ఆర్టిస్ట్ సీతా(Seetha )కూడా ఒకరు. మొండి మొగుడు పెంకి పెళ్ళాం, వజ్రం, రావణబ్రహ్మ ఇలా పలు చిత్రాలలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన ఈమె.. దాదాపు తెలుగు, తమిళ్, మలయాళం భాషల్లో కలిపి 60 సినిమాలు చేసింది. ప్రస్తుతం బుల్లితెరపై పలు సీరియల్స్ చేస్తూ అత్త, అమ్మ పాత్రలు పోషిస్తూ కెరియర్ ను కొనసాగిస్తోంది. ఇదిలా ఉండగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సీత తన వ్యక్తిగత విషయాలను పంచుకొని అందరిని ఆశ్చర్యపరిచింది.
అమ్మ మరణంతో దేవుడిపై నమ్మకం పోయింది – సీత
సీత తన కెరీర్ లో తాను పడ్డ ఇబ్బందుల గురించి చెబుతూ.. “మూడేళ్ల వయసు నుంచి నేను నటన నేర్చుకున్నాను. బాల్యంలో ఎన్నో సినిమాలు చేశాను. ఇక పెద్దయ్యాక తెలుగు కంటే మలయాళం లోనే ఎక్కువ సినిమాలు చేశాను. కానీ ఇప్పుడు సీరియల్స్ లో అవకాశాలు రావడంతో ఇక్కడే బిజీ అయిపోయాను. కాబట్టి సినిమాలలో చేయడానికి డేట్స్ ఖాళీగా లేకనే, అక్కడ సినిమాలు చేయడం లేదు. నా వ్యక్తిగత విషయానికి వస్తే.. నా చిన్నప్పుడే నాన్న చనిపోయాడు. అమ్మ నాతో పాటు షూటింగ్స్ కి వచ్చేది. ఒకసారి విపరీతంగా దగ్గుతుంటే హాస్పిటల్ కి తీసుకెళ్లాము. అప్పుడు ఆమెకు క్యాన్సర్ నాలుగో స్టేజ్ అని వైద్యులు చెప్పడంతో ఇక అక్కడే నా సగం ప్రాణం పోయినట్టు అనిపించింది. రెండు నెలలకు మించి బ్రతకదని చెప్పారు. ఎంతోమంది దేవుళ్లను వేడుకున్నాను. కానీ ఫలితం లేకుండా పోయింది. ఇక అప్పటినుంచి నాకు దేవుడంటే నమ్మకం లేదు” అంటూ తెలిపింది సీత.
Deepika Padukone:2014 ని నా జీవితంలో మరిచిపోలేను..దీపికా పదుకొనే హాట్ కామెంట్స్..!
గర్భాశయం కూడా తీసేశారు..
“నాకు గతంలో పెళ్లి జరిగి విడాకులు కూడా అయిపోయాయి. ఆ తర్వాత వేరే మతానికి చెందిన వ్యక్తిని నేను రెండో వివాహం చేసుకున్నాను. ఆయనకి కూడా నాతో రెండో పెళ్లి కావడం గమనార్హం. మొదటి వైవాహిక బంధంలో భర్తతో ఎక్కువగా కలిసి ఉండలేదు. ఎప్పుడూ పుట్టింట్లోనే ఉండేదాన్ని. విడాకులు అనేవి ఏదైనా తప్పు జరిగింటే విడాకులు అవుతాయి. కానీ నేను ఏ తప్పు చేయలేదు
అయినా సరే అలాంటి పరిస్థితి వచ్చింది. 2013లో విడాకులు తీసుకున్నాను. ఆ తర్వాత నా స్కూల్ మేట్ మళ్లీ పరిచయమయ్యాడు. ఇక 2018లో అతడిని వివాహం చేసుకున్నాను. ఇకపోతే నాకు గర్భాశయంలో కణతులు ఏర్పడ్డాయి. మొదటి భర్తతో ఉన్నప్పుడే ఈ సమస్య తెలిసింది. టాబ్లెట్స్ వేసుకుంటే కరిగిపోతుందని అన్నారు. కానీ అప్పటి గొడవల వల్ల నేను పెద్దగా పట్టించుకోలేదు. తీరా రెండో పెళ్లి అయ్యాక ఆ కణతుల పరిమాణం పెరిగిపోయింది. దానివల్ల వేరే సమస్యలు వస్తాయని వైద్యులు హెచ్చరించారు. ఇక దానికి తోడు రెండుసార్లు అబార్షన్ కూడా అయింది. ఇక తట్టుకోలేక గర్భాశయాన్ని తొలగించుకోవాల్సి వచ్చింది. అందుకే మాకు పిల్లలు లేరు” అంటూ సీత చెప్పుకొచ్చింది. మొత్తానికి అయితే దేవత సీత కంటే కూడా ఎక్కువ కష్టాలు నీవే తల్లీ అని నెటిజన్స్ కూడా కన్నీటి పర్యంతమవుతున్నారు. ఇక ప్రస్తుతం సీత కార్తీకదీపం 2 సీరియల్ లో నటిస్తోంది.