Deepika Padukone:ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే(Deepika Padukone) బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ.. గత ఏడాది ప్రభాస్ (Prabhas), నాగ్ అశ్విన్ (Nag Ashwin) కాంబినేషన్లో వచ్చిన ‘కల్కి 2898AD’ సినిమా ద్వారా ఇటు తెలుగు ప్రేక్షకులను కూడా అలరిస్తోంది. మొదట బాలీవుడ్ లో ‘ఓం శాంతి ఓం’ అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈమె.? మొదటి సినిమాతోనే షారుక్ ఖాన్ (Shahrukh Khan) సరసన జోడిగా నటించి పాపులారిటీ సొంతం చేసుకుంది. ‘హ్యాపీ న్యూ ఇయర్’, ‘ ఏ జవానీ హై దీవాని’, ‘ఫైటర్’, ‘జవాన్’, ‘పఠాన్’, ‘పద్మావత్’, ‘చెన్నై ఎక్స్ప్రెస్’, ‘బాజీరావు మస్తానీ’ లాంటి చిత్రాలు ఆమె కెరియర్ ను మరింత ఉన్నతంగా తీర్చిదిద్దాయి. ముఖ్యంగా ఈ సినిమాలన్నీ కూడా అత్యధిక కలెక్షన్లు రాబట్టాయి. దీంతో అతి తక్కువ సమయంలోనే దీపికా కూడా స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకుంది. ఇదిలా ఉండగా తాజాగా అమ్మతనాన్ని ఆస్వాదిస్తున్న దీపిక హెల్త్ ప్రాబ్లం గురించి అభిమానులతో పంచుకుంది.
2014 సంవత్సరాన్ని ఎప్పటికీ మర్చిపోలేను..
దీపికా పదుకొనే మాట్లాడుతూ..” నా జీవితంలో 2014లో నా కెరియర్ పీక్స్ లో ఉన్న క్షణాలు అవి. అసలు తీరిక లేకుండా సినిమాలు చేస్తూ.. ఆనందంగా బిజీగా గడిపేస్తున్నాను. అలాంటి సమయంలో ఒక్కసారిగా తీవ్ర అలసటకు గురై, లొకేషన్ లోనే కళ్ళు తిరిగి పడిపోయాను. ముందు ఈ సమస్యను లైట్ తీసుకున్నా.. కానీ ఎందుకో మనసు కీడు శంకించింది. అందుకే అవసరమైన స్కానింగ్ లు, టెస్టులు కూడా చేయించుకున్నాను. అప్పుడే నా పరిస్థితి అంత బాలేదని అర్థమైంది. ఇక ట్రీట్మెంట్ తీసుకుంటే తగ్గిపోయే సమస్యలే అని నా మనసుకు నేనే సర్ది చెప్పుకున్నాను. అయినా సరే ఏదో అయిపోతున్నట్టు భయపడేదాన్ని.. విపరీతంగా ఏడ్చేసే దాన్ని. మానసికంగా కృంగిపోయాను కూడా.. ఇక నా విషయం తెలుసుకున్న మా అమ్మ.. నన్ను చూడడానికి ముంబై వచ్చి కొన్ని సలహాలు ఇచ్చింది. ఆమె సూచనల ప్రకారం థెరపిస్ట్ ను కలిసాను. అయితే నేను థెరపిస్ట్ వద్దకు వెళుతున్న విషయాన్ని రహస్యంగా ఉంచమని అమ్మ కూడా చెప్పింది. ఇక అమ్మ మాట కాదనకుండా ఎవరికి ఈ విషయం తెలియకుండా.. రహస్యంగా థెరపీ కూడా తీసుకున్నాను. నిదానంగా దాని నుండి కోలుకున్న తర్వాతనే నా మానసిక ఆరోగ్యం గురించి అందరికీ అర్థం అయ్యేలా చెప్పగలిగాను. అప్పుడు అనిపించింది అమ్మ ఎందుకు ఈ విషయాన్ని రహస్యంగా ఉంచమన్నదో అని.. అందుకే నేను “లివ్ లాఫ్ లవ్” ఫౌండేషన్ స్థాపించడానికి కారణం కూడా అదే” అంటూ నాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకుంది దీపికా పదుకొనే. మొత్తానికి అయితే దీపిక చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
దీపికా పదుకొనే ప్రస్తుత సినిమాలు..
ఇకపోతే దీపిక పదుకొనే ఇటీవల పండంటి బిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే .ఆ పాప ఆలనా పాలన చూసుకోవడానికి ఇంటికే పరిమితమైంది. ముఖ్యంగా ఇతర హీరోయిన్ల లాగా తమ పిల్లల సంరక్షణ కోసం ఆయా వంటి వాళ్ళని నియమించకుండా తన కూతురి ఆలనా పాలనా చూసుకుంటూ.. తాను కూడా మాతృత్వాన్ని ఆస్వాదించాలని కోరుకుంటున్నట్లు తెలిపింది దీపిక .ప్రస్తుతం దీపిక వచ్చే ఏడాది కల్కి 2 లో భాగం కాబోతున్నట్లు సమాచారం.