BigTV English

Custodial Torture Case: రఘురామరాజు కస్టోడియల్‌ టార్చర్‌ కేసు.. ఐపీఎస్‌కు నోటీసు

Custodial Torture Case: రఘురామరాజు కస్టోడియల్‌ టార్చర్‌ కేసు.. ఐపీఎస్‌కు నోటీసు

Custodial Torture Case: మాజీ ఎంపీ, అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుపై కస్టోడియల్‌ టార్చర్‌ కేసు అనేక మలుపులు తిరుగుతోంది. ఈ కేసులో ఉన్నతస్థాయి అధికారులు వెలుగులోకి వస్తున్నారు. తాజాగా డీఐజీగా విధులు నిర్వహస్తున్న సునీల్‌ నాయక్‌ను ప్రకాశం జిల్లా ఎస్పీ నోటీసులు ఇచ్చారు. దీంతో ఈ కేసులో ఏం జరుగుతోందన్న చర్చ అప్పుడే మొదలైపోయింది.


కస్టోడియల్‌ టార్చర్‌ కేసు కీలక మలుపు

రఘురామకృష్ణరాజుపై కస్టోడియల్‌ టార్చర్‌ కేసు కొత్త మలుపులు తిరుగుతోంది. ఈ కేసులో ఇప్పటివరకు చాలామంది అధికారుల పేర్లు వెలుగులోకి వచ్చాయి. తాజాగా మరొక ఐపీఎస్ అధికారి పేరు వెలుగులోకి వచ్చింది. అప్పటి సీఐడీ డీఐజీగా పనిచేసిన సునీల్‌ నాయక్‌ను విచారించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో ప్రకాశం ఎస్పీ దామోదర్‌.. సునీల్ నాయక్‌కు నోటీసులు పంపారు.


రఘురామను సీఐడీ ఆఫీస్‌కు తీసుకొచ్చిన సమయంలో సునీల్‌ నాయక్‌ ఉన్నారని గుర్తించారు అధికారులు. ఇప్పటికే నమోదు చేసిన వాంగ్మూలాల ఆధారంగా ఆయన పాత్రపై విచారించేందుకు సిద్ధమయ్యారు. ఆయనకు ఆయనకు విచారణకు పిలుస్తూ పోలీసులు ఫ్యాక్స్ వాట్సాప్ ద్వారా నోటీసులు ఇచ్చారు. ఈ విషయాన్ని పోలీసు వర్గాలు వెల్లడించాయి.

వైసీపీ రూలింగ్‌లోకి రాగానే బీహార్‌ క్యాడర్‌కు చెందిన సునీల్‌ నాయక్‌ను డిప్యుటేషన్‌పై రాష్ట్రానికి తీసుకొచ్చింది. ఆ తర్వాత సీఐడీ డీఐజీగా ఆయనకు పోస్టింగ్‌ ఇచ్చింది. ఆయన సమయంలో అప్పటి ఎంపీ రఘురామకృష్ణ రాజుపై కస్టోడియల్ టార్చర్ చేశారని కేసు నమోదు అయ్యింది. వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత కూటమి సర్కార్ దీనిపై ఫోకస్ చేసింది.

ALSO READ: ఆందోళనలో సజ్జల, ముందస్తు బెయిల్ కోసం

అసలేం జరిగింది?

ఈ కేసుకు సంబంధించి ఇందులో ప్రమేయమున్న అధికారులను విచారిస్తున్నారు. పాల్, తులసి‌బాబులను విచారించారు. డీఐజీ సునీల్‌నాయక్‌కు ప్రకాశంజిల్లా ఎస్పీ నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం బీహార్ ఫైర్ సర్వీసెస్ డీఐజీ‌గా విధులు నిర్వహిస్తున్నారు సునీల్ నాయక్. 2021 మే14న అప్పటి ప్రభుత్వం రఘురామకృష్ణంరాజును అరెస్టు చేసింది.

ఆ తర్వాత గుంటూరు సీఐడీ కార్యాలయంలో రాత్రి ఉంచారు. హార్ట్ ఆపరేషన్ చేయించుకున్న తన గుండెలపై కూర్చుని ఓ వ్యక్తి తనను టార్చర్ చేశారంటూ రఘురామ ఆరోపించారు. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత కేసు నమోదు చేయడం విచారణ లోతుగా చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే సునీల్ తిరిగి బిహార్‌ వెళ్లిపోయారు.

ఇంకాస్త లోతుల్లోకి వెళ్తే..

ప్రస్తుతం అక్కడ అగ్నిమాపక విభాగంలో డీఐజీగా విధులు నిర్వహిస్తున్నారు. ఆయనకు నోటీసులు పంపిన విషయాన్ని ఆ విభాగం ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. ఈ కేసులో వైసీపీ అధినేత జగన్‌తోపాటు మాజీ సీఐడీ డీజీ సునీల్ కుమార్, సస్పెండ్ ఐపీఎస్ అధికారి సీతారామాంజనేయులు, విజయపాల్, డాక్టర్ ప్రభావతి, తులసిబాబులపై రఘురామకృష్ణరాజు ఫిర్యాదు చేయడం, కేసు నమోదు కావడం జరిగిపోయింది.

ఇప్పటికే సీఐడీ మాజీ ఎస్పీ విజయ పాల్‌ను విచారించారు పోలీసులు. ఆయనకు సన్నిహితుడు కృష్ణాజిల్లా గుడివాడకు చెందిన తులసి‌బాబును సైతం విచారించారు. విజయ పాల్‌కు తులసి అత్యంత సన్నిహితుడిగా పేరు తెచ్చకున్నాడు. ఐపీఎస్ సునీల్ నాయక్ తర్వాత నెక్ట్స్ విచారణకు వెళ్లేదెవరు? ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ లేదా సీతారామంజనేయుల వంతు రానున్నట్లు పోలీసు వర్గాలు భావిస్తున్నాయి.

 

Related News

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

Big Stories

×