E-Paper
Advertisement

మీకు ఇదేగతి పడుతుంది.. వెయ్యిరెట్లు అనుభవిస్తారు.. వైసీపీ నేతపై యాంకర్ ఫైర్?

మీకు ఇదేగతి పడుతుంది.. వెయ్యిరెట్లు అనుభవిస్తారు.. వైసీపీ నేతపై యాంకర్ ఫైర్?
Advertisement

Rashmi Gautham: బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో రష్మీ గౌతమ్(Rashmi Gautham) ఒకరు. ప్రస్తుతం శ్రీదేవి డ్రామా కంపెనీ జబర్దస్త్ కార్యక్రమానికి యాంకర్ గా కొనసాగుతున్న ఈమె సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ నిత్యం తనకు సంబంధించిన విషయాలతో పాటు మూగ జంతువులకు సంబంధించిన అంశాల గురించి కూడా స్పందిస్తూ ఉంటారు. ఎవరైనా జంతువులను ఇబ్బందులకు గురి చేస్తే ఖచ్చితంగా ఈమె స్పందిస్తూ ఆగ్రహం వ్యక్తం చేస్తుంటారు. అయితే ప్రస్తుతం ఏపీలో పెట్రోల్ ,డీజిల్ కొరత ఏర్పడిన సంగతి తెలిసిందే. ఇలా పెట్రోల్ ,డీజిల్ కొరత కారణంగా వైసిపి నేతలు పెద్ద ఎత్తున నిరసనలు తెలియజేస్తూ ప్రభుత్వంపై మండిపడుతున్నారు.

ఎడ్ల బండిపై ఆటోతో నిరసన..

ఈ నేపథ్యంలోనే ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైసీపీ నేత భూమన అభినయ్ రెడ్డి(Bhumana Abhinay Reddy) గత రెండు రోజుల క్రితం తిరుపతిలో వినూత్న రీతిలో నిరసన తెలిపారు. పెట్రోల్ డీజిల్ కొరత ఉన్న నేపథ్యంలో ఈయన ఒక ఎడ్ల బండి పై ఆటోని ఎక్కించి అందులో జనాలు కూడా ఎక్కి ఎడ్ల బండి ద్వారా నిరసన తెలియజేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఈ వీడియో కాస్త జంతు ప్రేమికురాలు అయిన జబర్దస్త్ యాంకర్ రష్మీ కంటపడింది. మూగజీవాలను ఎవరైనా హింసిస్తే చూస్తూ ఊరుకొని ఈ యాంకరమ్మ ఈ వీడియో పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

వెయ్యిరెట్లు ఆవేదన చెందుతారు..

Advertisement

ఎడ్ల బండి పై ఆటో ఎక్కించి మరి ఆటోలో అలాగే ఎడ్ల బండి పై మనుషులు ఉండడంతో ఆ బండిని లాగడం కోసం ఎద్దు ఎంతో ఇబ్బంది పడింది. ఇలా రాజకీయాల కోసం మూగజీవాలను కూడా హింసిస్తున్న నేపథ్యంలో ఈమె ఈ వీడియో పై స్పందిస్తూ.. ఎవరైతే ఎడ్ల బండిపై ఎక్కి వెళ్తున్నారో వారందరికీ కూడా అదే గతి పడుతుందని ఆ ఎద్దు పడే ఆవేదన కంటే మీపై 1000రెట్లు ఎక్కువగా పడుతుంది అంటూ ఈమె తనదైన శైలిలోనే ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement

ఇలాంటి చర్యలపై పేట ఇండియా, యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా దయచేసి ఇలాంటి విషయాలను పరిశీలించాలని, ఈ చర్యలు పట్ల కఠినమైన నిబంధనలు అమలు చేయాల్సిన సమయం వచ్చిందని ఈమె తెలిపారు. ఇలా ఈ వీడియో పై రష్మీ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయడంతో పలువురు ఈమెకు మద్దతుగా సోషల్ మీడియాలో కామెంట్ చేయడం మరికొందరు యధావిధిగా రష్మీ వ్యాఖ్యలను విమర్శిస్తూ కామెంట్లు చేస్తున్నారు. గతంలో కూడా ఇలా మూగజీవాలను హింసించే వారి పట్ల వ్యతిరేకంగా పోస్టులు చేశారు .ఈ నేపథ్యంలోనే రష్మి కూడా కొంత వ్యతిరేకతను కూడా ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.

Also Read: కొరటాల బాలయ్య సినిమా ఫిక్స్ ..పవర్ ఫుల్ పోస్టర్ తో అధికారిక ప్రకటన!

Related News

సింగర్ అంతడుపుల రమాదేవి ఒక్క పాటకు ఎంత తీసుకుంటారో తెలుసా?

Telugu Tv Serials : సీరియల్స్ వీక్లీ రౌండప్.. ఆ ఒక్కటే మళ్లీ టాప్..

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి కొత్త టెన్షన్.. చింటును బాలు తెస్తాడా..? గుణ ప్లానేంటి..?

Podarillu Today Episode : నారాయణకు అడ్డంగా దొరికిన జమున.. కన్నా సీరియస్.. ఇదేం ట్విస్ట్..

Intinti Ramayanam Today Episode: అక్షయ్ మాటతో మీనాక్షి షాక్.. పల్లవికి మైండ్ బ్లాక్.. అరెస్ట్ చేస్తారా..?

Illu Illalu Pillalu Today Episodes: రెచ్చిపోయిన భాగ్యం.. రామరాజు మాస్ వార్నింగ్.. వల్లికి ఇంకో ఛాన్స్..

Sunday TV Movies : ఆదివారం టీవీల్లోకి బోలెడు సినిమాలు.. మస్ట్ వాచ్..

Nindu Noorella Saavasam Serial Today Episode October 18th‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరి కోల్‌ కతా వెళ్లడానికి వైజయంతి ఒప్పుకుంటుందా..?

Big Stories

Advertisement
×