E-Paper
Advertisement

827 కానిస్టేబుల్ ఉద్యోగాలు.. మంచి వేతనం, ఇంకా 4 రోజులే మాత్రమే..!

827 కానిస్టేబుల్ ఉద్యోగాలు.. మంచి వేతనం, ఇంకా 4 రోజులే మాత్రమే..!
Advertisement

ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు ఇది మంచి అవకాశం. ముఖ్యంగా పోలీస్ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే వారికి అయితే ఇది భారీ గుడ్ న్యూస్.. భారత ప్రభుత్వ హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలోని సశస్త్ర సీమా బల్ (SSB) భారీ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. గ్రూప్-సి నాన్-గెజిటెడ్ విభాగంలో వివిధ రకాల కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

కేంద్ర ప్రభుత్వ విభాగంలో స్థిరపడాలనుకునే నిరుద్యోగులకు ఇది ఒక అద్భుతమైన అవకాశం. ఆసక్తి ఉన్నవారు ఆన్‌లైన్ విధానంలో తమ దరఖాస్తులను సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన విద్యార్హత, ఉద్యోగ ఎంపిక విధానం, జీతం, దరఖాస్తు విధానం, తదితర అంశాల గురించి క్లియర్ కట్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

Advertisement

నోట్: దరఖాస్తుకు చివరి తేది:  2026 మే 4

పోస్టుల వివరాలు:  ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 827 పోస్టులను భర్తీ చేయనున్నారు. విభాగాలవారీగా ఖాళీలను పరిశీలిస్తే:

Advertisement

కానిస్టేబుల్ (డ్రైవర్ – పురుషులు): 553 పోస్టులు

కానిస్టేబుల్ (వెటర్నరీ): 34 పోస్టులు

కానిస్టేబుల్ (వాషర్‌మెన్): 74 పోస్టులు

కానిస్టేబుల్ (బార్బర్): 43  పోస్టులు

కానిస్టేబుల్ (గార్డెనర్): 41 పోస్టులు

కానిస్టేబుల్ (టైలర్): 41 పోస్టులు

కానిస్టేబుల్ (కోబ్లర్/షూ మేకర్): 25 పోస్టులు

కానిస్టేబుల్ (కార్పెంటర్): 07 పోస్టులు

కానిస్టేబుల్ (వాటర్ క్యారియర్): 05 పోస్టులు

కానిస్టేబుల్ (వెయిటర్): 03 పోస్టులు

కానిస్టేబుల్ (నర్సింగ్ ఆర్డర్లీ): 1

విద్యార్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి పదో తరగతి (మెట్రిక్యులేషన్) ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. డ్రైవర్ పోస్టులకు భారీ వాహనాల డ్రైవింగ్ లైసెన్స్ (హెవీ వెహికల్స్) తప్పనిసరిగా ఉండాలి. వెటర్నరీ అలాగే నర్సింగ్ ఇతర ట్రేడ్ పోస్టులకు సంబంధిత విభాగంలో ఏడాది అనుభవం లేదా ఐటీఐ సర్టిఫికేట్ కలిగి ఉండాలి.

వయోపరిమితి: వయస్సు విషయానికొస్తే డ్రైవర్ అలాగే వెటర్నరీ నర్సింగ్ ఆర్డర్లీ పోస్టులకు 18 నుంచి 27 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి. కార్పెంటర్ పోస్టులకు 18 నుంచి 25 ఏళ్లు కాగా మిగిలిన ఇతర పోస్టులకు 18 నుంచి 23 ఏళ్ల లోపు ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ,ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు.. అలాగే ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాల వయో సడలింపు లభిస్తుంది.

వేతనం: ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 21700 నుంచి రూ. 69100 వరకు వేతనం అందుతుంది.

సెలెక్షన్ ప్రాసెస్: అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ వివిధ దశల్లో సాగుతుంది. శారీరక సామర్థ్య పరీక్షలు (పీఈటీ/పీఎస్‌టీ) రాత పరీక్ష, సర్టిఫికెట్ పరిశీలన వైద్య పరీక్షల ఆధారంగా తుది ఎంపిక చేస్తారు. ప్రతి దశలోనూ ప్రతిభ కనబరిచిన వారికే ఉద్యోగం దక్కుతుంది.

దరఖాస్తు ఫీజు: జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులు రూ. 100 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, మహిళలు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు.

దరఖాస్తుకు చివరి తేది: 2026 మే 4

అపీషియల్ వెబ్ సైట్: https://ssb.gov.in/

ALSO READ: గ్యాస్ వినియోగదారులకు ఆయిల్ కంపెనీలు షాక్.. భారీగా పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు, రూ. 993 పెంపు

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×