HBD Samantha:తమిళ సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ నటి సమంత (Samantha )తెలుగులో ‘ఏ మాయ చేసావే’ సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇందులో జెస్సీ పాత్రతో అమ్మాయిల కలల రాకుమారిగా పేరు దక్కించుకున్న ఈమె .. ఇదే సినిమాలో హీరోగా నటించిన నాగచైతన్య (Naga Chaitanya) తో ప్రేమలో పడి పెళ్లి చేసుకుంది. పెళ్లయిన నాలుగేళ్లకే విడాకులు ఇచ్చి.. మయోసైటిస్ వ్యాధి బారిన పడి చికిత్స కోసం విదేశాలకు వెళ్లిన ఈమె అక్కడే కొంతకాలం ఉండి.. మళ్లీ ఇండియాకి వచ్చి కొన్ని సినిమాలు చేసింది. కానీ అవేవీ పెద్దగా ఈమె కెరియర్ కు దోహదపడలేదు. ఆ తర్వాత ఏడాది పాటు ఇండస్ట్రీకి బ్రేక్ ఇచ్చి మళ్లీ సినిమాలలో కం బ్యాక్ ఇచ్చిన సమంత ఒకవైపు హిందీలో వెబ్ సిరీస్ లు చేస్తూ.. కొత్తగా ట్రాలాలా అనే నిర్మాణ సంస్థను స్థాపించి నిర్మాతగా కూడా గుర్తింపు తెచ్చుకుంది.
ప్రస్తుతం సమంత బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడిమోరును రెండవ వివాహం చేసుకున్న తర్వాత కెరియర్ పై మళ్ళీ ఫోకస్ పెట్టింది. అలా ఒకవైపు తన నిర్మాణ సంస్థ ట్రాలాలా బ్యానర్లో ‘మా ఇంటి బంగారం’ అనే సినిమాలో నటిస్తూనే.. సహ నిర్మాతగా కూడా వ్యవహరిస్తోంది. మే 15వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో వరుస ప్రమోషన్స్ లో పాల్గొంటూ ఎన్నో విషయాలు పంచుకుంటున్న ఈమె.. కోట్ల రూపాయల నష్టాన్ని చవి చూశాను అంటూ తెలిపింది. ఇక అందులో భాగంగానే తాను చేసింది తప్పు అని.. అది తెలుసుకోవడం వల్లే కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని తెలిపింది సమంత..మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సమంత మాట్లాడుతూ
.” నేను 20 సంవత్సరాల వయసులోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాను. అప్పట్లో సక్సెస్ అంటే ఎన్ని ప్రాజెక్టులు చేశాం .. ఎన్ని యాడ్స్ చేస్తున్నాము . ఎన్ని పెద్ద బ్రాండ్స్ కు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నాము.. అనే దానిపైనే ఆధారపడి ఉండేది . అందుకే అప్పట్లో నేను స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకోవడానికి ఎన్నో మల్టీ నేషనల్ బ్రాండ్స్ కి అంబాసిడర్ గా వ్యవహరించాను ..ఆ సమయంలో అది నాకు చాలా సంతోషాన్నిచ్చింది . అయితే కొన్ని బ్రాండ్స్ ను ప్రమోట్ చేయడం వల్ల నష్టం చేకూరుతున్నట్లు తెలుసుకున్నాను. నిజానికి మనం ఒక ఉత్పత్తిని ప్రమోట్ చేస్తున్నాము అంటే ఎంతో బాధ్యతగా వ్యవహరించాలనే విషయాన్ని నేను తెలుసుకున్నాను.. ఒకప్పుడు ఇష్టం వచ్చినట్లుగా బ్రాండ్లకు అంబాసిడర్ గా వ్యవహరించాను. అందుకు నాకు నేనే క్షమాపణ చెబుతున్నాను. గడిచిన ఏడాది కాలంలో సుమారుగా 15 బ్రాండ్ ఎండార్స్మెంట్లను కూడా నేను వదులుకున్నాను . ఫలితంగా కోట్ల రూపాయల కూడా నష్టపోవాల్సి వచ్చింది.
ALSO READ:తండ్రి చేతుల మీదుగా క్లాప్స్ కొట్టిన రామ్ చరణ్ సినిమా.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?
అయితే అన్నింటికంటే ముఖ్యం ప్రేక్షకుడు మనల్ని నమ్ముతున్నాడు. ఇక ప్రజలకు ఉపయోగపడే వస్తువులను మాత్రమే ప్రమోట్ చేయాలని అప్పుడే నిర్ణయించుకున్నాను. అందుకే ఏది పడితే అది ప్రమోట్ చేయకుండా ప్రజలకు హాని కలిగించకుండా ఉపయోగపడే వాటిని ప్రమోట్ చేయాలని నిర్ణయించుకున్నాను. ఇకపోతే ఇప్పటికీ నా వద్దకు ఎన్నో ఉత్పత్తులకు సంబంధించిన కమర్షియల్ ప్రకటనలు వస్తూ ఉంటాయి. కానీ నేను ఏదైనా ఒక బ్రాండ్ ను ప్రమోట్ చేసే ముందు సుమారుగా ముగ్గురు వైద్యులతో తనిఖీ చేస్తాను. అవి సమాజానికి ఎటువంటి హాని చెయ్యవని నేను నిర్ణయించుకున్నాకే అప్పుడు ప్రమోట్ చేస్తాను అంటూ సమంత తెలిపింది. మొత్తానికి అయితే సమంత తీసుకున్న నిర్ణయం అభిమానులను సంతోషపరుస్తోంది. ఇకపోతే ఈరోజు సమంత పుట్టినరోజు కావడంతో ఈమెకు సంబంధించిన ఇలా ఎన్నో విషయాలు కూడా మళ్లీమళ్లీ వైరల్ అవుతున్నాయి.