Intinti Ramayanam Today Episode October 24th : నిన్నటి ఎపిసోడ్ లో.. ఇంట్లో టీవీ కొన్నందుకు అందరూ కలిసి పెద్ద రచ్చ చేస్తారు. కానీ శ్రీకర్ మాత్రం శ్రియా కి సపోర్ట్ చేస్తాడు. నా భార్య ఏది చేసినా అది కరెక్టే నా భార్యను ఎవరేమన్నా నేను అసలు ఊరుకోను అని అంటాడు. తన భర్తని బెడ్ రూమ్ లోకి తీసుకెళ్లిన తర్వాత శ్రియా నాకు సపోర్ట్ చేసినందుకు థాంక్స్ అండి అని అవని అంటుంది. ఇక శ్రీయ మనం కొత్త టీవీని ఓపెన్ చేసి ఇష్టమైన ఛానల్ పెట్టుకుని చూద్దామని అంటుంది. ఇద్దరు కలిసి రాతిరి టీవీ పెట్టుకుని పెద్దగా సౌండ్ పెట్టి రచ్చ రచ్చ చేస్తూ ఉంటారు. వీళ్ళ సౌండ్ కి లేచిన కమల్ ఇంట్లో అందరూ పడుకున్నారు ఆ మాత్రం మీకు బుద్ధి లేదా అని అంటాడు. మాటీవీ మా ఇష్టం మా గదికి రావాల్సిన అవసరం నీకేంటి అని శ్రియ అంటుంది. నువ్వు ముందు ఇకనుంచి వెళ్ళు అని శ్రేయ కమల్ తో సీరియస్గా అంటుంది. దీపావళి పండుగ సందర్భంగా ఇంట్లోని వాళ్ళందరికీ బట్టలు తీసుకొస్తుంది అవని. వాటిని పల్లవి శ్రియా ఇద్దరు వంకలు పెడతారు. ఆ తర్వాత దీపావళి కోసం పూజ చేస్తారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే…పూజ మొదలు పెడదామని భానుమతి అంటుంది. అయితే పూజకి అంత సిద్ధం చేసి పంతుల్ని పిలిచిన తర్వాత.. లక్ష్మీదేవి రూపు లేకుండా పూజ చేయడం ఎలా అని పల్లవి అవనీని దారుణంగా అవమానిస్తుంది. ఆ మాత్రం తెలియకుండానే ఇంత గొప్పగా పూజ చేయాలని అనుకోవడం ఏంటి అని పల్లవి శ్రియ ఇద్దరు కూడా సందు దొరికితే అవనిపై పడిపోతుంటారు. అప్పుడే అవనీని బయట నుంచి ఎవరో పిలిచినట్టు అనిపిస్తుంది. అక్కడికి వెళ్ళగానే షాప్ లో బట్టలు తీసుకున్నారు కదా మేడం మీకు లక్ష్మీదేవి రూప్ ని గిఫ్ట్ గా ఇచ్చారు అని అనగానే అవని సంతోషపడుతుంది. ఆ రూపును తీసుకొచ్చి పూజలో పెట్టమని పంతులుగారికి ఇస్తుంది. గురు కోడలు తెచ్చిన లక్ష్మీదేవి రూపంతో పంతులుగారు పూజని పూర్తి చేస్తారు..
పూజ తర్వాత అందరూ బయటకు వెళ్లి దీపాలను వెలిగించి దీపావళి పండుగ సంబరాలను మొదలు పెడతారు. అందరూ కాకరపువ్వొత్తులు తీసుకొని కాలుస్తూ సరదాగా ఉంటారు. అయితే ఆరాధ్య కమల్ దగ్గరకొచ్చి బాబాయ్ సంక్రాంతి పండుగ రైతులు జరుపుకుంటారు మరి దీపావళి పండుగని ఎవరు జరుపుకుంటారు? ఎందుకు జరుపుకుంటారు? అని అడుగుతుంది. కమల్ ఆలోచిస్తూ ఉండగా రాజేంద్రప్రసాద్ నేను చెప్తాలేరా అని అంటాడు.
ఈ కృష్ణుడు సత్యభామ నరకాసురుని వధించిన రోజు కాబట్టి ఈరోజు అందరూ ప్రజలు బాంబులు పేలుస్తూ దీపాలు వెలిగించి దీపావళి పండుగను చేసుకుంటారు అని అంటాడు.. దానికి ఉదాహరణ చెప్పాలంటే నరకాసురుడు మీ పిన్ని.. మీ అమ్మ సత్యభామ లాగా వధించింది కదా అది ఉదాహరణ అని ఆరాధ్య తో అంటాడు. ఉదాహరణ చెప్పడానికి నేను తప్ప ఇంకెవరూ లేరా అని పల్లవి అంటుంది. అందకపోతే కూడా ఏంట్రా ఈ గొడవలు పదో అందరం కలిసి బాంబులను పేలుద్దామని భానుమతి అంటుంది.
ఒక పెద్ద బాంబును తీసుకొచ్చి ఈ బాంబును నేను పెడతానని కమలంటాడు.. పల్లవిని బాంబులు కాలుస్తావా అని అడుగుతాడు.. అమ్మో నాకు బాంబులు అంటే చాలా భయం నేను కాలువను అని పల్లవి అంటుంది. అయితే నేను కలుస్తా పదరా నీ వయసులో ఉన్నప్పుడు నేను ఎన్ని కాల్చానో తెలుసా అని భానుమతి అంటుంది. ఇది చాలా పవర్న్న బాంబు.. నువ్వు కాలిస్తే చచ్చిపోతావ్ అని అంటాడు.. ఎవరు ఎంత చెప్పినా కూడా భానుమతి వినకుండా బాంబులు కాల్చడానికి ముందుకు వెళ్తుంది. ఆ బాంబు ని అలా కాలవగానే అది పెద్ద సౌండ్తో రావడంతో బానుమతి భయపడిపోతుంది.
ఆ తర్వాత భానుమతి ముఖమంతా నల్లగా మారిపోవడంతో అందరూ నవ్వుతారు. ఎందుకురా నవ్వుతున్నారు అని అనగానే నీ మొహం ఒకసారి చూసుకోవే ముసలి అని కమల్ అంటాడు. తనకి దీపావళి పండుగ సరదాగా జరుగుతుంది. తర్వాత రోజు ఉదయం భానుమతి రాజేంద్రప్రసాద్ ఇద్దరూ కూడా వాకింగ్ చేసి వస్తారు.. అవని ఎక్కడుంది కనిపించలేదు అని రాజేంద్రప్రసాద్ అడుగుతాడు. ఆఫీస్ కి వెళ్ళాలని ఏదో పని ఉందని హడావిడిగా ఉంది అందుకే నేను ఏమీ మాట్లాడలేదండి అని పార్వతి అంటుంది. పార్వతి మాటలు విన్న పల్లవి అవని దగ్గరికి వెళ్లి ఏంటి ఇంత కంగారుపడుతుంది తొందరగా వెళ్ళాలి అనుకుంటా.. నేను ఒక పది నిమిషాల్లో ఫ్రెష్ చేయి వస్తాను అని చెప్పింది కదా నేను వెళ్లి స్నానానికి లేటు చేస్తాను అప్పుడు అవని ఎలా ఆఫీస్ కి వెళ్తుందో చూస్తాను అని తనలో తానే మాట్లాడుకుంటుంది.
Also Read : బాలు కోసం కన్నీళ్లు పెట్టుకున్న మీనా.. సత్యం క్షమాపణ.. తాగొచ్చిన బాలు..
పల్లవి మాట విన్న ఆరాధ్య పిన్ని నువ్వు ఇలాంటి ప్లాన్ చేస్తావని అస్సలు అనుకోలేదు నీకు దిమ్మతిరిగే షాక్ ఇస్తాను అని అనుకుంటుంది. అవని స్నానానికి వెళ్తుంటే పల్లవి నేను స్నానానికి వెళ్తాను నాకు చాలా ముఖ్యమైన పని ఉంది. బయటికి వెళ్లాలి అని అంటుంది. పల్లవి కావాలనే బాత్రూంలోకి వెళుతుంది కాసేపు ఆగిన తర్వాత కేకలు వేస్తూ బయటకు వచ్చేస్తుంది. ఏమైంది ఎందుకలా కేకలు వేసావు అని అవని అడుగుతుంది. ఆరాధ్య ముందుగానే అవనికి అసలు విషయం చెప్పడంతో నవ్వుకుంటుంది. అవని స్నానం చేసే బయటకొచ్చేస్తుంది. అక్షయ్ అవని ఇద్దరు కలిసి లాయర్ ను కలవడానికి వెళ్తారు. రాజేంద్రప్రసాద్ కి టాబ్లెట్ ఇవ్వాల్సిన సంగతి పార్వతి మర్చిపోతుంది.. అవని అక్షయ్ రావడానికి లేట్ అవుతుంది కదా అని శ్రియకు టాబ్లెట్ తీసుకు రమ్మని అడుగుతుంది పార్వతి.. శ్రియ నేను తీసుకురాను అని మొహం మీదే చెప్పేస్తుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. సోమవారం ఎపిసోడ్లో కమల్ ఉద్యోగంలో చేరిన విషయాన్ని అందరితో పంచుకుంటాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి..