 
					Big tv Kissik Talks: బిగ్ టీవీ(Big tv) ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కిస్సిక్ టాక్స్ (Kissik Talks)కార్యక్రమానికి తాజాగా సినీ నటి కస్తూరి శంకర్(Kasturi Shankar) హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా కస్తూరి శంకర్ ఎన్నో విషయాల గురించి మాట్లాడారు. అయితే ఈమె గతంలో తమిళ బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొన్న సంగతి తెలిసిందే. వైల్డ్ గార్డ్ ఎంట్రీ ద్వారా ఒక వారం రోజుల పాటు బిగ్ బాస్ కార్యక్రమంలో ఉన్నారు. ఈ క్రమంలోనే యాంకర్ వర్ష కస్తూరి మధ్య బిగ్ బాస్ గురించి ప్రస్తావన రావడంతో వర్ష తెలుగు బిగ్ బాస్ చూస్తారా అంటూ ప్రశ్న వేశారు.
ఈ ప్రశ్నకు కస్తూరి శంకర్ మాట్లాడుతూ అప్పుడప్పుడు బిగ్ బాస్ హైలెట్స్ మాత్రమే చూస్తుంటానని తెలిపారు. మరి ఈ సీజన్ లో విన్నర్ ఎవరవుతారని మీరు భావిస్తున్నారు అంటూ వర్ష ప్రశ్నించడంతో బిగ్ బాస్ విన్నర్ గురించి కస్తూరి శంకర్ ఆసక్తికరమైన విషయాలను తెలిపారు. ఈ సీజన్ లో కచ్చితంగా నిఖిల్ నాయర్ (Nikhil Nayar)విన్నర్ అవుతారని కస్తూరి తెలిపారు. అతను గెలిచే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి కచ్చితంగా నా కొడుకే గెలుస్తాడు అంటూ కస్తూరి శంకర్ వెల్లడించారు. అయితే వీరిద్దరూ తల్లి కొడుకుల గా స్టార్ మాలో ప్రసారమైన ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లో నటించిన సంగతి తెలిసిందే.
ఇలా ఇంటింటి గృహలక్ష్మి సీరియల్లో కస్తూరి కొడుకు పాత్రలో నిఖిల్ నటించి సందడి చేశారు అందుకే తను అంటే నాకు చాలా ఇష్టమని కచ్చితంగా నిఖిల్ సీజన్ విన్నర్ అవుతారు అంటూ కస్తూరి జోస్యం చెప్పారు. మరి కస్తూరి చెప్పిన ఈ జోస్యం ఎంతవరకు నిజమవుతుందో తెలియాల్సి ఉంది. ఇక నిఖిల్ పలు వెబ్ సిరీస్ లలో నటించారు అలాగే బుల్లితెర సీరియల్స్ లో నటించి మంచి సక్సెస్ అందుకున్నారు స్టార్ మా లో ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ తో పాటు, పలుకే బంగారమాయనే అనే సీరియల్స్ లో నటించారు.
ఇక నిఖిల్ బిగ్ బాస్ మొదటి వారంలో కాకుండా వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా హౌస్ లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఇక ఈయన హౌస్ లో తనదైన శైలిలోనే ఆట తీరును కనబరుస్తూ మంచి ఆదరణ సొంతం చేసుకున్నారు. నిఖిల్ హౌస్ లో ఫిజికల్ టాస్కులలో అద్భుతంగా ఆడుతూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు. ఇక ఈయన ఆట తీరు చూస్తుంటే కస్తూరి చెప్పిన విధంగానే విన్నర్ అయిన ఆశ్చర్య పోవాల్సిన పనిలేదని చెప్పాలి. ఇక తెలుగు సీరియల్స్ లో నటించడం వల్ల నిఖిల్ నాయర్ కు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది. అలాగే ఈ కార్యక్రమానికి హోస్టుగా వ్యవహరిస్తున్న నాగార్జున గురించి కూడా పలు విషయాలు తెలియజేశారు. నాగార్జున అంటే నాకు క్రష్ అని, ఒక రోజు ఆయన షేక్ హ్యాండ్ ఇవ్వడంతో రెండు రోజులు పాటు నేను చేయి కూడా కడగలేదు అంటూ నాగార్జున పై ఉన్న ఇష్టాన్ని బయటపెట్టారు. తనతో సినిమా చేసే అవకాశం వస్తే తాను ఎప్పుడు సిద్ధంగానే ఉంటానని తెలిపారు ఇక వీరిద్దరూ కలిసి అన్నమయ్య సినిమాలో నటించిన సంగతి తెలిసిందే.
Also Read: Nara Rohit -Siri Lella: ఘనంగా నారా రోహిత్ సిరి లెల్లా హాల్దీ..ఫోటోలు వైరల్!