BigTV English
Advertisement

Nindu Noorella Saavasam Serial Today october 25th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అమర్‌ ఇంటికి మారువేళంలో వచ్చిన చంభా

Nindu Noorella Saavasam Serial Today october 25th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అమర్‌ ఇంటికి మారువేళంలో వచ్చిన చంభా

Nindu Noorella Saavasam Serial Today Episode: రణవీర్‌ ఇంటికి వెళ్లిన మనోహరి కోపంగా చూస్తూ కూర్చుని ఉంటుంది .ఇంతలో రణవీర్‌ కాఫీ తీసుకొచ్చి కాఫీ తాగు మనోహరి అని చెప్తాడు. దీంతో మనోహరి తనకు కాఫీ తాగాలని లేదు అని చెప్తుంది. దీంతో రణవీర్‌ ఏం విషం తాగాలని ఉందా..? దెబ్బ మీద దెబ్బ పడుతుంటే ఆశ చచ్చిపోతుందా..? ఆ ఆశతో పాటు నీ శ్వాస కూడా ఆపుకోవాలని ఉందా…? అనగానే.. కాఫీ కప్పు తీసుకుని కింద వేసి పగులగొట్టి నా ఆశ ఎప్పటికీ చావదు. నేను బతికి ఉన్నంత వరకు నా ఆశ ఎప్పటికీ చావదు. నాకు అడ్డుగా ఉన్న భాగీని దాని కడుపులో ఉన్న బిడ్డను చంపే తీరతాను.. అంటుంది. కాఫీ కప్పు పగులగొట్టినంత ఈజీ కాదు ఆ భాగీని చంపడం అంటాడు రణవీర్‌.


దీంతో మంచినీళ్లు తాగినంత ఈజీగా ఆ ఆరును చంపేస్తాను.. నాకు ఈ భాగీ ఓ లెక్కకాదు.. అంటుంది. అప్పుడు లెక్క వేరు ఇప్పుడు లెక్క వేరు మనోహరి అంటాడు రణవీర్‌. ఎప్పటికీ నాది ఒక్కటే లెక్క రణవీర్‌. ఈరోజు భాగీ తనంతట తాను తన బిడ్డను చంపుకోవాలనుకుంది కాబట్టే అమర్‌ కాపాడాడు. కానీ రేపు భాగీని చంపడానికి నేను వేసే ప్లాన్‌ ఆ దేవుడు కూడా ఆపలేడు.. అంటుంది మనోహరి.. నీకే ఇంకా అర్థం కావడం లేదు మనోహరి. నీ ఆశయం కోసం నువ్వే ఎన్నో సంవత్సరాలుగు ఎదురుచూస్తున్న నీ ఆశ తీరలేదు. అంటే దాని అర్థం ఇక ఎప్పటికీ తీరదు అని నా మాట విను మనోహరి. కొన్ని అసాధ్యమైన పనులు ఉంటాయి. మనం వాటి జోలికి వెళ్లకపోవడమే మంచిది. ఆల్‌ రెడీ నేను అమరేంద్రకు రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికిపోయాను. అమరేంద్రను చంపాలని ప్రయత్నించి తన చేతిలో చావు దెబ్బలు తిన్నాను.. ఇప్పుడు నువ్వు నా వైఫ్‌ అని తెలిస్తే.. మనిద్దరిని కలిపి చంపేస్తాను.. అది జరగక ముందే మనం కోల్‌ కతా వెళ్లిపోదాం అంటాడు రణవీర్‌.

దీంతో మనోహరి కోపంగా నేను నీలాగా పిరికిదాన్ని కాదు రణవీర్‌ నాకు చావంటే భయం లేదు.. నేను ఎక్కడికి పారిపోను.. చావైనా.. బతుకైనా అమర్‌ తోనే అని డిసైడ్‌ అయ్యాను. అది నెరవేరే వరకు పోరాడతాను. నువ్వు అన్నట్టు అది అసాధ్యం అయినా సరే చివరి క్షణం వరకు సాధ్యం చేసుకోవడానికి ప్రయత్నిస్తాను అంటుంది మనోహరి. పిరికితనం పెద్ద విషయం కాదు మనోహరి కొన్నింటికి భయపడి తీరాలి. ఒక్కసారి వెనకడుగు వేస్తేనే బతకగలం అని రణవీర్‌ చెప్పగానే.. ఇంత దూరం వచ్చాక ఇంకా వెనకడుగు వేయడం ఏంటి రణవీర్‌… నా ఆశను నిరాశను చేసి ఆ అరుంధతి, అమరేంద్రకు భార్య అయి నలుగురు పిల్లలకు తల్లి అయింది. అది పోయింది అనుకుంటే ఆ స్థానంలోకి మళ్లీ ఈ భాగీ వచ్చింది. ఇప్పుడు ఇది కూడా తల్లి అవబోతుంది. దాని కడుపులో బిడ్డకు రోజు రోజుకు ఆయుష్సు పెరిగితే నా ఆయుష్సు తగ్గినట్టే.. భాగీని దాని బిడ్డను అంతం చేసి  అమరేంద్రను నా సొంతం చేసుకునే వరకు నా అడుగు ముందుకే పడుతుంది. నీకు చేతనైతే నాకు సాయం చేయ్‌ అంతే కానీ చెత్త సలహాలు ఇవ్వకు.. చావు కబుర్లు చెప్పకు అంటూ కోపంగా వెళ్లిపోతుంది మనోహరి. నువ్వు మారవు మనోహరి నీ చావు నువ్వు చావు అని రణవీర్‌ అనుకుంటాడు.


తర్వాత మనోహరి చెప్పడంతో చంభా తన గెటప్‌ మార్చేసి మిస్సమ్మకు కేర్‌ టేకర్‌గా అమర్‌ ఇంటికి వస్తుంది. చంభాను రాథోడ్ వెళ్లి ఇంటికి తీసుకొస్తాడు. చంభాను చూసిన మిస్సమ్మ ఎవరు రాథోడ్‌ అని అడుగుతుంది.  కేర్‌ టేకర్‌ అంట మిస్సమ్మ అని రాథోడ్‌ చెప్పగానే.. ఎవరికి అని మిస్సమ్మ అడుగుతుంది. ఇంతలో అక్కడికి వచ్చిన అమర్ నీకే భాగీ అని చెప్తాడు. నాకా నాకెందుకు కేర్‌ టేకర్‌ అని మిస్సమ్మ అడగ్గానే.. ఇంట్లో నువ్వు ఒంటరిగా ఉంటున్నావు కదా అందుకే నీకు తోడుగా ఉంటుందని తీసుకొచ్చాను అంటాడు అమర్‌. అయితే ఇన్నాళ్లు ఇంట్లో నేను ఒంటరిగానే ఉంటున్నాను కదండి.. అని చెప్తుంది. దీంతో అమర్‌ అవును భాగీ ఒంటరిగానే ఉంటున్నావు.. నువ్వు ఇంట్లో మార్నింగ్‌ నుంచి ఈవెనింగ్‌ వరకు నువ్వు ఒంటరిగానే ఉంటున్నావు.. కానీ ఇప్పుడు నీకు తోడుగా ఎవరో ఒకరు ఉండాలి కదా అని అమర్‌ చెప్తుండగానే.. పిల్లలు రెడీ అయి కిందకు వస్తారు. ఎవరు మీరు అని అంజు అడుగుతుంది. నేను కేర్‌ టేకర్‌ అమ్మా అని చంభా చెప్పగానే.. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టు ఉందే అని అంజు అనుమానంగా చూస్తుంది. చంభా భయపడుతుంది. ఇంతలో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

Illu Illalu Pillalu Today Episode: ప్రేమ దెబ్బకు శ్రీవల్లికి షాక్.. బొమ్మ చూపించిన నర్మద.. అమూల్య కోసం విశ్వం మాస్టర్ ప్లాన్..?

Intinti Ramayanam Today Episode: ఇంట్లో దీపావళి సంబరాలు.. భానుమతికి షాక్.. పల్లవికి కమల్ కౌంటర్..

Brahmamudi Serial Today October 25th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రాజ్‌కు గుడ్‌ న్యూస్‌ చెప్పిన డాక్టర్‌  

GudiGantalu Today episode: బాలు కోసం కన్నీళ్లు పెట్టుకున్న మీనా.. సత్యం క్షమాపణ.. తాగొచ్చిన బాలు..

Today Movies in TV : శనివారం టీవీల్లోకి వచ్చేస్తున్న సినిమాలు.. మూవీ లవర్స్ మాస్ జాతరే..

Illu illaalu Pillalu Bhagyam : ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు ‘ భాగ్యం జీవితంలో అన్నీ కష్టాలే.. గుండె తరుక్కుపోతుంది..!

Big TV Kissik talks Promo: ఆ హీరో పక్కన ఐటమ్ సాంగ్ చేస్తానంటున్న కస్తూరి.. కోరిక మామూలుగా లేదుగా!

Big Stories

×