Illu Illalu Pillalu Today Episode October 25th : నిన్నటి ఎపిసోడ్ లో.. శ్రీవల్లి మాత్రం మందు తాగేసిందంటే నాకు చుక్కలు చూపిస్తుంది అని టెన్షన్ పడుతూ గదిలోకి వెళ్లి దుప్పటి ముసుగేసుకుని భయపడుతూ ఉంటుంది.. అప్పుడే బల్లెక్కా అంటూ ప్రేమ నట్లు అనిపించడంతో శ్రీవల్లి బాబోయ్ నా పక్కనే ఉండి పిలిచినట్లు అనిపిస్తుంది. ఎక్కడుంది అని అనుకుంటుంది. కంటిన్యూగా ఆపకుండా పిలవడంతో ఏంటి ప్రేమ వచ్చేసినట్టుంది ఇక నా పని మెడ మీద కత్తి అయినట్లే అయిపోయింది అని శ్రీవల్లి షాక్ అవుతుంది.. ప్రేమ పిలుపు విని ఎక్కడుందబ్బా అని వెతుకుతూ భయపడుతూ టెన్షన్ పడుతూ కనిపిస్తుంది.. మొత్తానికి మరోసారి ప్రేమకు శ్రీవల్లి దొరికిపోతుంది.. ఒక ఆట ఆడుకుంటుంది. అంతే కాదు రొమాంటిక్ సాంగ్ తో పెద్ద రచ్చ చేస్తుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది..
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. తాగిన మత్తులో రొమాంటిక్ సాంగ్ తో రచ్చ చేస్తుంది. నువ్వు నాకు ముద్దు పెట్టావా లేదా చెప్పు అని ప్రేమ ఎంత అడిగినా ధీరజ్ చెప్పకుండా ఇంట్లోకి వెళ్లిపోతాడు. చీర మార్చుకుని వచ్చిన ప్రేమ యేల యేలా పాటకు డ్యాన్స్ వేస్తుంది. వేదవతి నర్మద ఇద్దరు నిద్రలేచి ప్రేమ కొంప ముంచేలా ఉంది అని బయటకు వస్తారు. ప్రేమతో కలిసి ముగ్గురు అదిరిపోయే డాన్స్ వేస్తారు.. వాళ్ళు లోపలికి వెళ్లి వాళ్ళ భర్తలతో డాన్సులు వేస్తారు. ధీరజ్ తో ప్రేమ డాన్స్ వేయిస్తుంది. అరె ధీరజ్ నువ్వు నాకు ముద్దు పెట్టావా లేదా అని అడుగుతుంది. నీకు నేను ముద్దు పెట్టలేదే అని అనగానే ప్రేమ ఒక్కసారిగా షాక్ అవుతుంది.
ఉదయం లేవగానే ప్రేమ రాత్రి చేసిన రచ్చని తెలుసుకొని శ్రీవల్లి టెన్షన్ పడుతూ భయపడుతూ ఉంటుంది.. మళ్లీ నేను ప్రేమకు దొరక్కుండా ఉండాలి అని కంగారుపడుతూ బయటికి వస్తుంది.. ఇప్పుడే ప్రేమ బల్లి అక్క అని పిలుస్తుంది.. బాబోయ్ రాత్రంతా నన్ను ఒక ఆట ఆడుకునింది ఇప్పుడు మళ్లీ నాకు చుక్కలు చూపించేలా ఉంది అని డైనింగ్ టేబుల్ కింద దాక్కుంటుంది.. ప్రేమ బల్లి కోసం ఇల్లంతా వెతుకుతుంది. చివరికి టేబుల్ కింద ఉండడంతో శ్రీవల్లి చెయ్యిని ప్రేమ తోక్కడంతో కెవ్వు మంటుంది.
నీకు రాత్రి జరిగిందంతా గుర్తులేదా చెల్లి అని శ్రీవల్లి అడుగుతుంది.. ఏం గుర్తులేదు అక్క ఏమైంది అని శ్రీవల్లి అడుగుతుంది. ఏం లేదులే నువ్వు ఎందుకు నన్ను పిలిచావు అని అంటుంది.. నేను తలనొప్పిగా ఉంది. కాఫీ పెట్టిస్తావని అడుగుదామని వచ్చాను.. నువ్వు కాఫీ బాగా పెడతావు కదా అక్క ఒక కప్పు కాఫీ ఇవ్వమని అడుగుతుంది. ప్రేమ మాటతో షాక్ అయిన శ్రీవల్లి అలాగే తీసుకొచ్చి ఇస్తాను అని అంటుంది. ఇక నర్మదా వేదవతి అక్కడికి వచ్చి రాత్రి ఏం జరిగిందో నీకు అసలు గుర్తులేదా అని అంటారు. ఏం జరిగిందో నాకు అసలు గుర్తులేదు ఏమైంది ఇందాక శ్రీవల్లి అక్క కూడా ఏం జరిగిందో గుర్తు లేదా అని అడిగింది అని చెప్తుంది.
వేదవతి మొత్తం ఫ్లాష్ బ్యాక్ ని ఒకసారి రివైజ్ చేసి చూపిస్తుంది.. రొమాంటిక్ సాంగ్ తో నువ్వు చేసిన రచ్చ అంతా కాదు అని చెప్పగానే అవునా నేను అంత రచ్చ చేశానా అని అమాయకంగా ప్రేమ ఉంటుంది.. అంత అమాయకంగా అనాల్సిన అవసరం లేదమ్మా నువ్వు చేసింది చూస్తే నువ్వేంటో అర్థం అవుతుంది అని ఇద్దరు ఒకేసారి అంటారు.. రేవతి గుడికి వెళ్లి వచ్చిన తర్వాత రావణ దహనం దగ్గరికి నేను వస్తాను అక్కడ బాగా జరుగుతుంది అంట కదా మన ఇంట్లో పండగ తర్వాత అక్కడికి వెళ్దాం అండి మీరు కూడా రండి అని అడుగుతుంది.. సేన కోపంగా మన ఇంట్లో పండగ ఎక్కడుంది నా చెల్లితో ఆ పండగ పోయింది. నా కూతురు తర్వాత ఆ పండగలు అనేవి లేవు అని కోపంగా అంటాడు.
అది విన్న విశ్వం మన ఇంటికి మళ్ళీ మంచి రోజులు వస్తాయి నాన్న ప్రేమ మళ్ళీ మన ఇంటికి త్వరలోనే రాబోతుంది అని అంటాడు. ఆ రామరాజు వల్ల మన కుటుంబంలో సంతోషం పోయిన సరే మళ్లీ ప్రేమతో ఆ సంతోషం మళ్ళీ నిండిపోతుంది అని విశ్వం అంటాడు.. ఏం మాట్లాడుతున్నావ్ రా ఈమధ్య నువ్వు తేడాగా మాట్లాడుతున్నావు అని రేవతి అంటుంది.. మరి కొద్ది రోజుల్లో నువ్వే చూస్తావు కదా జరగాల్సినవన్నీ జరుగుతాయి. ఆ దేవుడు మనకు కూడా మంచి రోజుల్ని ఇస్తాడు అని విశ్వం అంటాడు. రేవతి ప్రేమ కాపురాన్ని ఎక్కడ పాడు చేస్తాడు అని టెన్షన్ పడుతూ ఉంటుంది.
Also Read : ఇంట్లో దీపావళి సంబరాలు.. భానుమతికి షాక్.. పల్లవికి కమల్ కౌంటర్..
రామరాజు పండగ వేల తన కొడుకులకి బట్టలను తీసుకుని వచ్చేస్తాడు.. ఎప్పటిలాగే బొమ్మరిల్లు సీన్ కనిపిస్తుంది. ఇంత వయసొచ్చినా తన కొడుకులకు బట్టలు ఇవ్వడం చాలా గ్రేట్ కదా అని శ్రీవల్లి అంటుంది. కొడుకులు కూడా గ్రేట్ ఇంత వయసు వచ్చినా తండ్రి తెచ్చిన బట్టల్ని వేసుకుంటున్నారని నర్మదా అంటుంది. అప్పుడు అక్కడికి వచ్చిన తిరుపతి అంత లేదమ్మా అక్కడ బొమ్మరిల్లు సీన్ కనిపిస్తుంది ఒకసారి చూడండి అని అంటాడు.