E-Paper
Advertisement

కెవ్వు కార్తీక్ మొదటి సంపాదన ఎంతో తెలుసా?

కెవ్వు కార్తీక్ మొదటి సంపాదన ఎంతో తెలుసా?
Advertisement

Big Tv Kissik Talks: జబర్దస్త్ కమెడియన్ గా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో కెవ్వు కార్తీక్(Kevvu Karthik) ఒకరు. ఈయన జబర్దస్త్(Jabardasth) కార్యక్రమంలో కమెడియన్ గా తన ప్రయాణాన్ని మొదలు పెట్టి అనంతరం టీం లీడర్ గా ఎన్నో అద్భుతమైన స్కిట్లను చేస్తూ మంచి ఆదరణ సొంతం చేసుకున్నారు. ఇలా జబర్దస్త్ కమెడియన్ గా మంచి సక్సెస్ అందుకున్న కెవ్వు కార్తీక్ తాజాగా కిస్సిక్ టాక్స్ (Kissik Talks)కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన తన వ్యక్తిగత విషయాలతో పాటు వృత్తిపరమైన విషయాల గురించి కూడా మాట్లాడుతూ ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకున్నారు.

ఇంజనీరింగ్ చదువుతూనే మిమిక్రీ..

ఈ నేపథ్యంలోనే కెవ్వు కార్తిక్ తన మొదటి సంపాదన గురించి కూడా ఈ సందర్భంగా ప్రస్తావించారు. తనుకు చిన్నప్పటి నుంచి కూడా మిమిక్రీ అంటే చాలా ఇష్టం అని తెలిపారు. ఇంజనీరింగ్ చదువుతున్న సమయంలోనే తాను బర్త్డే పార్టీలకు, చిన్న చిన్న ఈవెంట్స్ లో మిమిక్రీ చేసేవాడినని అలా తాను మొట్టమొదటిసారి తీసుకున్న జీతం 200 రూపాయలని తెలిపారు. ఇంజనీరింగ్ చదువుతూనే ఇలాంటి ఈవెంట్స్ కి వెళ్లే వాడినని కార్తీక్ గుర్తు చేసుకున్నారు. తాను చదువులో మంచి స్టూడెంట్ అని తనకు 90% మార్పులు వచ్చాయని తెలిపారు. ఇలా మంచి పర్సంటేజ్ ఉన్నప్పటికీ జాబ్ చేసిన కూడా నాకు మిమిక్రీ చేయడం ద్వారానే ఎక్కువ అమౌంట్ వచ్చింది. అందుకే జాబ్ పక్కన పెట్టి ఇండస్ట్రీ వైపు వచ్చానని కార్తీక్ తెలిపారు.

మొదటి సంపాదన రూ.200..

Advertisement

ఇలా చిన్నచిన్న ఈవెంట్స్ చేస్తూ తన మిమిక్రీ ద్వారా ఇండస్ట్రీలో అవకాశాల కోసం ప్రయత్నాలు చేశానని తెలిపారు. అలా ప్రయత్నాలు చేస్తున్న సమయంలోనే బుల్లితెరపై పలు షోలలో అవకాశాలు వచ్చాయని తెలిపారు. ఇలా బుల్లితెరపై మూడు షోలు చేసిన అనంతరం తనకు జబర్దస్త్ కార్యక్రమంలో అవకాశం వచ్చిందని తెలిపారు. ఇలా 200 మొదలైన ఈయన ప్రయాణం నేడు లక్షల్లో ఉందని చెప్పాలి. ఇక ప్రస్తుతం కెవ్వు కార్తీక్ జబర్దస్త్ కార్యక్రమానికి కూడా దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. ఈయన తన భార్య బిడ్డ కోసం యూకే వెళ్లిపోవడంతో జబర్దస్త్ కార్యక్రమానికి కొంత బ్రేక్ ఇచ్చారు.

Advertisement

తన భార్య ఉద్యోగం రీత్యా యూకే లో స్థిరపడిన సంగతి మనకు తెలిసిందే. ఇటీవలే ఈ దంపతులకు అమ్మాయి జన్మించారు. ఇలా తన భార్య ప్రెగ్నెంట్ కావడంతో ఈయన జబర్దస్త్ కార్యక్రమం అలాగే ఇతర షోలలో షూటింగ్స్ అన్ని పక్కన పెట్టి తన భార్య బిడ్డ కోసం యూకే వెళ్లిపోయారు. తిరిగి ఇండియా వచ్చిన కార్తీక్ తిరిగి జబర్దస్త్ కార్యక్రమంలో కొనసాగుతారా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన తన వ్యక్తిగత విషయాల గురించి అలాగే వృత్తి పరమైన విషయాల గురించి కూడా ముచ్చటించారు.

Also Read: పిఠాపురంలో ఉపాసన రాంచరణ్ సామాజిక సేవ.. రూ. 2 కోట్ల వ్యయంతో!

Related News

బిగ్ బాస్ వైల్డ్ కార్డు ఎంట్రీ ఇవ్వబోతున్న జబర్దస్త్ కమెడియన్ .. బిగ్ బాస్ విన్నర్ ఎవరో చెప్పిన కార్తీక్!

జబర్దస్త్ జర్నీ పై కెవ్వు కార్తీ కామెంట్స్.. రెడ్ కార్పెట్ మీద కేక్వాక్ కాదంటూ!

ఆక్షణం నరకం అనుభవించాను… ఫుట్ పాత్ పైనే నిద్ర.. కెవ్వు కార్తిక్ ఎమోషనల్!

అచ్చం బాలు గారి గొంతులాగే ఉందిరా సామీ! సరిగమప దైవిక్ పాటకి నెటిజన్లు ఫిదా!

హైపర్ ఆదిని అంత మాట అనేసిన కామాక్షి భాస్కర్ల!

తప్పు మగాడిదైనా.. నింద ఆడదానికేనా? అనసూయ స్ట్రాంగ్ కౌంటర్!

ఆ ఇద్దరూ మరీ అంత వరస్ట్? ఇచ్చిపడేసిన నాగ్!

Big Stories

Advertisement
×