Big Tv Kissik Talks: కెవ్వు కార్తీక్ పరిచయం అవసరం లేని పేరు. బుల్లితెరపై ప్రసారమవుతున్న కామెడీ షో జబర్దస్త్(Jabardasth) కార్యక్రమం ద్వారా ఈయన ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. జబర్దస్త్ కార్యక్రమాని కంటే ముందుగానే పలు బుల్లితెర షోలలో సందడి చేసినప్పటికీ జబర్దస్త్ ఆయనకు మంచి గుర్తింపును తీసుకువచ్చింది. ఇలా జబర్దస్త్ ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్న కెవ్వు కార్తీక్ తాజాగా బిగ్ టీవీ కిస్సిక్ టాక్స్(Kissik Talks) కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా జబర్దస్త్ కార్యక్రమం గురించి ఈయన చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
ఈ కార్యక్రమంలో భాగంగా వర్ష జబర్దస్త్ కార్యక్రమం గురించి ప్రశ్నలు వేస్తూ జబర్దస్త్ ముందు జబర్దస్త్ తర్వాత మీ లైఫ్ ఏంటి అంటూ ప్రశ్న వేశారు. ఈ ప్రశ్నకు కార్తీక్ సమాధానం చెబుతూ జబర్దస్త్ అనేది తన లైఫ్ లో బెస్ట్ ఫ్లాట్ ఫామ్ అని తెలిపారు. జబర్దస్త్ నాకు మంచి పేరు తెచ్చింది .సమాజంలో గౌరవం తెచ్చింది. తనకొక మంచి జీవితాన్ని ఇచ్చిందని తెలిపారు. అయితే జబర్దస్త్ ఛాన్స్ అనేది నాకు రెడ్ కార్పెట్ మీద కేక్వాక్ కాదని జబర్దస్త్ అవకాశం వెనుక చాలా కష్టాలు ఉన్నాయని కార్తీక్ ఈ సందర్భంగా తెలియజేశారు.
తాను అప్పటికే మూడు టీవీ షోలలో చేశాను జబర్దస్త్ కార్యక్రమంలో కూడా రెండు స్కిట్ లలో ఛాన్సులు అందుకున్నాను అయితే తదుపరి స్కిట్ లో అవకాశం అందుకోవడం కోసం ఏడు నెలల పాటు అన్నపూర్ణ స్టూడియో గేట్ ముందర నిలబడి ఎదురు చూశానని కార్తీక్ తెలిపారు. ఆ ఏడు నెలలు ఎన్నో ఆడిషన్స్ ఇచ్చామని ఎన్నో అవమానాలు కూడా పడ్డానని ఈయన గుర్తు చేసుకున్నారు కనీసం తినడానికి తిండి కూడా ఉండేది కాదు పొద్దున ఎప్పుడో ఒక టీ సమోసా తీసుకుంటే రాత్రికి ఎప్పుడు తినే వాళ్ళమని తినడానికి డబ్బులు కూడా ఉండేవి కాదని అప్పటి కష్టాలను గుర్తు చేసుకున్నారు. జేబులో డబ్బులు లేక కృష్ణానగర్ నుంచి పంజాగుట్ట వరకు నడుచుకుంటూ వెళ్లిన రోజులు కూడా ఉన్నాయని కార్తీక్ తెలిపారు.
ఇలా ఇన్ని కష్టాలను అనుభవించిన తరువాతనే తనకు జబర్దస్త్ లో అవకాశం వచ్చిందని జబర్దస్త్ ద్వారా తనని తాను ప్రూఫ్ చేసుకొని టీం లీడర్ గా 10 సంవత్సరాల పాటు కొనసాగానని కార్తీక్ తెలిపారు. అయితే ఇప్పుడున్న జబర్దస్త్ గురించి మీ ఒపీనియన్ ఏంటి అంటూ ప్రశ్న వేయడంతో ఒక కార్యక్రమాన్ని 13 సంవత్సరాల పాటు సక్సెస్ ఫుల్ గా రన్ చేయడం అంటే మామూలు విషయం కాదు. అలాంటప్పుడు కొన్ని చిన్న చిన్న పొరపాట్లు జరుగుతుంటాయి. మనం మన ఇంట్లో ఒక చిన్న ఫంక్షన్ చేస్తేనే కొన్నిసార్లు కొంతమందికి భోజనం ఉంటుంది మరి కొంతమందికి ఉండదు. అలాంటిది ఈ విధమైనటువంటి షోలలో పొరపాట్లు జరగడం సాధారణమే అంటూ జబర్దస్త్ కార్యక్రమం గురించి తెలిపారు. ఈ ఏడాది జనవరిలో జబర్దస్త్ నుంచి తప్పుకున్న కార్తీక్ తిరిగి ఈ కార్యక్రమంలో పాల్గొంటారా లేదా అనేది తెలియాల్సి ఉంది.
Also Read: ఆక్షణం నరకం అనుభవించాను… ఫుట్ పాత్ పైనే నిద్ర.. కెవ్వు కార్తిక్ ఎమోషనల్!