Daiwik Singer:జీ తెలుగులో ప్రసారమవుతున్న పాపులర్ సింగింగ్ రియాలిటీ షో ‘సరిగమప – ది నెక్స్ట్ సింగింగ్ సెన్సేషన్’ ద్వారా ఆడియన్స్ మనసుల్ని దోచుకుంటున్నాడు. యంగ్ టాలెంటెడ్ సింగర్ దైవిక్ (Daiwik). దైవిక్ మైక్ ముందుకు వచ్చి పాట అందుకున్నాడో లేదో ఒక్కసారిగా ఆశ్చర్యపోవాల్సిందే.
ఇక రెండు కళ్లు మూసుకుని వింటే అచ్చం మన ఎదుటఎస్.పి. బాలు గారే స్వయంగా వచ్చి పాడుతున్నారా అనేంతగా ఈ కుర్రాడు వాయిస్‌ని రీక్రియేట్ చేయడం విశేషం.
జూనియర్ బాలు
దైవిక్ బాలు గారి ఏ పాట పాడినా శ్రుతి పక్కాగా పట్టుకోవడమే కాకుండా, ప్రతి పదాన్ని ఎంతో క్లారిటీగా పలుకుతూ ఎమోషన్‌తో పాడటం హైలెట్ అని చెప్పాలి. పాడే ప్రతీ పాటలో అదే రకమైన బేస్ వాయిస్, స్పష్టంగా పలకడం అంతా బాలు గారిలానే ఉండటంతో సోషల్ మీడియాలో అంతా ఇపుడు జూనియర్ బాలు అంటూ ఈ కుర్రాడిని ఆకాశానికి ఎత్తేస్తున్నారు.
బాలు గారి అభిమానులకు ఇయర్ ఫీస్ట్
పైగా పాట పడేటప్పుడు బాలు గారు ముఖంలో చూపించే ఎక్స్ప్రెషన్స్ పలికించే తీరు దైవిక్‌కి చిన్న వయసులోనే చాలా అద్భుతంగా అబ్బాయనే చెప్పాలి. బాలు గారు లేని లోటుని ఇలా దైవిక్ తన పాటల ద్వారా తీరుస్తూ బాలు వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తుండటం మెచ్చుకోతగ్గ విషయం.ఒకరకంగా ఇది మ్యూజిక్ లవర్స్‌కి, బాలు గారి అభిమానులకు ఇయర్ ఫీస్ట్ అనే చెప్పాలి.
ఇంటర్నెట్‌లో ఒక రేంజ్ లో హైలెట్
ముఖ్యంగా సరిగమప షోలో దైవిక్ పాడిన పాటలు , కవర్ సాంగ్స్ వీడియోలు ప్రస్తుతం ఇంటర్నెట్‌లో ఒక రేంజ్ లో హైలెట్ అవుతున్నాయి.ఎస్.పి. బాలు గారు పాడిన ‘శంకరాభరణం’ సినిమాలోని “ఓంకార నాదానుసంధానమౌగానమే” ‘సాగర సంగమం’ మూవీలోని “తకిట తధిమి తకిట తధిమి తంధాన” అలాగే ‘స్వాతిముత్యం’ లోని “సువ్వీ సువ్వీ సువ్వాలమ్మ” ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ చిత్రంలోని “అబ్బనీ తీయని దెబ్బ”, ‘ప్రేమ’ సినిమాలోని “ప్రియతమా నా హృదయమా” వంటి క్లాసిక్ లవ్ అండ్ ఎమోషనల్ సాంగ్స్‌ను రీ క్రియేట్ చేస్తూ బాలు అభిమానులని మురిపిస్తున్నాడు.
పెద్ద సింగర్ అవ్వాలని కోరుకుందాం!
రాబోయే రోజుల్లో ఈ యంగ్ టాలెంట్ టాలీవుడ్ ఇండియన్ మ్యూజిక్ ఇండస్ట్రీలో ఒక పెద్ద ప్లేబ్యాక్ సింగర్‌గా మారడం ఖాయమని, ఎన్నో గొప్ప మైలురాళ్లను అందుకుంటాడని మ్యూజిక్ లవర్స్, సీనియర్ గాయకులు గట్టిగా నమ్ముతున్నారు. బాలు గారి మధురమైన జ్ఞాపకాలను మళ్లీ మన కళ్లముందు నిలుపుతున్న దైవిక్ భవిష్యత్తులో పెద్ద సింగర్ అవ్వాలని కోరుకుందాం!