Balakrishna Dada First Single:మోకాలి సర్జరీ నుంచి కోలుకున్న బాలయ్య ఇప్పుడు సినిమాల్లో వేగం పెంచేశాడు .ఇప్పటికే గోపీచంద్ సినిమా దాదా ని పూర్తిచేసే పనిలో పడ్డ బాలయ్య మరో నెల రోజుల్లో కొరటాల శివ సినిమాకి కూడా జాయిన్ కాబోతున్నాడు అని తెలుస్తుంది. అయితే ఇదిలా ఉంటే తాజాగా దాదా సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ అప్డేట్ త్వరలో రాబోతుందన్న టాక్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
దాదాపై కూడా అంచనాలు ఒక రేంజ్ లో
విషయానికి వస్తే ఈ సినిమాకి తమన్ మ్యూజిక్ అందిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పటికే తమన్ మ్యూజిక్ ఇచ్చిన బాలయ్య సినిమాలు అఖండ ,వీర సింహారెడ్డి సినిమాలు ఎంతటి పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యాయో చెప్పనక్కర్లేదు .ముఖ్యంగా ఈ సినిమాలకి ఇచ్చిన బిజిఎం నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి .ఇక తాజాగా వస్తున్న దాదాపై కూడా అంచనాలు ఒక రేంజ్ లో పెట్టేసుకున్నారు నందమూరి ఫ్యాన్స్ .
ఇదిలా ఉంటే ఒక యూత్ ఇంట్రడక్షన్ లో పాల్గొన్న తమన్ తాజాగా దాదా ఫస్ట్ సింగిల్ కి సంబంధించిన ఒక క్రేజీ అప్డేట్ వదిలాడు.ఈ సినిమా ఫస్ట్ సింగిల్ ఈనెల 24న వస్తుందంటూ తమన్ హింట్ ఇవ్వడంతో మురిసిపోతున్నారు నందమూరి ఫ్యాన్స్.
సెప్టెంబర్ 24న ఫస్ట్ సింగిల్
ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ గ్లిప్మ్స్ సోషల్ మీడియాని ఎలా షేక్ చేసిందో చెప్పక్కర్లేదు. మరి తమన్ అన్నట్టుగా సెప్టెంబర్ 24న ఫస్ట్ సింగిల్ ఏ వస్తుందా లేక పూర్తి పాట వస్తుందా అనేది 24న తేలిపోనుంది. ఇక ఇదే ఇంట్రాక్షన్ లో తమన్ మాట్లాడుతూ బాలయ్య, కాజల్ అగర్వాల్ మధ్య రానున్న క్రేజీ సాంగ్ ని షూట్ చేయడం కోసం న్యూజిలాండ్ వెళ్లబోతున్నట్టు చెప్పేశాడు . ఈ పాట సినిమాలో నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుందన్న టాక్ వినిపిస్తుంది.
డిసెంబర్ 24 న వస్తారా లేక మరో డేట్ ని వెతుక్కుంటారా
దాదా సినిమాకి వస్తే ఇందులో బాలయ్య గ్యాంగ్ స్టర్ గా నటిస్తున్నాడని తెలుస్తుంది. ముఖ్యంగా ఈ సినిమాలో భారీ యాక్షన్ సీన్స్ ని ప్లాన్ చేశాడట గోపీచంద్ మలినేని .వీరిద్దరి కాంబోలో వచ్చిన వీర సింహారెడ్డి బాక్సాఫీస్ వద్ద ఎంత పెద్ద హిట్ అయిందో చెప్పక్కర్లేదు. ఇక ఈ సినిమాని వృద్ధి సినిమా బ్యానర్ పై నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాని క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 24న రిలీజ్ చేద్దామని ప్లాన్ చేస్తున్నారట మేకర్స్ .
ALSO READ:జైలర్ 2లో స్టార్‌ల జాతర.. రజనీకి తోడుగా ఇంతమందా?
మరి ఇప్పటికే పలు సినిమాలు వాయిదాల పాట పాడి వెనక్కి వెళ్లిన ఈ సమయంలో మరి అనుకున్నట్టుగా డిసెంబర్ 24 న వస్తారా లేక మేము అదే బాటలో అంటే మరో డేట్ ని వెతుక్కుంటారా కాలమే డిసైడ్ చేయాలి!