Big Tv Kissik Talks: జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న కెవ్వు కార్తిక్ (Kevvu Karthik)తాజాగా కిస్సిక్ టాక్స్ (Kissik Talks) కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా యాంకర్ వర్ష (Varsha) మాట్లాడుతూ మీరు ఏదో వేరే హౌస్ లోకి వెళ్లడానికి ఇండియా వచ్చారని తెలుస్తోంది అంటూ పరోక్షంగా వైల్డ్ కార్డు ఎంట్రీ గురించి అడిగారు. ఈ నేపథ్యంలోనే కార్తీక్ ఇవన్నీ మీకు ఎలా తెలుసు అంటూ ఆశ్చర్యపోయారు. ఇలా కార్తీక్ మాట్లాడటం చూస్తుంటే ఈయన బిగ్ బాస్ హౌస్ లోకి వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇవ్వబోతున్నారని స్పష్టమవుతుంది. ఇక ఈ సీజన్లో జబర్దస్త్ కార్యక్రమం నుంచి ఆటో రాంప్రసాద్, పొట్టి నరేష్ వెళ్లిన సంగతి తెలిసిందే.
ఇక ఈ సీజన్లో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు అంటూ కూడా ప్రశ్నలు వేశారు. వర్షిని, వంశీ ,రాంప్రసాద్, నరేష్ అందరూ కూడా మన ఫ్రెండ్స్ అందరూ కూడా చాలా మంచిగా ఆడాలని కోరుకుంటున్నాను అంటూ కార్తీక్ తెలిపారు. ఇక నరేష్(Naresh) గురించి మాట్లాడుతూ నా ఉద్దేశం ప్రకారం నరేష్ టాప్ ఫైవ్ కంటెస్టెంట్ గా ఉంటాడు కుదిరితే విన్నర్ కూడా అతనే అవుతాడని తెలిపారు. మీరు హౌస్ లోకి వెళ్తే నరేష్ విన్నర్ అవ్వాలని ఎలా కోరుకుంటారు అంటూ వర్షా ప్రశ్న వేయడంతో నేను హౌస్ లోకి వెళితే నేనే విన్నర్ కావాలని కోరుకుంటాను అంటూ కూడా కార్తీక్ మాట్లాడారు. ఇలా ఈయన మాటతీరు చూస్తుంటే మాత్రం బిగ్ బాస్ హౌస్ లోకి వైల్ కార్డు ఎంట్రీ ఇవ్వబోతున్నారని స్పష్టమవుతుంది.
యూకేలో ఉన్న కార్తీక్ ఉన్నఫలంగా ఇండియా రావడంతో ఈయన బిగ్ బాస్ వైల్డ్ కార్డు (Bigg Boss 10 wild card) కోసమే వచ్చారని తెలుస్తుంది. ఇక బిగ్ బాస్ గురించి మాట్లాడుతూ ఇదివరకు ఎంతోమంది జబర్దస్త్ కమెడియన్స్ హౌస్ లోకి వెళ్లి టాప్ ఫైవ్ కంటెస్టెంట్లు, రన్నర్లుగా బయటకు వస్తున్నారు కానీ ఈసారి మాత్రం జబర్దస్త్ కమెడియన్ కప్పు కొట్టాలని కోరుకుంటున్నానని కార్తీక్ చాలా గట్టిగా చెప్పారు. అలాగే అగ్నిపరీక్ష ద్వారా హౌస్ లోకి అడుగుపెట్టిన కామనర్స్ గురించి కూడా ఈ కార్యక్రమంలో ఈయన ప్రస్తావించారు. కామనర్స్ మొదటిసారి కెమెరా ముందుకు వచ్చి ఉంటారు.
ఇలా మొదటిసారి కెమెరా ముందుకు వచ్చినప్పటికీ వారి పెర్ఫార్మెన్స్ మాత్రం వేరే లెవల్ లో ఉందని టాస్కులు కూడా అంతే అద్భుతంగా ఆడుతున్నారని ఇది కనుక వారు సక్రమంగా ఉపయోగించుకుంటే వారికి చాలా మంచి లైఫ్ ఉంటుంది అంటూ హౌస్ లో ఉన్న కామనర్స్ గురించి కార్తీక్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. మరి నిజంగానే కార్తీక్ వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా హౌస్ లోకి వెళ్ళబోతున్నారా? వెళ్తే విజేతగా తిరిగి బయటకు వస్తారా? అనేది తెలియాలి అంటే మరికొద్ది రోజులు ఎదురు చూడాల్సిందే.
Also Read: జబర్దస్త్ జర్నీ పై కెవ్వు కార్తీ కామెంట్స్.. రెడ్ కార్పెట్ మీద కేక్వాక్ కాదంటూ!