E-Paper
Advertisement

ఆక్షణం నరకం అనుభవించాను… ఫుట్ పాత్ పైనే నిద్ర.. కెవ్వు కార్తిక్ ఎమోషనల్!

ఆక్షణం నరకం అనుభవించాను… ఫుట్ పాత్ పైనే నిద్ర.. కెవ్వు కార్తిక్ ఎమోషనల్!
Advertisement

Big Tv Kissik Talks: బిగ్ టీవీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కార్యక్రమాలలో కిస్సిక్ టాక్స్(Kissik Talks) కార్యక్రమం ఒకటి. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతివారం సెలబ్రిటీలు హాజరవుతూ సందడి చేస్తుంటారు. ఈ వారం ఈ కార్యక్రమంలో భాగంగా జబర్దస్త్ కమెడియన్ కెవ్వు కార్తీక్  పాల్గొని సందడి చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈనెల ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకున్నారు. ఇకపోతే కెవ్వు కార్తీక్  తల్లి గత రెండు సంవత్సరాల క్రితం మరణించిన సంగతి తెలిసిందే. ఈమె క్యాన్సర్ తో బాధపడుతూ మరణించారు.

ఫోర్త్ స్టేజ్ క్యాన్సర్..

తాజాగా ఈ కార్యక్రమంలో భాగంగా కార్తీక్ తన తల్లి మరణం గురించి అలాగే క్యాన్సర్ తో బాధపడుతున్న రోజులను గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయ్యారు. అమ్మకు ఫోర్త్ స్టేజ్ లో  క్యాన్సర్ బయటపడిందని ఏ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లిన రెండు మూడు నెలలు మాత్రమే సమయం చెప్పారు. కానీ అమ్మ ఐదు సంవత్సరాల నాలుగు నెలలు బ్రతికిందని తెలిపారు. దాదాపు 100కు పైగా కీమోలు ఇచ్చామని 5 మేజర్ సర్జరీలు జరిగాయని తన తల్లి పడిన బాధను గుర్తు చేసుకున్నారు. ఇలా ఒక వైపు అమ్మకు ట్రీట్మెంట్ చేస్తూనే మరోవైపు తన షూటింగ్స్ అన్నీ కూడా చూసుకునేవాడినని కార్తీక్ తెలిపారు. ఇక అమ్మకు క్యాన్సర్ అని తెలియగానే అమ్మ ఏవైతే చూడాలనుకుందో ఆ ప్రదేశాలన్నింటినీ కూడా చూపించానని తెలిపారు.

ప్రతిరోజు కలలో కనిపించేది..

Advertisement

ఇక రోజులు గడిచే కొద్ది అమ్మ పరిస్థితి చాలా దారుణంగా మారిపోయింది అమ్మను చూసి రాత్రిపూట నిద్రపట్టేది కాదని తెలిపారు. ఇక అమ్మకు బసవతారకం హాస్పిటల్ లోనే ట్రీట్మెంట్ చేయించాను కొన్నిసార్లు అక్కడి నుంచి ఇంటికి రాలేక ఫుట్ పాత్ పైనే నిద్రపోయిన రోజులు కూడా ఉన్నాయని తెలిపారు. షూటింగ్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత అమ్మ దగ్గరికి వెళ్లి అమ్మ అని నిద్రలేపితే ఆమె పలికేదికాదు. ఆ క్షణం నరకంలా ఉండేదని ఎమోషనల్ అయ్యారు. ఇక అమ్మ వారం రోజుల్లో చనిపోతుంది అనగా తన పరిస్థితి నాకు అర్థమైంది ఆ ఏడు రోజులు నిద్ర లేదని, అమ్మ మరణం తర్వాత ప్రతిరోజు రాత్రి కలలోకి వచ్చేదని కార్తీక్ తెలిపారు.

Advertisement

అమ్మ చనిపోయిన తర్వాత తన భార్య ప్రెగ్నెంట్ కన్ఫర్మ్ అయిందని తెలియడానికి ఒక 15 రోజుల ముందు నాకు అమ్మ కలలోకి వచ్చింది అమ్మ ఫేస్ ఉండి చిన్న పాపను ఒక టవల్లో చుట్టి నా చేతులలో పెట్టినట్టు కల వచ్చింది. మరుసటి రోజే తాను ఈ విషయం తన భార్యకు చెప్పానని ఈ కల వచ్చిన 15 రోజులకే తన ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయ్యిందని కార్తీక్ తెలిపారు. ఆ క్షణమే నాకు తిరిగి మా అమ్మ పుడుతుందని గట్టిగా ఫిక్స్ అయ్యాను అలాగే అమ్మ తిరిగి మా దగ్గరికి వచ్చింది అంటూ ఈయన తెలిపారు. ఇక ఆ రోజు నుంచి ఇప్పటివరకు మా అమ్మ నా కలలోకి రాలేదని తన తల్లి గురించి మాట్లాడుతూ కార్తీక్ కాస్త ఎమోషనల్ అయ్యారు.

Also Read: కెవ్వు కార్తీక్ మొదటి సంపాదన ఎంతో తెలుసా?

Related News

బిగ్ బాస్ వైల్డ్ కార్డు ఎంట్రీ ఇవ్వబోతున్న జబర్దస్త్ కమెడియన్ .. బిగ్ బాస్ విన్నర్ ఎవరో చెప్పిన కార్తీక్!

జబర్దస్త్ జర్నీ పై కెవ్వు కార్తీ కామెంట్స్.. రెడ్ కార్పెట్ మీద కేక్వాక్ కాదంటూ!

కెవ్వు కార్తీక్ మొదటి సంపాదన ఎంతో తెలుసా?

అచ్చం బాలు గారి గొంతులాగే ఉందిరా సామీ! సరిగమప దైవిక్ పాటకి నెటిజన్లు ఫిదా!

హైపర్ ఆదిని అంత మాట అనేసిన కామాక్షి భాస్కర్ల!

తప్పు మగాడిదైనా.. నింద ఆడదానికేనా? అనసూయ స్ట్రాంగ్ కౌంటర్!

ఆ ఇద్దరూ మరీ అంత వరస్ట్? ఇచ్చిపడేసిన నాగ్!

Big Stories

Advertisement
×