E-Paper
Advertisement

ఆపిల్ పండు తింటే కడుపులో పురుగుల చనిపోతాయా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

ఆపిల్ పండు తింటే కడుపులో పురుగుల చనిపోతాయా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే
Advertisement

Apple for stomach worms| ఫ్రైడ్ ఫుడ్స్, మాంసాహారం, అనారోగ్యకర ఆహారం ఎక్కువగా తినేవారిలో కడుపులో పురుగులు రావడం సాధారణ సమస్య. కడుపులో పురుగులు ఉన్నాయని తెలిసినప్పుడు చాలామంది ముందుగా ఇంటి చిట్కాల కోసం చూస్తారు. ఆపిల్ తింటే పేగుల్లోని పురుగులు చనిపోతాయని ఆయుర్వేద నిపుణులు ఆచార్య బాలకిషన్ సూచించారు. ముఖ్యంగా రాత్రి రెండు ఆపిల్స్ తింటే పురుగులు తొలగిపోతాయని చెబుతున్నారు. అయితే ఈ వాదనలో ఎంత నిజముందో చూద్దాం.

ఆపిల్స్ తింటే పురుగులు చనిపోతాయా?

కడపులో పురుగుల సమస్య ఉన్నప్పుడు ఆయుర్వేద నిపుణుడు బాలకిషన్ సూచనల ప్రకారం..  రాత్రివేళ రెండు ఆపిల్స్ తినాలి. అలా వరుసగా ఏడు రోజులు తింటే కడుపులోని పురుగులు చనిపోతాయి. అంతేకాకుండా రాత్రంతా నీళ్లు తాగకూడదు. అయితే ఆపిల్స్ తినడం వల్ల పేగుల్లోని పురుగులు చనిపోతాయని నిరూపించే వైద్యపరమైన ఆధారాలు లేవు. అందువల్ల ఇలాంటి చిట్కాలను పురుగుల చికిత్సకు ప్రత్యామ్నాయంగా ఉపయోగించకూడదు. రాత్రంతా నీళ్లు తాగకుండా ఉండటం కూడా పురుగుల సమస్యకు పరిష్కారమైన నిరూపితం కాలేదు.

జీర్ణవ్యవస్థకు ప్రయోజనం చేకూర్చే ఆపిల్స్

Advertisement

ఆపిల్స్‌లో డైటరీ ఫైబర్ ఉంటుంది. ఈ ఫైబర్ సాధారణంగా పేగుల కదలికలు సక్రమంగా ఉండేందుకు సహాయపడుతుంది. అందువల్ల సమతుల్య ఆహారంలో భాగంగా ఆపిల్ తినడం మంచిదే. మలబద్ధకం సమస్య ఉన్నవారికి ఆపిల్ లాంటి ఫైబర్ ఫుడ్స్ ఉపయోగపడతాయి. అయితే ఆపిల్‌ను పేగుల్లోని పురుగులకు మందుగా భావించకూడదు. ఆపిల్‌ను తొక్కతో తినాలనుకుంటే ముందుగా బాగా కడగడం మంచిది.

పేగుల్లో పురుగులు ఉంటే సరైన చికిత్స అవసరం

పేగుల్లో వచ్చే పురుగుల్లో థ్రెడ్‌వార్మ్స్, రౌండ్‌వార్మ్స్, హుక్‌వార్మ్స్, విప్‌వార్మ్స్, టేప్‌వార్మ్స్ ఉన్నాయి. వీటికి చికిత్స కూడా పురుగు రకాన్ని బట్టి మారుతుంది. వైద్యులు అవసరాన్ని బట్టి పరీక్షలు చేయించి సరైన మందులను సూచిస్తారు. కొన్ని పేగు పురుగుల ఇన్ఫెక్షన్లకు అల్బెండజోల్, మెబెండజోల్ వంటి మెడిసిన్స్ ఉపయోగిస్తారు. అందువల్ల పురుగులు ఉన్నాయని అనుమానం ఉంటే వైద్యుడిని సంప్రదించడం మంచిది.

Advertisement

Also Read: మలవిసర్జన సమయంలో రక్తం వస్తోందా? అది పైల్స్ అనకుంటే మీరు పొరబడునడినట్లే

పిల్లల్లో పురుగుల సమస్యను నిర్లక్ష్యం చేయకూడదు

పిల్లల్లో థ్రెడ్‌వార్మ్ ఇన్ఫెక్షన్ సాధారణంగా కనిపించవచ్చు. ఇది ఒకరి నుంచి మరొకరికి సులభంగా వ్యాపించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా రాత్రివేళ మలద్వారం చుట్టూ తీవ్రమైన దురద రావచ్చు.
దీంతో నిద్రకు కూడా ఇబ్బంది కలగవచ్చు. చేతులను తరచుగా కడుక్కోవడం, గోళ్లను చిన్నగా ఉంచడం వంటి పరిశుభ్రత చర్యలు ఉపయోగపడతాయి. పురుగుల అనుమానం ఉంటే పిల్లలకు ఇంటి చిట్కాలతో మాత్రమే చికిత్స చేయకూడదు.

Also Read: మానవాళికి పెను ప్రమాదం పొంచి ఉందా? 90 వేల కోట్ల ఏఐ ఏజెంట్లు ప్రపంచ జనాభా కంటే ఎక్కువ..

ఆపిల్స్ ఆరోగ్యకరమైన ఆహారంలో భాగం కావచ్చు

ఆపిల్స్‌లో ఫైబర్‌తో పాటు పలు పోషకాలు ఉంటాయి. అందువల్ల వాటిని సాధారణ సమతుల్య ఆహారంలో భాగంగా తీసుకోవచ్చు. కానీ ఆపిల్స్ మాత్రమే తినడం వల్ల పేగుల్లోని పురుగులు తొలగిపోతాయని చెప్పలేం. పురుగులు కనిపించడం, దీర్ఘకాలిక కడుపు సమస్యలు, కారణం తెలియని బరువు తగ్గడం లేదా ఎక్కువకాలం విరేచనాలు ఉంటే వైద్య సలహా తీసుకోవాలి.

Related News

ఆధార్ కార్డ్‌లో మొబైల్ నెంబర్ అప్డేట్ ఇక చాలా ఈజీ.. ఇంటి నుంచి ఇలా చేసేయండి

రోజూ వాడే టవల్‌ను ఎన్ని రోజులకు ఒకసారి ఉతకాలి? నిపుణులు ఏం చెబుతున్నారంటే..

లవ్ బ్రేకప్.. తొలిప్రేమను మరిచిపోవడం ఎందుకు కష్టంగా ఉంటుంది? సైకాలజీలో దీనికి సమాధానం ఇదే

గుండె ఆరోగ్యం కోసం ఎంతసేపు వ్యాయామం చేయాలి? సరైన విధానం ఇదే

అన్నింటికీ ముందుగానే సిద్ధంగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారు రిస్క్ అసలు తీసుకోరు

తల్లిదండ్రులు చేసే ఈ తప్పులు.. పిల్లల మానసిక ఎదుగుదలకు అడ్డంకులు

అగరబత్తి, దోమల కాయిల్ వల్ల క్యాన్సర్ వస్తుందా? డాక్టర్ ఏం చెప్పారంటే

Big Stories

Advertisement
×