Film industry:చిత్రసీమలో ఎప్పుడు ఎవరి జాతకం ఎలా మారుతుందో చెప్పడం కష్టం. నిన్నటి తరం స్టార్స్ సెకండ్ ఇన్నింగ్స్‌లో దూసుకుపోతుంటే, నేటి తరం టాలెంటెడ్ నటీమణులు మాత్రం బాక్సాఫీస్ వద్ద వరుస ఎదురుదెబ్బలు తింటున్నారు. 2026లో విడుదలైన చిత్రాల ఫలితాలను విశ్లేషిస్తే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతోంది. తమిళ చిత్రంతో గ్రాండ్ రీఎంట్రీ ఇచ్చి బాక్సాఫీస్ వద్ద సత్తా చాటిన సీనియర్ నటి రోజా, తెలుగులో తొలి ప్రయత్నంలోనే హిట్ కొట్టిన నాగదుర్గ సంతోషంలో ఉంటే.. మరోవైపు లయ, ఐశ్వర్య రాజేష్ మాత్రం వరుస డిజాస్టర్లతో తీవ్ర నిరాశలో మునిగిపోయారు.
దాదాపు రాజకీయాల్లో బిజీగా ఉంటూ వెండితెరకు దూరమైన సీనియర్ నటి రోజా సెల్వమణి తమిళ చిత్ర పరిశ్రమ ద్వారా గ్రాండ్ రీఎంట్రీ ఇచ్చారు. ఆమె కీలక పాత్రలో నటించిన రొమాంటిక్ కామెడీ డ్రామా ‘అన్బే డయానా’ బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. మరోవైపు, తెలుగు ఫోక్ డ్యాన్సర్‌గా పాపులారిటీ తెచ్చుకుని.. పవిష్ నారాయణ్ సరసన హీరోయిన్‌గా మారిన నాగదుర్గ ‘లవ్ ఓ లవ్’ చిత్రంతో మంచి లక్ అందుకుంది. ఇక ఈ రొమాంటిక్ కామెడీ చిత్రం ఆడియన్స్ నుండి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుని నాగదుర్గ కెరీర్‌కు మంచి బూస్ట్ ఇచ్చింది.
దాదాపు 20 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపై తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని చూసిన లయకు కాలం కలిసి రాలేదు. సీనియర్ హీరోలతో ఆమె చేసిన వరుస చిత్రాలు బాక్సాఫీస్ వద్ద దారుణంగా ప్లాప్ అయ్యాయి. హీరో శివాజీతో కలిసి నటించిన ‘సంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’, జగపతిబాబుతో చేసిన ‘వదలా’, అలాగే శ్రీకాంత్ సరసన చేసిన ‘మిస్టర్ మిడిల్ క్లాస్’ చిత్రాలు ప్రేక్షకులను ఏమాత్రం మెప్పించలేకపోయాయి. ఇక దీంతో లయ ఆశ పెట్టుకున్న సెకండ్ ఇన్నింగ్స్ ఆశలపై ఈ వరుస ప్లాపులు కోలుకోలేని దెబ్బ తీశాయి.
also read:నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!
గత సంక్రాంతి సీజన్‌లో ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్న టాలెంటెడ్ బ్యూటీ ఐశ్వర్య రాజేష్‌కు ఆ సక్సెస్ ఎంతో కాలం నిలవలేదు. ఆ తర్వాత ఆమె నటించిన తమిళ డబ్బింగ్ చిత్రం ‘మఫ్టీ పోలీస్’ ఆడియన్స్‌ను ఆకట్టుకోలేకపోయింది. ఇక టాలీవుడ్‌లో ఆశలు పెట్టుకుని చేసిన లేటెస్ట్ చిత్రం ‘ఓ సుకుమారి’ కూడా బాక్సాఫీస్ వద్ద కనీస వసూళ్లు సాధించలేక డిజాస్టర్‌గా నిలిచింది. మంచి నటిగా పేరున్నా సరైన కథలను ఎంచుకోవడంలో విఫలమవ్వడం వల్లే ఐశ్వర్యకు ఈ పరిస్థితి ఎదురైంది.
ఒకే ఏడాదిలో కొందరు నటీమణులు విజయాలతో దూసుకుపోతుంటే, మరికొందరు స్టార్ హీరోయిన్లు ప్లాపుల సుడిగుండంలో చిక్కుకోవడం సినిమా ఇండస్ట్రీలో సహజం. రోజా, నాగదుర్గ తమకు దక్కిన అవకాశాలతో సక్సెస్ ట్రాక్ ఎక్కగా, ఐశ్వర్య రాజేష్ , లయ మాత్రం సరైన సబ్జెక్టులు కుదరక వెనుకబడ్డారు. మరి రాబోయే రోజుల్లో ఈ ఇద్దరు భామలు ఎలాంటి కథలతో కమ్‌బ్యాక్ ఇస్తారో, బాక్సాఫీస్ వద్ద మళ్లీ తమ పాత వైభవాన్ని ఎలా అందుకుంటారో వేచి చూడాలి.