BigTV English

Brahmamudi Serial Today April 8th: ‘బ్రహ్మముడి’ సీరియల్: రాజ్‌ను చూసిన దుగ్గిరాల ఫ్యామిలీ – అయోమయంలో కావ్య  

Brahmamudi Serial Today April 8th: ‘బ్రహ్మముడి’ సీరియల్: రాజ్‌ను చూసిన దుగ్గిరాల ఫ్యామిలీ – అయోమయంలో కావ్య  

Brahmamudi serial today Episode:  కావ్య  పీటల మీద కూర్చోబోతుంటే.. రుద్రాణి ఆపుతుంది. రాజ్‌ లేకుండా ఒక్క దానివే పీటల మీద ఎలా కూర్చుంటావు అని అడుగుతుంది. మా వారు వస్తారు. నేను వెళ్లి తీసుకొస్తాను అంటూ బయటకు వెళ్లి రాజ్‌ ఫోటో తీసుకుని వస్తుంది కావ్య. కావ్య ఫోటో తీసుకుని రావడం చూసిన అందరూ షాక్ అవుతారు. కావ్య మాత్రం ఇప్పుడు వెళ్లి నేను సీతారాముల కళ్యాణం జరిపించ వచ్చు కదా..? మీకేం అభ్యంతరం లేదు కదా అంటుంది. దీంతో రుద్రాణి వాటే విజన్‌, వాటే టాలెంట్‌.. ఫ్యూజులు ఎగిరిపోయాయి నాకు. ఇదేమైనా ఇల్లు అనుకుంటున్నావా..? ఇది గుడి అమ్మా నీ పిచ్చితో వెర్రితో స్వామి వారిని అవమానించకు.. దంపతులు కూర్చోవాలి కానీ ఇలా ఫోటోలు ఫ్రేములు పక్కన పెట్టుకుని కూర్చుంటాను అది కుదరదు.


పంతులు గారు మీరైనా చెప్పండి. మీరైనా ఈ మూర్ఖురాలికి బ్రెయిన్‌ వాష్‌ చేయండి అంటుంది. దీంతో కావ్య ఒక్క రోజు కూడా దేవుడికి పూజ చేసి పువ్వు పెట్టని మీరు మన సంప్రదాయాల గురించి మాట్లాడతున్నారా..? రుద్రాని గారు అంటూ రామాయణంలో రాముడు కాంచన సీతను పెట్టుకుని యజ్ఞం చేసిన విషయం గుర్తు చేస్తుంది. దీంతో పూజారి కూడా కావ్యకు సపోర్టు చేస్తాడు. దీంతో కావ్య.. రుద్రాణి గారు పూజారి గారు ఏం చెప్పారో అర్తం అయిందా అంటుంది. ఇంకే మాట్లాడతారు అక్కా ఈవిడకు ఇప్పుడు ఫ్యూజులు ఎగిరిపోయి ఉంటాయి అంటుంది అప్పు. కావ్య చేత రోజూ అక్షింతలు వేయించుకోకపోతే రుద్రాణికి పూట గడవదేమో అంటుంది ఇంద్రాదేవి. దీంతో రుద్రాణి కోపంగా అక్కడి నుంచి బయటకు వెళ్లిపోతుంది.

ఇంతలో పూజ దగ్గరకు యామిని, రాజ్‌ వాళ్లు వస్తారు. అక్కడి జనాల్ని చూసి యామిని బాధపడుతుంది. చూశావా మమ్మీ జనాలు అందరూ వచ్చేశారు. ఇప్పుడు మనం ఈ చివరి వరుసలో కూర్చోవాలి. ఎంత త్వరగా రావాలని ట్రై చేసినా ప్రయోజనం లేకుండా పోయింది అంటూ ఫీల్‌ అవుతుంది. దీంతో రాజ్ ఎక్కడ కూర్చుంటే ఏమిటి యామిని అంటాడు. అలా అంటావేంటి బావ.. ఆ సీతారాముల కళ్యాణాన్ని దగ్గర చూడాలని ఆశ పడ్డాను. ఇప్పుడు సంబంధం లేదన్నట్టుగా దూరంగా కూర్చోవాల్సి వస్తుంది అంటుంది యామిని. దీంతో రాజ్‌ ఇంత చిన్న విషయాన్ని ఎందుకు అంత గొడవ చేస్తావు అంటాడు. ఎక్కడ కూర్చున్న దేవుడు అందరినీ సమానంగానే చూస్తాడు.


లేటుగా వచ్చారని కక్ష్య గడతారా ఏంటి అంటాడు. దీంతో యామిని అలా కాదు బావ నేను ఏదైనా అనుకుంటే అది నాకు దక్కాలి అంటుంది. రాజ్‌ మాత్రం అలా అనుకుంటే ఉన్నది కూడా దక్కకుండా పోతుంది. ఇక్కడే కూర్చుందాం అని చెప్తాడు. దీంతో అందరూ కూర్చున్నాక పూజలో కూర్చున్నాక ఫోన్‌ మాట్లాడటం కుదరదు ఈలోపు కళావతికి ఫోన్‌ చేద్దామని బయటకు వెళ్తాడు రాజ్‌. యామిని మాత్రం కంగారు పడుతుంది. ఎందుకు బేబీ అంతలా కంగారు పడతావు అని అడుగుతుంది. నేను క్రియేట్‌ చేసిన ఫ్రెండ్స్‌ నాకు చెప్పకుండా రామ్‌కు ఫోన్‌ చేస్తారా..? అంటూ తిడుతుంది యామిని..

మరోవైపు బయటకు వెళ్లిన రాజ్‌ను ప్రకాష్‌ చూసి షాక్‌ అవుతాడు. కావ్య చెప్పింది నిజమే రాజ్‌ బతికే ఉన్నాడు వెంటనే ఈ విషయం అందరికీ చెప్పాలని పరుగెడుతుంటాడు. ఒక వ్యక్తి ఎదురుగా వచ్చి ప్రకాష్‌తో గొడవ పెట్టుకుంటాడు. ఇంతలో ధాన్యలక్ష్మీ వచ్చి ప్రకాష్‌ను తీసుకుని లోపలికి వెళ్లిపోతుంది. గోడవలో పడి ప్రకాష్‌, రాజ్‌ను చూసిన విషయం మర్చిపోతాడు. బయటకు వెళ్లిన రాజ్‌, కావ్యకు ఫోన్‌ చేస్తాడు. లిఫ్ట్‌ చేసిన కావ్య పూజలో ఉన్నానని మళ్లీ చేస్తానని కాల్‌ కట్‌ చేస్తుంది. ఇంతలో రాజ్‌ పూజ హాల్లోకి రావడం కావ్య చూస్తుంది. ఎవరైనా చూశారా అని కంగారు పడుతుంది. ఏంటి ఈయన కూడా ఇదే గుడికి వచ్చాడు. కొంపలు అంటుకుపోయేలా ఉన్నాయి. ఇంట్లో వాళ్లు ఎవరైనా చూసినా సరే వెంటనే ఆయనతో వెళ్లి మాట్లాడేస్తారు. గతం గురించి అడిగేస్తారు అని భయపడుతుంది.

ఇంతలో రుద్రాణి లోపలికి వస్తూ.. రాజ్‌ను చూసి షాక్‌ అవుతుంది. రాజ్‌ ఇక్కడున్నాడేంటి..? కావ్య చెప్పినట్టు రాజ్‌ బతికే ఉన్నాడా..?  అందుకేనా అది ఇన్ని రోజుల నుంచి రాజ్‌ బతికే ఉన్నాడని అంతలా మాట్లాడుతుంది. మరి బతికున్న రాజ్‌ను ఇంటికి ఎందుకు తీసుకురాలేదు. నేను దాన్ని ఎన్ని మాటలు అంటున్నా నా మాటలు పడుతూ మౌనంగా ఎందుకు ఉంది. అసలు దీని విషయం పక్కన పెడితే రాజ్‌ ఎందుకు రాలేదు. కావ్య ఏదో దాస్తుంది. అని మనసులో అనుకుంటుంది రుద్రాణి.  వెంటనే పూజారి దగ్గరకు వెళ్లి మైక్‌ తీసుకుంటుంది. అపర్ణ కోపంగా రుద్రాణిని తిడుతుంది. దీంతో రుద్రాణి మైకులో నన్ను తిట్టకండి వదిన ఆ దేవుడే మీ కొడుకును మీకు తిరిగి ఇచ్చేస్తున్నాడు వదిన.. నేను రాజ్‌ను చూశాను. ఇన్ని రోజులు మనుక కావ్య రాజ్‌ బతికే ఉన్నాడని చెప్తుంటే తనకు పిచ్చి పట్టిందని ఎన్నోన్నో అన్నాం కదా..? కానీ కావ్య చెప్పిందే నిజం అంటుంది. ఇంతలో కావ్య రుద్రాణిగారు మీరు ఏం మాట్లాడుతున్నారు. మీరు ఆయన్ని చూడ్డం ఏంటి..? ఎక్కడ చూశారు. ఎలా చూశారు. ఎప్పుడు చూశారు అంటూ ప్రశ్నిస్తుంది.

దీంతో రుద్రాణి ఇక్కడే చూశాను. ఇప్పుడే చూశాను. నా కళ్లతో చూశాను. అదిగో అక్కడే చూశాను అంటూ రాజ్‌ను చూపిస్తుంది అందరూ వెనక్కి తిరిగి చూడగానే రాజ్‌ కనిపిస్తాడు. అందరూ వెళ్లి రాజ్‌ను పలకరిస్తారు. అపర్ణ ఏడుస్తూ నాన్నా రాజ్‌ అంటూ పిలుస్తుంది. దగ్గరకు వెళ్లి ఎమోషనల్‌ అవుతుంది. ఇన్ని రోజలు ఇంటికి ఎందుకు రాలేదని అడుగుతుంది. సుభాష్‌ కూడా తిరిగి  నువ్వు మా దగ్గరకు ఎందుకు రాలేదు అని అడుగుతాడు. దీంతో రాజ్‌ ఎవరండి మీరు అని అడుగుతాడు. దీంతో అందరూ షాక్ అవుతారు.  అపర్ణ ఏడుస్తూ మమ్మల్ని గుర్తు పట్టలేదా..? అని అడుగుతుంది. దీంతో రాజ్‌ నేను మిమ్మల్ని ఇదే మొదటిసారి చూస్తున్నాను అంటాడు. రుద్రాణి వచ్చి ఏంటి రాజ్‌ నిజంగా మమ్మల్ని గుర్తు పట్టలేదా..? అని అడుగుతుంది. యామిని మాత్రం వెంటనే రాజ్‌ను ఇక్కడి నుంచి తీసుకెళ్లాలి అని మనుసులో అనుకుని రుద్రాణి వాళ్లను తిడుతుంది. ఈయన రాజ్‌ కాదు నా బావ. స్వాయానా నా మేనత్త కొడుకు అని చెప్తుంది. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

 

ALSO READ: సకల బాధలను దూరం చేసే షణ్ముఖి రుద్రాక్ష ధారణ ఎవరు చేయాలి..?

 

Tags

Related News

Sravanthi Chokkarapu: తెల్లారితే పెళ్లి.. రాత్రికి రాత్రే ఆపని చేసిన  స్రవంతి..బయటపడ్డ నిజాలు!

Intinti Ramayanam Today Episode: భరత్, ప్రణతిలను విడగొట్టిన పల్లవి.. పోలీస్ స్టేషన్ పార్వతి.. నిజం బయటపడిందా?

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు గుడ్ న్యూస్.. బాలును ఇరికించేసిన కల్పన..

Illu Illalu Pillalu Today Episode: భర్తను కాపాడిన భాగ్యం.. నర్మదకు మొదలైన అనుమానం.. శ్రీవల్లి సేఫ్..

Today Movies in TV : ఆదివారం టీవీలల్లోకి రాబోతున్న సినిమాలు.. ఆ రెండు మస్ట్ వాచ్..

Big Tv Kissik Talks: వాడి కోసం ప్రాణాలైనా ఇస్తా… థాంక్స్ చెప్పి రుణం తీర్చుకోలేను!

Big Stories

×