Gundeninda Gudigantalu : స్టార్ మా లో సక్సెస్ఫుల్గా రన్ అవుతున్న టీవీ సీరియల్స్ లలో గుండెనిండా గుడిగంటలు ఒకటి. ఈ సీరియల్ మధ్య తరగతి కుటుంబాలకు దగ్గరగా ఉంటుంది. అందుకే జనాలు ఎక్కువగా ఈ సీరియల్ ను చూసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. సోమవారం నుంచి శుక్రవారం వరకు ప్రతి రోజూ రాత్రి 9 గంటలకు సీరియల్ టెలికాస్ట్ అవుతుందని స్టార్ మా ఛానల్ తెలియజేసింది. గుండె నిండా గుడి గంటలులో హీరోగా విష్ణు కాంత్ హీరోగా నటిస్తున్నారు. బాలు పాత్రలో ఆయన కనిపించనున్నారు. ఆయనకు జోడీగా అమూల్య గౌడ నటిస్తున్నారు. సీరియల్ లో ఆమె పాత్ర పేరు మీనా.. ఈ సీరియల్ బాలు నిజ జీవితం గురించి అతి కొద్ది మందికి మాత్రమే తెలుసు. ఆయన రియల్ లైఫ్ గురించి ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం..
Also Read : ‘సేవ్ ది టైగర్స్ 3’ వచ్చేస్తుంది.. అప్డేట్ ఇచ్చిన హీరోయిన్..
బాలు రియల్ లైఫ్..
తమిళ నటుడు విష్ణుకాంత్, ‘గుండెనిండా గుడిగంటలు’ సీరియల్‌లో బాలు పాత్రలో నటించారు. ఈ పాత్రలో విష్ణు తెలుగు ప్రేక్షకులతో దగ్గరయ్యాడు. 2024 స్టార్ మా పరివార్ అవార్డ్స్‌లో విష్ణుకాంత్‌కి బెస్ట్ హస్బండ్అవార్డు దక్కింది. కానీ రియల్ లైఫ్ లో మాత్రం బాలు ఆశించిన స్థాయిలో లేదనే చెప్పాలి. తమిళ్ లో ప్రసారమయ్యే సిప్పినీల్ ముత్తు అనే సీరియల్ లో జంటగా కనిపించరు సంయుక్త- విష్ణు కాంత్. ఈ సీరియల్ లో పరిచయం.. ప్రేమగా మారింది. ఇక ఆ ప్రేమ కాస్తా పెద్దలను ఒప్పించి పెళ్లిగా మారింది. ఇక ఈ జంట పెళ్లి చేసుకోవడంతో వారి అభిమానులు ఎంతగానో సంతోషించారు. అయితే వీరి పెళ్లి జరిగి ముచ్చటగా మూడు నెలలు కూడా కాలేదు.. మార్చిలో పెళ్లి చేసుకున్న ఈ జంట మే లో విడాకులు తీసుకున్నారు. సోషల్ మీడియాలో పెళ్లి ఫోటోలను డిలీట్ చేస్తూ.. తాము విడిపోతున్నట్లు పోస్ట్లు పెట్టారు. అయితే వీరు విడిపోవడానికి ఎఫైర్లు కారణమని చెప్పుకొచ్చారు.
భార్యను విష్ణు అంత టార్చర్ చేశాడా..?
అయితే తానే తప్పూ చేయలేదని, విష్ణుకాంతే తనకు నరకం చూపించేవాడని ఆరోపిస్తోంది సంయుక్త. అడల్ట్ వీడియోలు చూడమని బలవంతం చేసేవాడని, తనతో హింసాత్మకంగా ప్రవర్తించేవాడని చెబుతోంది. బెడ్‌రూమ్‌లో కెమెరా పెట్టి అన్నింటినీ రికార్డు చేయడానికి ప్రయత్నిస్తే దాన్ని నేను ఒప్పుకోలేదని చెప్పుకొచ్చింది. తనను భార్యగా కాకుండా వ్యభిచారిలా చూశాడని ఆరోపించింది. విష్ణుకాంత్ ఇటీవల విడుదల చేసిన వీడియోలో, అతను సంయుక్త ఆరోపణలను తీవ్రంగా ఖండించాడు. తన తప్పులను దాచడానికి అబద్ధాలు చెబుతోంది. తన నిజ స్వభావాన్ని బహిర్గతం చేయడానికి ప్రయత్నించే ఎవరినైనా ఆమె నిందిస్తోందని అన్నారు. అందుబాటులో ఉన్న సాక్ష్యాలను పరిగణనలోకి తీసుకోకుండా ఆమె మాటలను నమ్మకండని విష్ణుకాంత్ ప్రజలను కోరారు.. నేను తప్పు చేశానని సాక్ష్యాల తో నిరూపించాలిగా అని విష్ణు అన్నారు. మొత్తానికి అప్పటిలో వీరిద్దరి విడాకులు సంచలనంగా మారింది. ఇక విష్ణు ప్రస్తుతం తెలుగులో పలు సీరియల్స్ తో బిజీగా ఉన్నారు.