E-Paper
Advertisement

Brahmamudi Serial Today December 15th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రాజ్ ను షాక్ గురి చేసిన ఫోన్ కాల్  

Brahmamudi Serial Today December 15th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రాజ్ ను షాక్ గురి చేసిన ఫోన్ కాల్  
Advertisement

Brahmamudi serial today Episode:  

కేరళ నుంచి వచ్చిన రాజ్‌, కావ్యలను అప్పటికే రుద్రాని నిజం చెప్పడంతో బాధతో ఉన్న వాళ్లందరూ రాజ్‌, కావ్యను ఎందుకు అబద్దం చెప్పారని నిలదీస్తారు. దీంతో రాజ్‌ ఇప్పుడు కళావతికి ఎలాంటి ప్లాబ్లమ్‌ లేదని చెప్తాడు. తాము కేరళ వెళ్లింది ట్రీట్‌మెంట్‌ కోసమేనని.. అక్కడి ట్రీట్‌ మెంట్‌ వల్ల కావ్యకు పూర్తిగా నయం అయిందని.. ఇక ఎటువంటి ప్లాబ్లమ్‌ లేదని చెప్పడంతో రుద్రాణి నమ్మదు.. మళ్లీ అబద్దం చెప్తున్నారేమో అంటుంది. దీంతో రాజ్‌ నాకు తెలుసు అత్త నువ్వు నమ్మవు అని కళావతి ఆ రిపోర్ట్స్‌ ఇలా ఇవ్వు.. అంటూ తీసుకుని రుద్రాణికి ఇస్తాడు రాజ్‌. అవి చూసిన రుద్రాణి నిజమే అన్నట్టు తలూపుతుంది. ఇంతలో అపర్ణ ఏడుస్తూ.. చాలా సంతోషంగా ఉందిరా.. నువ్వేమో నీ భార్యను సంతోషపెట్టడానికి మా ముందు నటిస్తావు. అదేమో బిడ్డను కని ఈ ఇంటికి వారసుణ్ని ఇవ్వడానికి  ఆనందంగా ప్రాణత్యాగం చేయాలి అనుకుంటుంది. మేమేనట్రా మూర్ఖులం మేమేనా జాలి దయ లేని వాళ్లం అంటూ ఎమోషనల్‌ అవుతుంది.

దీంతో ఇంద్రాదేవి కల్పించుకుని రేయ్‌ మా ఆనందం అయినా.. బాధైనా.. కష్టమైనా, సుఖమైనా అంతా మీతోనే కదరా అలాంటిది మాకు సంతోషాన్ని పంచి మీరు బాధను ఎలా దిగమింగారురా..? అని అడుగుతుంది. కావ్య ఇందుకోసమేనా.. కేరళ వెళ్లే ముందు మళ్లీ తిరిగిరానట్టు బాధగా వెళ్లావు అని అపర్ణ అడుగుతుంది. దీంతో ఇంట్లో వాళ్లందరూ తలో మాట అంటారు.. ఎవరి ఏం చెప్పాలో అర్థం కాక కావ్య అయోమయంగా చూస్తుంది. మేము నటించాల్సి వచ్చినా..? అబద్దాలు చెప్పినా..? చాటున ఏడ్చినా.. అంతా మన కుటుంబం కోసమే.. కానీ ఇంక ఆ అవసరం లేదు.. ఇంక రాదు కూడా.. నేను నా బిడ్డను కనడమే కాదు కళ్లారా చూసుకోగలను అత్తయ్య.. ఇదిగో అత్తయ్య గారితో తలంటపు పోయించగలను.. అమ్మమ్మగారు మీ భుజాల మీద నా బిడ్డను ఎక్కించగలను.. మీరు కలలు కన్న కావ్య బిడ్డను మోసి కని ఈ ఇంటికి వారసుడిని ఇవ్వాలన్నా మీ అందరి ఆశ నేను తీర్చబోతున్నాను.. ఇంత కన్నా నాకేం కావాలి..? అంటూ కావ్య ఎమోషనల్‌ అవుతుంది.

Advertisement

అందరూ హ్యాపీగా ఉంటారు.. ఇంతలో రాజ్‌ కు రమాకాంత్‌ ఫోన్‌ చేసి ఈవెనింగ్‌ అవార్డు ఫంక్షన్‌ ఉందిగా మీరొస్తారని తెలుసు కానీ మళ్లీ ఒకసారి గుర్తు చేద్దామని చెప్పాను ఈవెనింగ్‌ ఆరు గంటలకు రండి అని చెప్పి ఫోన్‌ కట్‌ చేస్తాడు. దీంతో రాజ్‌ కన్పీజ్‌గా సుభాష్‌ ను అడుగుతాడు. ఏం ఫంక్షన్‌ అని దీంతో స్వప్న న నేను చెప్తాను రాజ్‌.. మీరు రాహుల్‌ చేత పెట్టించిన ఆర్‌ కంపెనీని రాహుల్‌ మార్కెట్‌లోకి తీసుకెళ్లారు.. ఇప్పుడు మార్కెట్‌లో ఎక్కడ చూసినా ఆర్‌ కంపెనీ గురించే చర్చ జరుగుతుంది. అందుకే అసోసియేషన్‌ వాళ్లు రాహుల్‌కు సన్మానం ఏర్పాటు చేశారు అని చెప్తుంది. దీంతో రాజ్‌, కావ్య హ్యాపీగా ఫీలవుతారు. మిగతా వాళ్లు కోపంగా చూస్తుంటారు.

తర్వాత కేసు విషయం అయి బయటకు వెళ్లాల్సిన అప్పును ఇంట్లో వాళ్లు చూడకుండా వెనక డోర్‌ నుంచి స్టేషన్‌కు పంపిస్తాడు కళ్యాణ్‌. అప్పును కళ్యాణ్‌ పంపించడం ప్రకాష్‌ చాటు నుంచి చూస్తాడు. కళ్యాణ్‌ ఇంట్లోకి రాగానే. అప్పుడే జ్యూస్‌ తీసుకుని అప్పు కోసం పైకి వెళ్లుంది ధాన్యలక్ష్మీ. కళ్యాణ్‌ కంగారుగా అప్పు పైన లేదని జ్వరం వచ్చి పడుకుందని లేచాక నేను జ్యూస్‌ తాగిస్తాను.. అంటూ కళ్యాణ్‌ అబద్దం చెప్పగానే.. వెనక నుంచి చూస్తున్న ప్రకాష్ షాక్‌ అవుతాడు. ధాన్యలక్ష్మీ కంగారు పడుతుంది. కళ్యాణ్‌ వెంటనే జ్యూస్‌ తీసుకుని ధాన్యలక్ష్మీని కిచెన్‌లోకి పంపిస్తాడు.

Advertisement

తర్వాత సాయంత్రం సన్మాన ఫంక్షన్‌కు రాజ్‌, కావ్య వెళ్తారు. రాహుల్‌కు తన వాచ్‌ ఇచ్చి ఇక నీ టైం బాగుంటుంది అని రాజ్‌ చెప్పగానే.. రాహుల్‌ ఇంత ఖరీదైన వాచ్‌ నా కన్నా.. నీకే బాగుంటుంది ఎందుకంటే నేను నీ అంత తెలియవైన వాణ్ని కాదు అంటూ బయటకు చెప్తూనే.. మనసులో మాత్రం రేయ్‌ నిన్ను తొక్కేయడమే నా లక్ష్యంరా అనుకుంటాడు. తర్వాత స్వప్న, రాజ్‌, కావ్యకు రాహుల్ వేసిన డిజైన్స్‌ గురించి గొప్పగా చెప్తుంది. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ గా సుధీర్ రెడ్డి కన్ఫర్మ్…పోస్ట్ వైరల్!

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ వీరే.. దశావతారం వర్కౌట్ అవుతుందా?

కృష్ణాష్టమి స్పెషల్.. ‘రాధా’గా మారిన అనసూయ.. వీడియో వైరల్!

అవినాష్, అరియానా మధ్య గొడవలు నిజమేనా? బయటపెట్టిన శ్రీముఖి!

Nindu Noorella Saavasam Serial Today Episode September 4th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆత్మ కోసం ప్రచండ ప్రత్యేక పూజ  

Gundeninda GudiGantalu Today episode: మీనాను దెబ్బ అదుర్స్.. సంజుకు దిమ్మతిరిగే షాక్.. బాలుకు రాఖీ కట్టిన మౌనిక..

Ninnu kori Serial Today Episode September 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: చంద్రకు నిజం తెలిసిందన్న మందర – షాక్‌ అయిన మాయ      

Podarillu Today Episode : చక్రితో అంట్లు కడిగించిన మహా.. నారాయణ హర్ట్.. జయంతి మాటతో షాక్..

Big Stories

Advertisement
×