E-Paper
Advertisement

Hyderabad Crime: హైదరాబాద్‌లో దారుణం.. అర్ధరాత్రి ఓ యువకుడ్ని కత్తులతో పొడిచి పొడిచి

Hyderabad Crime: హైదరాబాద్‌లో దారుణం.. అర్ధరాత్రి ఓ యువకుడ్ని కత్తులతో పొడిచి పొడిచి
Advertisement

Hyderabad Crime: పగలు.. ప్రతీకారాలు.. ఒకప్పుడు రాయలసీమ ప్రాంతంలో బలంగా వినిపించేది. రానురాను ఈ జాడ్యం మిగతా ప్రాంతాలకు సోకింది.. కంటిన్యూ అవుతోంది. తాజాగా హైదరాబాద్‌లో అర్థరాత్రి ఓ యువకుడ్ని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. అక్కడి నుంచి నిందితులు పరార్ అయ్యారు. ఈ ఘటనతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.

హైదరాబాద్‌లో దారుణహత్య

Advertisement

హైదరాబాద్ సిటీలో అర్ధరాత్రి ఘటనలు కలకలం రేపుతున్నాయి. హైదరాబాద్ సిటీలోని టోలిచౌకి పరిధిలోని పారమాంట్ కాలనీలో దారుణమైన ఘటన జరిగింది. పాత కక్షల నేపథ్యంలో ఇర్ఫాన్ అనే యువకుడు దారుణంగా పొడిచి పొడిచి చంపేశారు ప్రత్యర్థులు. స్థానికులు బాధితుడ్ని ఆసుపత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.

అప్పటికే మరణించారు ఇర్ఫాన్ అనే యువకుడు. హత్య వెనుక అసలేం జరిగింది. ఇంకాస్త డీటేల్స్‌లోకి వెళ్తే..టోలిచౌకి పరిధిలోని పారమౌంట్ కాలనీ గేట్ నంబర్-3 వద్ద ఇర్ఫాన్ హత్య ఘటన జరిగింది. ఇర్ఫాన్‌‌ని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా కత్తులతో పొడిచి పొడిచి హత్య చేశారు. ఘటన గురించి స్థానికులు వెంటనే టోలీచౌకి పోలీసులకు సమాచారం ఇచ్చారు.

Advertisement

అర్ధరాత్రి ఓ యువకుడ్ని కత్తులతో పొడిచిన యువకులు

వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. మృతుడు ఇర్ఫాన్ తమ్ముడు అద్నాన్-నిందితుడు బిలాల్ మధ్య చాన్నాళ్లుగా గొడవలు ఉన్నాయి. ఈ విషయం తెలుసుకున్న ఇర్ఫాన్. గొడవ జరుగుతున్న ప్రాంతానికి వెళ్లాడు. ఇర్ఫాన్ తన తమ్ముడ్ని శాంతింప జేసేందుకు ప్రయత్నించాడు. గొడవ ఆపే ప్రయత్నంలో ఇర్ఫాన్ పైకి దూసుకెళ్లాడు బిలాల్.

తనతో తెచ్చుకున్న కత్తితో విచక్షణారహితంగా ఇర్ఫాన్‌పై దాడి చేశాడు. ఘటన సమయంలో తీవ్రంగా గాయపడ్డాడు ఇర్ఫాన్. వెంటనే స్థానికులు చికిత్స కోసం హాస్పిటల్‌కు తరలించారు. తీవ్ర రక్తస్రావం కారణంగా మార్గమధ్యలో ఇర్ఫాన్ మృతి చెందినట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.

ALSO READ: మహబూబ్ నగర్ జిల్లాలో హైవేపై వ్యాన్ బీభత్సం.. కారు-ఆటో నుజ్జునుజ్జు

మృతుడి తమ్ముడు అద్నాన్‌కు తీవ్రగాయాలు అయ్యాయి. ఈ ఘటనకు కారణమైన కీలక నిందితుడ్ని గుర్తించిన పోలీసులు, బిలాల్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. గొడవల వెనుక వివరాలు తీసుకునే ప్రయత్నంలో ఉన్నారు. పోస్టుమార్టం నిమిత్తం ఇర్ఫాన్ మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు.   ఇర్ఫాన్ ని ఆ విధంగా చూసి కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరు అవుతున్నారు.

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×