E-Paper
Advertisement

Brahmamudi Serial Today February 21st: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రుద్రాణిని చెప్పుతో కొట్టిన కావ్య  

Brahmamudi Serial Today February 21st: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రుద్రాణిని చెప్పుతో కొట్టిన కావ్య  
Advertisement

Brahmamudi serial today Episode: 

మినిస్టర్‌ ధర్మేంద్ర ఇంట్లో బారసాల చాలా గ్రాండ్‌గా జరుగుతుంటుంది. దుగ్గిరాల ఫ్యామిలీ మొత్తం వచ్చినందుకు తులసి హ్యాపీగా ఫీలవుతుంది. మీరంతా ఫంక్షన్‌కు వచ్చినందుకు చాలా థాంక్స్‌ కావ్య అంటుంది తులసి. దీంతో కావ్య ఏంటి మేడం మీరు మన మధ్య ఇవన్నీ అవసరమా..? మీ కడుపున పుట్టిన పాపైనా కొన్ని రోజులు నా వడిలో ఆడుకుంది. నా కన్నబిడ్డైనా మీ చేతుల్లో ఎంతో అల్లారుముద్దుగా చూసుకున్నారు. నేను మీ పాపను ఉయ్యాలలో వేశాను అనుకోలేదు మేడం. నా బిడ్డకే బారసాల చేశానని అనుకున్నాను అని చెప్తుంటే ఏదైతేనేమీ ఫంక్షన్‌ బాగా జరిగింది. అందరం కలిసి భోజనం చేద్దాం రండి అని మినిస్టర్‌ చెప్పగానే.. అందరూ భోజననానికి వెళ్లబోతుంటే.. అప్పుడే .. అక్కడికి రుద్రాణి వస్తుంది.

రుద్రాణిని చూసిన ఇందిరాదేవి కోపంగా ఏయ్‌ నువ్వేంటి ఇక్కడ..? అంటూ కోప్పడుతుంది. నువ్వెందుకు వచ్చావు అని అపర్ణ, మళ్లీ ఎవరి కొంపలు కూల్చాలని వచ్చావు అంటూ ధాన్యలక్ష్మీ నిలదీస్తారు. సుభాష్‌ కోపంగా మినిస్టర్‌ గారు ఈవిడేంటండి మీ ఇంటికి వచ్చింది. ఆవిడకు మీకు ఏంటండి పరిచయం అని అడగ్గానే.. అంటే తను తెలిసిన ఆవిడ కానీ తను మీ ఇంటి ఆడబిడ్డ అని నాకు కొంచెం లేటుగా తెలిసింది అని దర్మేంద్ర చెప్పగానే.. ఇందిరాదేవి కోపంగా అది మా ఇంటి ఆడపడుచు కాదయ్య. మృగం.. జీవితాంతం మమ్మల్ని పీక్కుతింటుంది అంటుంది. ప్రకాష్ కూడా కోపంగా అందుకే మేమందరం కలిసి ఇంట్లోంచి తరిమేశాం తీరా చూస్తే ఇక్కడ ప్రత్యక్ష్యం అయింది అంటాడు. ఏంటి ఇంకా చూస్తున్నావు వచ్చిన దారినే వెళ్లు అంటూ ధాన్యలక్ష్మీ తిట్టగానే.. రుద్రాణి ఏడుస్తున్నట్టు నటిస్తూ.. వెళ్తాను ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండను.. నేను వచ్చింది మినిస్టర్‌ గారు ఫంక్షన్‌కు పిలిచారని కాదు మీరంతా వస్తున్నారని తెలిసి మీ అందరినీ క్షమాపణ అడగాలని నేను చేసిన తప్పులకు ప్రాయశ్చితం చేసుకోవాలని వచ్చాను అని రుద్రాణి చెప్పగానే..

Advertisement

ఏంటే నువ్వే ప్రాయశ్చితం చేసుకునేది నీ పిండాకూడు.. నీ ముఖం చూస్తేనే దరిద్రం పోవే ఇక్కడి నుంచి అని ఇందిరాదేవి తిట్టగానే.. రుద్రాణి ఏడుస్తున్నట్టు నటిస్తూ.. అమ్మా మీ ఆవేశంలో అర్థం ఉంది అమ్మ. మీరు నన్ను ఆసహ్యించుకోవడంలో న్యాయం ఉంది. నిజానికి నేను చేయకూడని తప్పులే చేశాను. అందుకు అనుభవిస్తున్నాను కూడా. దేవాలయం లాంటి ఆ ఇంటికి బంగారం లాంటి మనుషులను వదిలి నేను బయటికి వెళ్లిన తర్వాతే అర్థం అయింది అమ్మ. నేను ఏం కోల్పోయానో.. ఎంత తప్పు చేశానో అని కళ్లు తెరుచుకున్నాను.. కుటుంబం విలువ తెలుసుకున్నాను.. నేను చేసిన పాపాలకు నా కడుపున పుట్టిన కొడుకు కూతురు కూడా నాతో మాట్లాడటం లేదు.. నన్ను చూస్తేనే ఆసహ్యించుకుంటున్నారు ఇలాంటి బతుకు నేనెందుకు బతకాలి అనిపిస్తుంది. అందుకే మిమ్మల్ని ఒక్కసారి చూసి పోదామని వచ్చాను అమ్మా.. మళ్లీ మీ ప్రేమను పొందే అవకాశం మీరెలాగూ నాకు ఇవ్వరు.. కాబట్టి నేను చచ్చే ముందు అయినా నన్ను క్షమించాము అనే ఒకే మాట మీ నోట విని శాశ్వతంగా వెళ్లిపోతాను అంటూ నటిస్తుంటే..

అప్పుడే అక్కడకు వస్తారు అప్పు, కళ్యాణ్‌.. అప్పు గట్టిగా ఆపు నీ నాటకాలు అంటుంది. అప్పు కళ్యాణ్ లను చూసిన రుద్రాణి షాక్‌ అవుతుంది. దెబ్బలతో ఉన్న అప్పు, కళ్యాణ్‌ లను చూసిన అందరూ కంగారు పడతారు. ఏం జరిగింద అని అడుగుతారు. దీంతో అప్పు మొత్తం చెప్పేస్తుంది. పాపను మార్చిన దగ్గర నుంచి హాస్పిటల్‌ లో పాపను చంపాలనుకోవడం.. తర్వాత మమ్మల్ని కిడ్నాప్‌ చేయడం.. ఇప్పుడు చంపాలనుకోవడం అంతా వెనకుండి నడిపించింది ఈ రుద్రాణియే.. ఇప్పుడు ఇక్కడ అందరి ముందు నాటకం ఆడుతుంది అని అప్పు చెప్పగానే.. మినిస్టర్‌ కూడా నిజం చెప్తాడు. దీంతో కావ్య కోపంగా చెప్పు తీసుకుని రుద్రాణిని కొడుతుంది. తిట్టి అక్కడి నుంచి వెళ్లిపోమ్మని వార్నింగ్‌ ఇస్తుంది. అందరూ రుద్రాణిని తిట్టి వెళ్లిపోమ్మని చెప్తారు. రాహుల్‌ కూడా తిడుతూ.. రుద్రాణి చేయి పట్టి లాగి బయటకు తోసేస్తాడు. రుద్రాణి వెళ్లిపోతుంది.

Advertisement

తర్వాత రేఖ, రాహుల్‌  రుద్రాణి దగ్గరకు వెళ్తారు.. దుగ్గిరాల ఫ్యామిలీ మొత్తం చంపేయాలని ప్లాన్‌ చేస్తారు. మరోవైపు దుగ్గిరాల ఇంట్లో అందరూ రుద్రాణి గురించి ఆలోచిస్తుంటారు. ఇంతలో రాహుల్‌ ,రేఖ బట్టలు సర్దుకుని ఇంట్లోంచి శాశ్వతంగా వెళ్లిపోతున్నామని పై నుంచి కిందకు వచ్చి చెప్తారు. దీంతో అందరూ షాక్‌ అవుతారు. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ వీరే.. దశావతారం వర్కౌట్ అవుతుందా?

కృష్ణాష్టమి స్పెషల్.. ‘రాధా’గా మారిన అనసూయ.. వీడియో వైరల్!

అవినాష్, అరియానా మధ్య గొడవలు నిజమేనా? బయటపెట్టిన శ్రీముఖి!

Nindu Noorella Saavasam Serial Today Episode September 4th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆత్మ కోసం ప్రచండ ప్రత్యేక పూజ  

Gundeninda GudiGantalu Today episode: మీనాను దెబ్బ అదుర్స్.. సంజుకు దిమ్మతిరిగే షాక్.. బాలుకు రాఖీ కట్టిన మౌనిక..

Ninnu kori Serial Today Episode September 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: చంద్రకు నిజం తెలిసిందన్న మందర – షాక్‌ అయిన మాయ      

Podarillu Today Episode : చక్రితో అంట్లు కడిగించిన మహా.. నారాయణ హర్ట్.. జయంతి మాటతో షాక్..

Karthika Deepam 2 Serial Today Episode September 4th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలిని ఇంట్లో పని మనుషుల్లాగా ఉంటామన్న దీప, కార్తీక్         

Big Stories

Advertisement
×