South Movies on OTT : ఫిబ్రవరి నెల ఎండింగ్ లో ఓటీటీలో ఆసక్తికర కంటెంట్ ఉన్న సౌత్ సినిమాలు స్ట్రీమింగ్ లో ఉన్నాయి. రొమాంటిక్ కామెడీ నుంచి యాక్షన్, మిస్టరీ థ్రిల్లర్ వరకు అన్ని రకాల ప్రేక్షకులకు కావాల్సిన ఎంటర్టైన్మెంట్ దొరుకుతోంది ఈ సినిమాలతో. ఈ సినిమాలు ఏ ఓటీటీలో ఎక్కడ స్ట్రీమింగ్ లో ఉన్నాయో తెలుసుకుందాం పదండి.
ఈ ఫీల్-గుడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ లో జీ. వి ప్రకాష్ కుమార్, అనస్వర రాజన్ నటించారు. ఈ తమిళ చిత్రం థియేటర్లలో విడుదల కాకుండానే ఫిబ్రవరి 20న జియో హాట్‌స్టార్ లో డైరెక్ట్ ప్రీమియర్ అవుతోంది. ఒక కుక్కపిల్ల తప్పిపోవడంతో ఈ కథ ఆసక్తికర మలుపు తీసుకుంటుంది. ఈ ఫీల్-గుడ్ సినిమా ఫ్యామిలీతో కలిసి చూడడానికి పర్ఫెక్ట్ గా ఉంటుంది.
‘హాట్ స్పాట్ 2 మచ్’ విఘ్నేష్ కార్తీక్ దర్శకత్వంలో 2026 జనవరి 23న విడుదలైన ఒక హైపర్ లింక్ డ్రామా. ఇందులో ప్రియా భవానీ శంకర్, MS బాస్కర్, తంబి రామయ్య, రక్షణ, అశ్విన్ కుమార్, ఆదిత్య బాస్కర్, భవాని శ్రీ నటించారు. దీనిని కెజెబి టాకీస్, యాంట్స్ టు ఎలిఫెంట్స్ నిర్మించారు. ఇది ఆరు స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లలో 2026 ఫిబ్రవరి 20న ప్రీమియర్ అవుతోంది. అమెజాన్ ప్రైమ్ వీడియో, ఆహా, లయన్స్‌గేట్ ప్లే, సింప్లీ సౌత్, AP ఇంటర్నేషనల్ సౌత్ సినిమా, షార్ట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది.
ఫిబ్రవరి 11 నుంచి ఈ మూవీ జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. అనిల్ రావిపూడి, చిరంజీవి కాంబినేషన్ లో వచ్చిన మన శంకరవరప్రసాద్ గారు జీ5 ఓటీటీలో 500 మిలియన్ల స్ట్రీమింగ్ మినట్స్ రికార్డు అందుకుంది. ఈ విషయాన్ని ఆ ఓటీటీయే తన ఎక్స్ అకౌంట్ ద్వారా వెల్లడించింది.
రతీనా పిటి దర్శకత్వం వహించ ఈ సినిమాలో నవ్య నాయర్ SI జాన్సీ పాత్రలో, సౌబిన్ షాహిర్ కానిస్టేబుల్ పాత్రలో నటించారు. ఒక రాత్రి పెట్రోలింగ్ డ్యూటీలో ఇద్దరు పోలీసులు చిక్కుల్లో పడతారు. ఆ సంఘటన వాళ్ల జీవితాలను తలక్రిందులు చేస్తుంది. థియేటర్లలో సంచలనం సృష్టించకపోయినా, ఆన్‌లైన్‌లో ఇప్పుడు ఈ సినిమాపై బాగా ఆసక్తి పెరిగింది. జీ5లో ఈ సినిమా ఫిబ్రవరి 20 నుంచి స్ట్రీమింగ్ లో ఉంది.
ఇందులో 3 రోజుల పసికందు ఆసుపత్రి నుంచి కనిపించకుండా పోతుంది. ఆ నింద ఆసుపత్రి సిబ్బందిపై పడుతుంది. చివరికి అ పాపని ఎలా కనిపెట్టారనేదే ఈ కథ. అరుణ్ వర్మ దర్శకత్వంలో నివిన్ పౌలీ, లిజోమోల్ జోస్, సంగీత్ ప్రతాప్ నటించారు. ఇప్పటికే ఈ సినిమా సోనీ లివ్ లో విడుదలై మంచి రెస్పాన్స్ పొందుతోంది.
ఒక నదిలో వరుసగా మనుషుల శరీర భాగాలు దొరకడంతో పోలీసులు విచారణ ప్రారంభిస్తారు. తొలుత ఇవి మొసలి దాడులని గ్రామస్తులు భావిస్తారు. కానీ ఇన్వెస్టిగేషన్ చేస్తున్న కొద్దీ ఇది మొసలి పని కాదని, దీని వెనుక ఒక సైకో కిల్లర్ ఉన్నాడని తెలుస్తుంది. ఇది ఫిబ్రవరి 20 నుంచి ZEE5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. సుహాన్ ప్రసాద్ దర్శకత్వం వహించగా, ప్రముఖ దర్శకుడు తరుణ్ సుధీర్ దీనిని నిర్మించారు. ఇందులో విజయ్ రాఘవేంద్ర పోలీసు పాత్రలో నటించారు.
Read Also : ఓటీటీలోకి మూడు నెలల తరువాత మలయాళం మిస్టరీ మూవీ… నాగ దేవత చుట్టూ కథ