E-Paper
Advertisement

Brahmamudi Serial Today January 18th: ‘బ్రహ్మముడి’ సీరియల్: కావ్యను నిలదీసిన అపర్ణ – ఆస్తులు పంచమన్న రుద్రాణి

Brahmamudi Serial Today January 18th: ‘బ్రహ్మముడి’ సీరియల్: కావ్యను నిలదీసిన అపర్ణ – ఆస్తులు పంచమన్న రుద్రాణి
Advertisement

Brahmamudi serial today Episode: రాజ్‌ కోపంగా రుద్రాణిని తిడతుంటాడు. నలుగురు కలిసి నవ్వుకోవడం ఇంటిల్లి పాది సంతోషంగా ఉండటం నీకు గిట్టదు. నువ్వు నీ కొడుకు పనిగట్టుకుని ఏదో పరిశోధించినట్టు నిలదీస్తుంటే.. అసలు నిన్ను ఏమనాలో నాకు అర్థం కావడం లేదు అంటూ రాజ్‌ తిడుతుంటే.. ధాన్యలక్ష్మీ మధ్యలో కల్పించుకుని రుద్రాణి గొడవ పుట్టిస్తుంది సరే ఎలాగూ ఆ నిజం బయట పెట్టింది కదా రాజ్‌.. అంటే మన కంపెనీ అకౌంట్స్ లో కనీసం ఐదు లక్షలు కూడా లేవా..? హాస్పిటల్ బిల్లు కట్టడానికి నగలు తాకట్టు పెట్టేంట దుస్తితిలో ఉన్నామా..? అది తేలాలి ముందు అంటుంది.

దీంతో అపర్ణ కోపంగా ఏం తేలాలి చెప్పు అకౌంట్ విషయమా..? ఎక్కడ తేలాలి.. నగలు తాకట్టు పెట్టిన విషయమా..? రుద్రానికి నీకు పెద్ద తేడా లేదని నువ్వు కూడా ఈ మధ్య ఫ్రూవ్ చేసుకుంటుంన్నావు. కానీ రుద్రాణి కనిపెట్టిన అద్బుతమైన విషయానికి నేను సమాధానం చెప్తాను. నేను చెప్తేనే కావ్య నగలు తాకట్టు పెట్టింది. అని అపర్ణ చెప్పగానే అందరూ షాక్‌ అవుతారు. ఇంతలో రుద్రాణి ఏంటి వదిన నువ్వు అయిదు లక్షల కోసం నీ కోడలి చేత నగలు తాకట్టు పెట్టించావా..? అని అడుగుతుంది. దీంతో అపర్ణ అవును నేనే తాకట్టు పెట్టించాను అంటుంది.

Advertisement

ఎందుకు అపర్ణ నీకు తెలిసి ఇదంతా జరిగిందా..? నగలు తాకట్టు పెట్టించాల్సిన కష్టం ఏమోచ్చింది అని ఇందిరాదేవి అడుగుతుంది. దీంతో అపర్ణ కష్టం కాదు అత్తయ్యా.. అవసరం వచ్చింది కంపెనీ అకౌంట్లు అన్ని హోల్డ్‌ లో పెట్టారని రాజ్‌ చెప్పగానే.. హాస్పిటల్‌ బిల్లు కట్టకపోతే పరువు పోతుందని నేనే నగలు తాకట్టు పెట్టించి బిల్లు కట్టించాను అంటుంది. దీంతో రుద్రాణి. చాకచక్యంగా నువ్వు నీ కొడుకు కోడల్ని దోషుల్ని చేయకుండా కాపాడుతున్నావని అర్థం అయిపోయిందిలే వదిన అంటుంది.

అవునా అయితే ఏంటి ఇప్పుడు.. నీకు చేతనైతే ఫ్రూవ్‌ చేయ్‌.. అసలు నువ్వు ఏ హక్కుతో మమ్మల్ని నిలదీస్తున్నావు. నువ్వెంత నీ లెక్కెంత.. నీ బతుకెంత.. ఈడ్చి తంగే నడిరోడ్డు మీద పడే బతుకే నీది అంటూ వార్నింగ్‌ ఇస్తుంది. దీంతో రుద్రాణి, రాహుల్‌ అలిగి అక్కడి నుంచి వెళ్లిపోతుంటే.. మూర్తి వెళ్లి మీరు మా ఇంటికి వచ్చిన అతిథులు.. పుట్టబోయే బిడ్డకు తండ్రి, నాన్నమ్మ మీరు అంటూ బతిమాలినా వినకుండా అక్కడి నుంచి వెళ్లిపోతారు.

Advertisement

తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత కావ్య నగలు ఎందుకు తాకట్టు పెట్టారని అపర్ణ, ఇందిరాదేవి నిలదీస్తారు. అసలు ఏం జరుగుతుందో చెప్పు అంటూ గట్టిగా అడుగుతుంది అపర్ణ. ఎందుకొచ్చింది ఈ పరిస్తితి ఎందుకొచ్చింది ఈ దుస్థితి అంటూ ఆవేశ పడుతుంది. ఇంతలో ఇందిరాదేవి అపర్ణను ఆవేశపడొద్దని కావ్య ఏం చేసినా ఆలోచించే చేస్తుంది. మంచే చేస్తుంది అని చెప్తుంది. అయ్యో అత్తయ్యా నేను ఇప్పుడు కావ్య వ్యక్తిత్వాన్ని అనుమానించి అడగడం లేదు అంటుంది అపర్ణ.

అత్తయ్యా మీరు నా వ్యక్తిత్వాన్ని నమ్ముతున్నారా..? అని కావ్య అడుగుతుంది. నేను ఈ బాధ్యతలు మోయలేను అన్న రోజు నన్ను వెన్నుతట్టి ప్రోత్సహించిన మీరే ఇలా నిలదీస్తారా..? దారి చూపించిన మీరే ఆ దారి మూసేస్తే నాకు ఇంకో దారి లేదు నన్ను క్షమించండి అంటూ వెళ్లిపోతుంటే.. అపర్ణ కోపంగా నా మీదే నేరం మోపి సమాధానం చెప్పకుండా వెళ్లిపోతే నీకేమీ తెలియదని ఊరుకుంటాను అనుకుంటున్నావా..? నా మాటకు విలువ ఇవ్వని మనిషితో నాకు మాటలు అనవసరం.. ఇంకెప్పుడు నాతో నువ్వు మాట్లాడకు.. అంటూ వెళ్లిపోతుంది అపర్ణ.

రూంలో కూర్చుని రాజ్‌, కావ్య బాధపడతారు. ఇంట్లో జరుగుతున్న పరిణామాల గురించి ఏం  చేయాలో అర్థం కాక తల పట్టుకుంటారు. ఈ అనుమానాలకు అంతే లేదా..? ఈ అవమానాలకు ముగింపే లేదా అంటుంది కావ్య. దీంతో ఒక దారి ఉందని రాజ్‌ అంటాడు అందరినీ నిజం చెప్పేద్దామని తాతయ్య మాట ఇచ్చిన విషయం.. నంద మోసం చేసిన విషయం అంతా చెప్పేద్దాం అంటాడు రాజ్‌. నిజం చెప్తే వాళ్ల రియాక్షన్‌ ఎలా ఉంటుందో తెలుసా..? ముందు రుద్రాణే నమ్మదు అంటుంది. ఒక్కోక్కరి రియాక్షన్‌ ఎలా ఉంటుందో కావ్య చెప్తుంది. అందరి రియాక్షన్‌ ఊహించుకున్న రాజ్ షాక్‌ అవుతాడు. ఇప్పుడేం చేద్దాం మరి అని కావ్యను అడుగుతాడు. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

 

ALSO READ: సకల బాధలను దూరం చేసే షణ్ముఖి రుద్రాక్ష ధారణ ఎవరు చేయాలి..?

 

Tags

Related News

Godhavari Janu : ‘గోదావరి ‘ లవర్స్ కు షాకింగ్ న్యూస్.. హీరోయిన్ అవుట్..

Telugu Serials : సీరియల్స్ కు పేమెంట్ ఎలా ఇస్తారు..? అర్రె ఇన్నాళ్లు ఇది మిస్ అయ్యామా..?

Tuesday Movies in Tv : మంగళవారం టీవీ సినిమాలు.. వీటిని మిస్ చెయ్యకండి..

బిగ్ బాస్ సీజన్ 10కి ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడంటే?

డైరెక్టర్ అనిల్ రావిపూడి కాలర్ పట్టుకున్న సుడిగాలి సుధీర్.. ఏం జరిగింది?

Podarillu Mahalakshmi : ‘పొదరిల్లు’ సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. మహా అవుట్…

Gundeninda GudiGantalu Today episode: అయ్యో పాపం మీనా.. ప్రభావతి ఫుల్ హ్యాపీ.. బాలుకు అనుమానం..

Nindu Noorella Saavasam Serial Today Episode July 20th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: హోమం చూసి భయపడిన ప్రచండ – కోపంతో రగిలిపోయిన మనోహరి  

Big Stories

Advertisement
×