OTT Movie : హిస్టారికల్ కథలతో వచ్చే సినిమాలపై అంచనాలు ఎక్కువగానే ఉంటాయి. ఒకప్పుడు పెద్దవాళ్లు కథల రూపంలో పిల్లలకు చెప్పేవాళ్ళు, ఆ తర్వాత చందమామ కథలలో చూసేవాళ్ళం, ఇప్పుడు టెలివిజన్ పుణ్యమా అని ఇంట్లోనే కూర్చుని చూసి ఎంటర్టైన్ అవుతున్నాం. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఒక కొరియన్ హిస్టారికల్ మూవీ డిఫరెంట్ కంటెంట్ తో వచ్చింది. రాజు, రాణి, అంగరక్షకుడు మధ్య తిరిగే ఈ మూవీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఓటిటి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ కొరియన్ హిస్టారికల్ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…
రెండు ఓటిటిలలో
ఈ కొరియన్ హిస్టారికల్ మూవీ పేరు ‘ఎ ఫ్రోజన్ ఫ్లవర్‘ (A Frozen Flower). ఈ మూవీకి యూహా దర్శకత్వం వహించడంతో పాటు, జో ఇన్-సంగ్, జూ జిన్-మో సాంగ్ జి-హ్యో నటించారు. రాజుకు పిల్లలు పుట్టరని తెలిసి, రాణితో ఆ పని వేరే వాళ్ళతో చేస్తాడు రాజు. ఆ తరువాత జరిగే సన్నివేశాలతో స్టోరీ నడుస్తుంది. ఈ కొరియన్ హిస్టారికల్ మూవీ, ఓటిటి ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video), నెట్ఫ్లిక్స్ (Netflix) లలో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీ లోకి వెళితే
కింగ్ తన అంగరక్షకుడిగా చాలామందిని పరీక్షించి ఒక వ్యక్తిని నియమించుకుంటాడు. చిన్నప్పటి నుంచి రాజు అతనిని ఎక్కువగా నమ్ముతుంటాడు. ఎంతలా అంటే రాజు ఒక స్వలింగ సంపర్కుడు అనే విషయం కూడా అంగరక్షకుడికి మాత్రమే తెలుస్తుంది. అయితే రాజు ఏం చెప్తే అది చేయడానికి సిద్ధపడే అంగరక్షకుడు, రాజుతో కలిసి ఆ పని కూడా చేస్తుంటాడు. అయితే రాజుకు పిల్లలు పుట్టకపోవడంతో, రాజ్యాన్ని కోల్పోయే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఆ రాజ్యంలో పిల్లలు పుట్టని రాజును పక్కన పెట్టి, మిగతావాళ్లు రాజ్య పరిపాలన చేస్తారు. ఈ విషయం బాగా ఆలోచించిన రాజు, అంగరక్షకుడి ద్వారా పిల్లల్ని కనాలనుకుంటాడు. మొదట రాణికి ఈ విషయం చెప్పడంతో, ఆమె కంగారు పడుతుంది. అయితే రాజు ఆజ్ఞ కావడంతో, ఇద్దరూ కలిసి ఆ పని మొదలు పెట్టాలని ట్రై చేస్తారు.
అయితే రాణి కంటనీరు వస్తుండటంతో, అంగరక్షకుడు ఆపని చేయలేక బయటికి వచ్చేస్తాడు. ఆ తర్వాత అంగరక్షకుడు, రాణి ఆ పని బాగానే పూర్తి చేస్తారు. అయితే అంగరక్షకుడు రాణి తో గడిపినందుకు రాజు బాధపడతాడు. ఎందుకంటే అంగరక్షకుడు తనకు మాత్రమే సొంతం అనుకుంటాడు రాజు. చివరికి ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఎంత వరకు వెళ్తుంది? అంగరక్షకుడి వల్ల రాజుకు సంతానం కలుగుతుందా? రాణి ప్రేమలో అంగరక్షకుడు పడతాడా? ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఓటిటి ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video), నెట్ఫ్లిక్స్ (Netflix) లలో స్ట్రీమింగ్ అవుతున్న ‘ఎ ఫ్రోజన్ ఫ్లవర్’ (A Frozen Flower) అనే ఈ కొరియన్ హిస్టారికల్ ఎంటర్టైనర్ మూవీని మిస్ కాకుండా చూడండి.