E-Paper
Advertisement

Brahmamudi Serial Today January 5th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రెండో రోజు పసరు మందు తీసుకున్న రుద్రాణి

Brahmamudi Serial Today January 5th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రెండో రోజు పసరు మందు తీసుకున్న రుద్రాణి
Advertisement

Brahmamudi serial today Episode:

రెండో రోజు సపరు మందు తీసుకొచ్చే వీరయ్య కోసం బయట వెయిట్‌ చేస్తుంది రుద్రాణి. ఇంతలో వీరయ్య గేటు ఓపెన్‌ చేసుకుని వస్తాడు. వీరయ్యను చూసిన రుద్రాణి కంగారు పడుతుంది. ఓరేయ్‌ అక్కడే ఆగరా లోపలికి వచ్చేస్తున్నావు.. ముందు బయటకు పద అంటూ బయటకు తీసుకుని వెళ్తుంది. వీరయ్య ఏమైందమ్మా అని అడగ్గానే.. ఏమైందా..? నిన్ను లోపలికి రావొద్దు బయట నుంచే ఫోన్‌ చేయమని చెప్పాను కదా..? అనగానే.. చెప్పారు అమ్మా కానీ నా ఫోన్‌లో బ్యాటరీ అయిపోతుంది. అని చెప్పగానే అలాగని గేటు తీసుకుని అత్తారింటికి వచ్చినట్టు లోపలికి వచ్చేస్తావా..? ఎవరైనా నిన్ను చూస్తే ఎంత ప్రమాదమో తెలుసా..? అంటూ తిడుతుంది రుద్రాణి.

దీంతో వీరయ్య ఏమైందమ్మా ఇప్పుడు.. ఎవ్వరూ చూడలేదు కదా అంటాడు. ఏం చెప్పానురా నీకు ఈ ఇళ్లంతా కళ్లే ఒక్కరి కంట పడ్డా నువ్వు నేను కతమే.. అని హెచ్చరిస్తుంది. దీంతో వీరయ్య అంటే అమ్మా పసరు మందు తయారు చేసిన ఆనందంలో మీకు తొందరగా ఇవ్వాలని అలా లోపలికి వచ్చేశానమ్మా.. ఏమీ అనుకోవద్దమ్మా అని చెప్పగానే.. సరేలే పసరు ముందు ఎక్కడుంది ఇవ్వు.. అని రుద్రాణి అడగ్గానే.. వీరయ్య మందు తీసి ఇదిగోనమ్మా అంటూ సీసా ఇస్తాడు. అది చూసిన రుద్రాణి ఇది అనుకున్నట్టు పని చేస్తుందా.? అని అడుగుతుంది. ఎంత మాటమ్మా రోజంతా కష్టపడి చేసిన మందమ్మా..? ఇది కానీ కడుపులోకి వెళ్లిందంటే.. పేగులతో సహా బయటకు వచ్చేయాలమ్మా.. నన్ను నమ్మండి అమ్మా.. అని చెప్పగానే.. సరే ఈ డబ్బు తీసుకో వెళ్లిపో అని చెప్తుంది రుద్రాణి.  వీరయ్య వెళ్లిపోయాక కావ్య నీ సంగతి చెప్తాను అంటూ లోపలికి వెళ్తున్న రుద్రాణికి కనకం ఎదురవుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి షాక్‌ అవుతుంది. ఏంటలా చూస్తున్నావు అని అడుగుతుంది.

Advertisement

దీంతో కనకం ఏంటది అని అడుగుతుంది. ఏమీ తెలియనట్టు రుద్రాణి నువ్వు దేని గురించి అడుగుతున్నావు అని తిరిగి అడుగుతుంది. దీంతో కనకం నీ కొంగు చాటున దాచిన దాని గురించి అడుగుతున్నాను అనగానే.. ఏం మాట్లాడుతున్నావు నువ్వు అంటూ రుద్రాణి కోప్పడుతుంది. నీ కొంగు చాటున దాచిన దాగి గురించే అడుగుతున్నాను.. మర్యాదగా చూపించు అంటూ కనకం గట్టిగా అడగ్గానే.. రుద్రాణి ఇదిగో చూడు సరిగ్గా చూడు.. పసరు మందు అని చెప్పగానే.. కనకం ఆశ్చర్యంగా పసరు మందా..? దేనికి అని అడగ్గానే.. రోజూ అజీర్తిగా ఉంది.. తెలిసిన వాళ్లు పసరు మందు వాడమని చెప్పారు.. తెచ్చుకున్నాను అంతే.. అయినా నువ్వేంటి..? దొంగను ప్రశ్నించినట్టు నన్ను ప్రశ్నిస్తున్నావు.. అసలు ఏమనుకుంటున్నావు నీ గురించి అని రుద్రాణి అడగ్గానే..

కనకం కోపంగా ఈ ఇంటికి వియ్యపురాలిని అనుకుంటున్నాను అని చెప్పగానే.. అలా అని గొప్ప అనుకోకు.. ఈ ఇంటికి పిల్లను ఇచ్చిన ఆడపిల్లవి తల్లివి మహా అయితే కాస్త బంధువువి అంతే అది మర్చిపోయి ఈ ఇంటి వ్యక్తి లాగా నన్ను ప్రశ్నించకు నాకు నచ్చదు.. నీ స్థానంలో నువ్వు ఉండు.. అర్థమైందా..? అంటూ వార్నింగ్‌ ఇచ్చి వెళ్లిపోతుంది రుద్రాణి. అనుమానంగా చూసిన కనకం అజీర్తికి పసరు మందు కావాలంటే ఉదయమో, మధ్యాహ్నమో సాయంత్రమో తెప్పించుకోవచ్చు కదా..? ఇంత రాత్రి పూట బయటకు వెళ్లి తెచ్చుకోవడం ఏంటి..? ఇదేదో తేడాగా ఉందే తెలుసుకుని తీరాల్సిందే.. అనుకుంటూ లోపలికి వెళ్లిపోతుంది కనకం.

Advertisement

తర్వాత సీమంతానికి అన్ని ఏర్పాట్లు చేస్తుంటారు రాజ్‌, కళ్యాణ్‌. స్వీట్లు, ప్లవర్స్‌ క్యాటరింగ్‌ అన్ని రెడీ చేశామని చెప్పడంతో సీమంతం అంటే స్వీట్లు వంటలే కాదు.. అతి ముఖ్యమైనవి మట్టి గాజులు అని ఆ గాజుల ప్రత్యేకత గురించి చెప్తుంది కనకం. కనకం మాటలకు అందరూ ఆశ్చర్యపోతారు. తర్వాత రాజ్‌ వెళ్లి కావ్యను.. కళ్యాణ్‌ వెళ్లి అప్పును సీమంతానికి రెడీ చేస్తారు. అప్పు దగ్గరకు వెళ్లిన ధాన్యలక్ష్మీతో ఎమోషనల్‌ అవుతుంది. నేను మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నాను అంటుంది.

దీంతో ధాన్యం కూడా మొదట నేను కూడా నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను కానీ నీ మనసు అర్థం అయ్యాక నా కోడలు బంగారం అని తెలిసింది. అంటూ అప్పు చేధించిన కేసు గురించి గొప్పగా చెప్తుంది. మరోవైపు కావ్య తాగే కషాయంలో పసరు మందు కలిపేందుకు రెడీగా ఉంటుంది. ఇంతలో రేఖ వచ్చి త్వరగా పసరు మందు కలిపేయ్‌ అని చెప్తుంది. ఇలాంటి టైంలో తొందరపాటు వద్దు ఆలోచించి చేయాలి అని చెప్తుంది రుద్రాణి. ఇప్పుడు కావ్య సీమంతంలో కూర్చుంటుంది వెళ్దాం పద అని రేఖ చెప్పగానే.. ఇద్దరూ కలిసి కావ్య రూం దగ్గరకు వెళితే అప్పటికే అక్కడ కనకం, కావ్య మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్లను చూసి రుద్రాణి షాక్‌ అవుతుంది. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

Telugu Tv Serials : ఈ వారం సీరియల్స్ రౌండప్.. టాక్ ఆఫ్ ది సీరియల్ ఏదంటే..?

ఇంద్రజకు ఒక్కరోజు రెమ్యూనరేషన్ ఎన్ని లక్షలో తెలుసా..? సినిమా కన్నా ఎక్కువే..

Gundeninda GudiGantalu Today episode: సంబరాలు చేసుకున్న ప్రభా.. చింతామణి కుట్ర తెలిసిపోతుందా..? బాలుకు షాక్..

Podarillu Today Episode : విగ్నేశ్వరి దెబ్బకు మహా ఫ్యూజుల్ అవుట్.. మహా కోసం సర్ప్రైజ్ ప్లాన్.. నిజం తెలిసిపోతుందా..?

Intinti Ramayanam Today Episode: అయ్యో పాపం శ్రీయ.. పల్లవి నగలను కొట్టేసిందా..? అక్షయ్ సీరియస్..

Illu Illalu Pillalu Today Episodes: ధీరజ్ కు షాక్.. వల్లి ఫిట్టింగ్ అదిరిపోయింది.. నెక్స్ట్ ఏం జరుగుతుంది..?

Sunday Movies in Tv : ఆదివారం టీవీ సినిమాలు.. మాస్ ఫ్యాన్స్ కు పునకాలే..

Nindu Noorella Saavasam Serial Today Episode July 18th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్లాన్ ప్రకారం బుజ్జమ్మ చంపాలనుకున్న ప్రచండ

Big Stories

Advertisement
×