E-Paper
Advertisement

Brahmamudi Serial Today Episode June 11th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఐశ్వర్యను కొట్టి వార్నింగ్ ఇచ్చిన ఇందు 

Brahmamudi Serial Today Episode June 11th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఐశ్వర్యను కొట్టి వార్నింగ్ ఇచ్చిన ఇందు 
Advertisement

Brahmamudi serial today Episode: అపర్ణ రూంలోకి వెళ్లగానే.. ఇందును ఇంకా ఇంత అమాయకంగా ఉంటే ఎలా అని తిడుతుంటే.. రాజు అడ్డుపడి మీ మనవరాలు చాలా తెలివైన అమ్మాయి అని ఆ రేఖనే బోల్తా కొట్టించి తను సీఈవో అయిందని వామ్మో త్వరలోనే మీ మనవరాలి తెగువ తెలివి మీకు త్వరలోనే తెలస్తాయి అని చెప్పగానే.. ఇందు కూడా నేను ఎలా ఉండాలో మీకు తర్వాత చెప్తాను. ఇప్పుడు మాత్రం రేఖ ఆంటీకీ అనుకూలంగా ఉండాలని లేదంటే తర్వాత చాలా ప్రాబ్లమ్‌ వస్తుందని చెప్పగానే.. సుభాష్‌ కూడా ఇందుకు జాగ్రత్తలు చెప్తాడు. ప్రతిక్షణం నువ్వు చాలా అలర్ట్‌గా ఉండాలి. సెకన్స్‌లో నిర్ణయం తీసుకోవాలి అది కరెక్ట్ అయ్యుండాలి. అలా ఉంటేనే కంపెనీని ముందుకు తీసుకెళ్లగలరు అని చెప్పగానే.. రాజు ఈ విషయంలో మీరు బాధపడాల్సిన అవసరం లేదు.. మేము రూపంలోనే కాదు అన్ని విషయాల్లో మీకొడుకు కోడలు కన్నా మేం ఎక్కువేం కాదు అని చెప్పగానే.. అపర్ణ సరే బాబు మీరు ఎప్పుడూ ఇలాగే ఒకరికొకరు హ్యాపీగా ఉండాలి అంటూ చెప్పగానే.. సరే అమ్మమ్మ మీకు త్వరలోనే ఒక మనవడిని ఇస్తాము అనగానే.. ఇందు, రాజు కాలు తొక్కుతుంది. రాజు అక్కడి నుంచి వెళ్లిపోతాడు.

తర్వాత ఐశ్వర్య దగ్గరకు వెల్లిన కావ్య కోపంగా ఐశ్వర్యను కొడుతుంది. అసలు నేను సీఈవో అవ్వకూడదని నీకెందుకు అంత కోపం అంటూ ప్రశ్నిస్తుంది. చెల్లెలిని ఎవరైనా ఇలా కిడ్నాప్‌ చేస్తారా..? అని అడగ్గానే.. ఐశ్వర్య కోపంగా నువ్వు నా చెల్లెలివి కాదు.. నువ్వు నా శత్రువువి నా బద్ద శత్రువువి అంటూ కోప్పడుతుంది. నా మీద ఎందుకు ఐషు నీకు ఇంత కోపం అని అడగ్గానే.. సీఈవో అవ్వగానే.. వచ్చి  నన్ను కొట్టావు కదా.. ఇదే నాకు నచ్చడం లేదు.. అని చెప్పగానే.. ఇందు కోపంగా నేను చెప్పేది నీ లైఫ్‌ గురించి ఇకనుంచైనా నా మాట విను అనగానే.. వినను నీ సానుభూతి మాటలు నాకు అవసరం లేదు. నువ్వు మీ అమ్మలాగే చేస్తున్నావు అని నాకు తెలుసు అంటూ ఐశ్వర్య, ఇందును తిడుతుంటే.. ఇక నీ మీద అక్క అనే సానుభూతి కూడా చూపను.. నీ ఖర్చులకు ఒక్క రూపాయి కూడా ఇవ్వను. ఆంటీని కూడా ఇవ్వనివ్వను అంటూ వార్నింగ్‌ ఇచ్చి వెళ్లిపోతుంది.

Advertisement

గార్డెన్‌లో కూర్చున్న రేఖతో శేషు, భ్రమరాంబ నువ్వు సీఈవో అవుతావనుకుంటే.. ఆ ఇందును సీఈవోను చేశావేంటి..? ఒకవేళ ఆ ఇందు ఎదురు తిరిగితే ఏం చేస్తావు అని అడుగుతుంది. శేషు అయితే తన అనాలసిస్‌ ప్రకారం ఇందు కచ్చితంగా ఎదురు తిరుగుతుంది అని చెప్పగానే.. రేఖ కోపంగా శేషును తిడుతుంది. ఇందు ఎప్పటికీ తనకు ఎదురు తిరగదని.. ఆ ముసలి వాళ్ల కోసమైనా అది నాకు ఎదురుతిరగదు అని చెప్పగానే.. శేషు మాత్రం ఇన్ని రోజులు వేరు ఇప్పుడు వేరు ఇప్పుడు ఇందు పక్కన అల్లుడు రాజు ఉన్నాడు.. మీకు ఇందు ఎదురు తిరిగేలా చేస్తాడు. అని మనసులో అనుకుంటాడు.

ఐశ్వర్య రూంలోకి వెళ్లి అద్దంలో తన చెంప చూసుకుని ఇందును తిట్టుకుంటుంది. నన్నే కొడతావా..? నీ సంగతి చెప్తా అని కోపంతో రగిలిపోతుంటే.. అప్పుడే స్వాతి వెళ్లి చూసి చెంప ఎందుకు అక్కా అలా ఎర్రగా అయింది.. ఎవరైనా కొట్టారా నిన్ను  అంటూ అడగ్గానే.. ఐశ్వర్య కోపంగా స్వాతిని తిట్టి అక్కడి నుంచి పంపిచేస్తుంది. మరోవైపు రాజు దగ్గరకు వెళ్లిన శేషు నువ్వు సీఈవో అవుతావని ఎన్ని ఆశలు పెట్టుకున్నానో తెలుసా..? నువ్వు సీఈవో కాలేదని నాకెంత బాధ ఉందో తెలుసా.. అంటూ మాట్లాడుతుంటాడు. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

Advertisement

 

Related News

బిగ్ బాస్ 10లో ఎవరు ఎంత తీసుకుంటున్నారు? లెక్కలు బయటికి!

‘నిన్ను కోరి’ సీరియల్ నుంచి హీరో ఔట్.. బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నారా?

యాటిట్యూడ్ చూపిస్తున్నారు.. కామనర్స్ పై బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ ఫైర్!

ఆట మొదలుపెట్టిన షాలిని.. ఇదికదా అసలైన సింపథీ గేమ్!

8 ఏళ్లకే తల్లి మరణం.. ఆపై తండ్రి కూడా..బిగ్ బాస్ కంటెస్టెంట్ జీవితంలో అన్నీ కన్నీళ్లే!

బిగ్ బాస్ హౌస్ నుంచి ఫస్ట్ ఎలిమినేషన్ ఎవరంటే?

Ye devi varamo Neevu : ఫ్యాన్స్ కు షాకింగ్ న్యూస్.. హీరో అవుట్..

Podarillu Manisha : అమ్మబాబోయ్.. మనీష బాగా రిచ్.. హీరోయిన్ల కంటే ఎక్కువే..

Big Stories

Advertisement
×