E-Paper
Advertisement

సంజు కంటే అభిషేక్ శ‌ర్మ పెద్ద‌ పోటుగాడా? అంద‌రికీ ఒకే రూల్స్ ఉండాలి

సంజు కంటే అభిషేక్ శ‌ర్మ పెద్ద‌ పోటుగాడా?  అంద‌రికీ ఒకే రూల్స్ ఉండాలి
Advertisement

Hanuma Vihari On Sanju – Abhishek Sharma:  టీమిండియా కుర్ర క్రికెటర్ అభిషేక్ శర్మ వరుసగా విఫలమవుతున్నాడు. టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంటు నుంచి ఇదే పరిస్థితి కొనసాగుతోంది. ఎన్నిసార్లు అవకాశం ఇచ్చిన డక్ అవుట్ కావడం.. లేదా 10 పరుగులు చేసి అవుట్ కావడం జరుగుతోంది. ఈ క్రమంలో జింబాబ్వే టూర్ లో కూడా దారుణంగా విఫలమయ్యాడు అభిషేక్ శర్మ. అతనికంటే 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్య వంశీ ( Vaibhav) అద్భుతంగా రాణించాడు. దీంతో అభిషేక్ శర్మ ను టీమిండియా లోంచి తీసివేయాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి.’

Also Read : Robin Uthappa On Babar Azam:  బాబర్ ఆజం వ‌ర‌ల్డ్ క్లాస్ ప్లేయ‌ర్‌..కానీ అత‌న్ని పాక్ ప్లేయ‌ర్లే తొక్కేస్తున్నారు

సంజు కంటే అభిషేక్ పెద్ద‌ పోటుగాడా? అంద‌రికీ ఒకే రూల్స్ ఉండాలి

Advertisement

అభిషేక్ శర్మ వరుసగా విఫలమవుతున్న నేపథ్యంలో తెలుగు కుర్రాడు, మాజీ టీమిండియా ఆటగాడు హనుమ విహారి ( Hanuma Vihari) సంచలన వ్యాఖ్యలు చేశారు. సంజు శాంసన్ ( Sanju Samson) కంటే అభిషేక్ శర్మ పెద్ద పోటుగాడా? అతనికొక రూల్… ఇతనికు ఒక రూల్ అప్లై చేస్తారా? అంటూ గౌతమ్ గంభీర్ తో పాటు భారత సెలెక్టర్లను కడిగిపారేశారు హనుమ విహారి. వరుసగా విఫలమవుతున్న అభిషేక్ శర్మకు మళ్లీ మళ్లీ అవకాశాలు ఎందుకు ఇస్తున్నారని ఫైర్ అయ్యారు.

టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్  ( 2026 T20 World Cup tournament)  సందర్భంగా సంజు శాంసన్ అద్భుతంగా ఆడి టోర్నమెంట్ లోనే హీరోగా మిగిలాడని గుర్తు చేశారు. అలాంటోడికి కేవలం మూడు మ్యాచ్ లలో అవకాశం ఇచ్చి.. విఫలమయ్యాడని బయటకు పంపించారని ఆగ్రహించారు. అది అభిషేక్ శర్మ టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ నుంచి ఇప్పటి వరకు అత్యంత చెత్త ప్రదర్శన కనబరుస్తున్నాడని ఫైర్ అయ్యారు. వెంటనే సంజు శాంసన్ కు అవకాశాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు హనుమ విహారి.

భారత సెలక్షన్ కమిటీ పైన హనుమ విహారి సీరియస్

Advertisement

అభిషేక్ శర్మ  ( Abhishek sharma)విషయం గురించి ప్రస్తావించిన మాజీ క్రికెటర్ హనుమ విహారి.. అదే సమయంలో సెలెక్టర్ల పనితీరుపై కూడా విమర్శలు చేశారు. అభిషేక్, సంజు విషయంలోనే కాకుండా మిగిలిన విషయాల్లో కూడా భారత సెలక్టర్లు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నట్లు అనుమానం వ్యక్తం చేశారు. అసలు ఎవరిని సెలెక్ట్ చేస్తున్నారో ? ఎవరిని పక్కకు పెడుతున్నారో ? కొత్త ప్లేయర్లను పదేపదే ఎందుకు తెరపైకి తీసుకువస్తున్నారు ? అనే విషయం సెలెక్టర్లకైనా తెలుసా ? అంటూ కడిగి పారేశారు.  ఇదే ధోరణితో బీసీసీఐ అలాగే సెలెక్టర్లు ముందుకు సాగితే.. టీమిండియా వన్డే వరల్డ్ కప్ గెలవడం కష్టమేనని తెలిపారు. 2027 వన్డే వరల్డ్ కప్ సమయం దగ్గర పడుతోందని.. ఇలాంటి నేపథ్యంలో బలమైన టీమిండియాను తయారు చేయాలని కోరారు. ఆ దిశగా అడుగులు వేసే క్రమంలో భారత సెలెక్టర్లు తప్పిదాలు చేస్తున్నారని ఆగ్రహించారు.

Also Read : టెస్ట్ ప్లేయ‌ర్ అంటూ ట్రోల్స్‌..ఇచ్చిప‌డేసిన తిల‌క్‌..రెండో టీ20లోనూ టీమిండియా విజ‌యం

 

 

Related News

పసికూన‌ జింబాబ్వే పైన గెలవడం కాదు…మ‌గాళ్లు అయితే మాపై గెల‌వండి!

పాకిస్తాన్ ఘోర అవ‌మానం…ఏ ఒక్క కామెంటేటర్ ను పిల‌వ‌ని వెస్టిండీస్‌

వైభ‌వ్ సెంచ‌రీ మిస్…టీమిండియా చేతిలో జింబాబ్వే వైట్ వాష్

Video: వైభవ్ సూర్యవంశీ భారీ సిక్సర్..స్టేడియం బయట పడ్డ బంతి

జింబాబ్వేను బెదిరించి సిరీస్ గెలుచుకున్నారు..త‌న్వీర్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వెనుక ధోని కుట్ర‌లు?

జింబాబ్వే బౌలర్లు స్లో బంతులు వేశారు…అందుకే టీమిండియా గెలుపు

Big Stories

Advertisement
×