E-Paper
Advertisement

కొత్త లోగో.. కొత్త ఫార్మాట్.. మీరు ఎన్నడూ చూడని సరికొత్త టీవీ న్యూస్ ఛానెల్‌గా..

కొత్త లోగో.. కొత్త ఫార్మాట్.. మీరు ఎన్నడూ చూడని సరికొత్త టీవీ న్యూస్ ఛానెల్‌గా..
Advertisement

BIG TV Relaunch: బిగ్ టీవీ.. విత్అవుట్ ఫియర్ ఆర్ ఫేవర్. ఇకపై ప్రజల గొంతుక వినిపించేందుకు మేమున్నాం అంటూ వచ్చేసింది ‘బిగ్ టీవీ’. సరికొత్త లోగోతో రిలాంచ్ అవ్వడమే కాదు. తెలుగు రాష్ట్రాల్లో మరే న్యూస్ ఛానెల్ ఇవ్వని సరికొత్త ఫార్మాట్‌లో న్యూస్ ప్రజెంట్ చేసేందుకు ప్రామిస్ చేస్తూ.. ప్రజల పక్షాన గళం వినిపించేందుకు సిద్ధమైంది. బిగ్ టీవీ.. మినిస్టరీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్ కాస్టింగ్, హోం మినిస్టరీ నుంచి రెగ్యులేట్, వెరిఫైడ్ అయిన ఛానెల్.

ఒకేసారి 50మంది రిపోర్టర్లు..

సాధారణంగా ఒక న్యూస్ ఛానెల్ లో వార్తను ప్రసారం చేసేటప్పుడు ఒక యాంకర్ లేదా న్యూస్ రీడర్ స్క్రీన్ పై కనిపిస్తుంటారు. కొన్ని సందర్భాల్లో ఒకటి లేదా ఇద్దరు, ముగ్గురు రిపోర్టర్లకు ఏకకాలంలో కాల్ చేసి.. గ్రౌండ్ రిపోర్ట్ తెలుసుకునే ప్రయత్నం చేస్తుంటారు. కానీ తెలుగు మీడియాలో రంగంలో ఇక్కడే బిగ్ టీవీ సరికొత్త ఒరవడిని సృష్టిస్తోంది. ఒకే బులిటెన్ లో 50 వార్తలను రిపోర్టర్ల ద్వారా ప్రజలకు అందించబోతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న బిగ్ టీవీ రిపోర్టర్లందరూ స్క్రీన్ పై కనిపించి ప్రజలకు తమ ప్రాంతంలో చోటుచేసుకున్న అంశాలను స్వయంగా తెలియజేయనున్నారు. ఇలా రిపోర్టర్లందరూ ఒకే బులెటిన్ లో కనిపించడం తెలుగు మీడియా ఛానెల్ లో ఇదే తొలిసారి కావడం విశేషం.

బిగ్ టీవీ ఎడిటర్ల డిబేట్..

Advertisement

బిగ్ టీవీ 2.0లో వినూత్నమైన డిబేట్ ను ప్రజలు చూడబోతున్నారు. ఇన్నాళ్లు ఒక వార్త ఛానెల్ కు సంబంధించి యాంకర్ లేదా ఎడిటర్ స్థాయి వ్యక్తి డిబేట్ లో కూర్చొని.. పార్టీల ప్రతినిధులతో పలు అంశాలపై చర్చించడం మనం చూశాం. కానీ బిగ్ టీవీలో తొలిసారి చీఫ్ ఎడిటర్ తోపాటు అసోసియేట్ ఎడిటర్లందరూ కలిసి స్వయంగా డిబేట్ లో పాల్గొననున్నారు. ఉదాహరణకు ఒక్కో ఎడిటర్ ఒక్కో పార్టీ ప్రతినిధిగా తమ అభిప్రాయాలను తెలియజేయనున్నారు. ఆ పార్టీలోని లోటుపాట్లు, ఇతర పార్టీలతో పోలిస్తే సదరు పార్టీ పనితీరు ఏ ఏ అంశాల్లో మెరుగ్గా ఉందో ప్రజల కళ్లకు కట్టనున్నారు. ఈ తరహా ప్రయోగం తెలుగు మీడియా రంగంలో ఇదే తొలిసారి కావడం విశేషం.

Also Read: అప్పులు తీర్చడానికి మళ్లీ కొత్త అప్పులు.. నెల ఆదాయం మొత్తం ఈఎంఐలు తీర్చడానికే..

స్టింగ్ ఆపరేషన్స్‌పై ఫోకస్..

Advertisement

ఒకప్పుడు మీడియా రంగంలో స్టింగ్ ఆపరేషన్స్ అంటే పెద్ద సంచలనం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సహా దేశవ్యాప్తంగా ఎన్నో కుంభకోణాలను వెలుగులోకి తెచ్చిన ఘనత ఈ స్టింగ్ ఆపరేషన్స్ కే దక్కుతాయి. అలాంటింది కారణం ఏదైనా అలాంటి స్టింగ్ ఆపరేషన్స్ ఇటీవల కాలంలో తెలుగు మీడియాలో కరువైపోయాయి. ఇది మీడియా ఛానెళ్ల విశ్వసనీయతను కూడా మసకబారుస్తోందన్న అభిప్రాయాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో బిగ్ టీవీ రీలాంచ్ సందర్భంగా ఇకపై అలాంటి సెన్సేషనల్ స్టింగ్ ఆపరేషన్ కథనాలు చూడబోతున్నారు. అవినీతి అక్రమార్కుల నిజస్వరూపాలను బిగ్ టీవీ.. బట్టబయలు చేయబోతోంది. ఇందుకోసం పక్కా ఆధారలతో ప్రత్యేక కథనాలను ప్రసారం చేయనుంది. మున్ముందు రోజుల్లో వాటికి సంబంధించిన కథనాలను ప్రజలు చూడబోతున్నారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

Also Read: చురుకైన మెదడు, మెరిసిపోయే చర్మం.. పురుషులు ఉదయాన్నే ఖాళీ కడుపున ఇవి తింటే ఎన్ని లాభాలో

Related News

Telugu Tv Serials : ఈ వారం సీరియల్స్ వీక్లీ రౌండప్.. ఎవ్వరు ఊహించని సీరియల్ టాప్..?

Gundeninda GudiGantalu Today episode: ఎపిసోడ్ కు హైలెట్ సీన్.. శృతి గ్రేట్ కదా.. మనోజ్ ను మోసం చేసిన రోహిణి..

Podarillu Today Episode : చక్రీ సీరియస్.. సురేష్ మాస్టర్ ప్లాన్ సక్సెస్.. రచ్చ చేసిన వరాలు ..

Intinti Ramayanam Today Episode: అక్షయ్ తో అవని గొడవ.. పల్లవికి మరో టెన్షన్.. అశ్విన్, పల్లవి దొరికిపోతారా?

Illu Illalu Pillalu Today Episodes: గ్రాండ్ గా శారదాంబ బర్త్ డే వేడుక.. ధీరజ్ పై నర్మద కౌంటర్స్.. ప్రేమకు సర్ప్రైజ్..

మీడియాలో ‘బిగ్ టీవీ’ కొత్త అధ్యాయం.. ప్రత్యక్ష ప్రసారాలతో రీ-ఎంట్రీ.. ప్రజల వైపే మా పయనం!

ఫస్ట్ క్రష్ పై స్పందించిన శ్రీముఖి.. ఎవరేమనుకున్నా ఆ ప్రేమ ఎప్పటికీ మారదు అంటూ!

Big Stories

Advertisement
×