E-Paper
Advertisement

Brahmamudi Serial Today Episode June 4th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: సీఈవోగా ఇందు – ప్రకటించిన రేఖ 

Brahmamudi Serial Today Episode June 4th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: సీఈవోగా ఇందు – ప్రకటించిన రేఖ 
Advertisement

Brahmamudi serial today Episode: కిచెన్‌లో ఉన్న ఇందు దగ్గరకు వెళ్లిన ఐశ్వర్య తిడుతుంది. నీ ప్రవర్తనలో ఏదో తేడా వచ్చిందని నీ మొగుడు ఉన్నాడన్న ధైర్యమా..? వాడే ఒక పనికిమాలినోడు.. వాణ్ని నమ్ముకుని తల ఎగిరేద్దామనుకుంటున్నావా..? అంటూ ప్రశ్నిస్తుంది. దీంతో ఇందు కోపంగా ఐసు ఆయన్ని వాడు వీడు అని పిలవడం కరెక్టు కాదు అంటుంది. ఐశ్వర్య కోపంగా మరి ఎలా పిలవాలి.. రాజుగారు అని పిలవాలా..? నిన్ను ఇందు గారు అని పిలవాలా… అయినా వాణ్ని ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నాను అన్నావు కదా వాణ్ని అంటే ఫీలవుతున్నావు.. నీ ప్లేస్‌ మారినంత మాత్రాన నీ ఫేట్‌ ఏమీ మారదు. ఇప్పటికీ నువ్వు మా ఇంట్లో పనులు చేసే పనిమనిషివి ఆ విషయం మర్చిపోకు అనగానే..

ఇందు కోపంగా అవును నేను ఏదో ఒక పని చేస్తున్నాను ఆ విషయం మర్చిపోకు అంటుంది ఇందు. దీంతో ఐశ్వర్య కోపంగా అంటే నేను ఏ పని చేయడం లేదని అంటున్నావా..? అని అడగ్గానే.. ఇందు కోపంగా అది ప్రత్యేకంగా చెప్పాలా..? నన్ను పనిమనిషి అంటున్నావు.. నా స్టేటస్‌ మారదు అంటున్నావు.. కానీ నీ స్టేటస్‌ ఏంటి..? అంటూ ఇందు ప్రశ్నించగానే.. ఐశ్వర్య కోపంగా ఏయ్ నా గురించి నువ్వు పట్టించుకోవద్దు.. అనగానే ఇద్దరి మధ్య గొడవ జరుగుతుంది. ఇందు కోపంగా ఐశ్వర్య ప్రవర్తనను చెక్‌ చేసుకోమని.. ప్రతిసారి ఇలా నీతులు మాత్రమే చెప్తాను అనుకోకు.. అవసరం అయితే బుద్ది కూడా చెప్తాను అంటూ వార్నింగ్‌ ఇచ్చి వెళ్లిపోతుంది.

Advertisement

రూంలో ఫుల్లుగా తాగి పడిపోయిన ఆంటోని జేబులోంచి రేఖ ఫోటో కింద పడిపోతుంది. అది తీసుకుని చూడబోతున్న లక్కీ ని తోసేసి ఫోటో లాగేసుకుంటాడు ఆంటోని. అది నా పర్సనల్‌ నువ్వు చూడకూడదు అంటూ తిడతాడు. దీంతో లక్కీ నీ పర్సనల్‌ గురించి నాకెందుకు కానీ మా అమ్మ ఎక్కడుందో చెప్పరా అంటూ చిన్నప్పటి నుంచి తాను అమ్మను మిస్‌ అయిన విషయం చెప్తూ ఎమోషనల్‌ అవుతాడు. లక్కీని అర్థం చేసుకున్నట్టు నటించిన ఆంటోని మీ అమ్మ గురించి తెలుసుకుందాం.. ఈలోపు నేను ప్రెష్‌ అప్‌ అవుతాను.నువ్వు వెళ్లి టిఫిన్‌ తీసుకురా అని చెప్తూ లోపలికి వెళ్తాడు. లక్కీ మాత్రం ఆంటోనిని అనుమానిస్తాడు.

ఇందు ఉదయమే లేచి దేవుడికి పూజ చేసి తాను కంపెనీలో సీఈవోగా బాధ్యతలు చేపట్టాలని చేస్తున్న ప్రయత్నాలు సక్సెస్ కావాలని ప్రార్థిస్తుంది. పూజ తర్వాత హారతి తీసుకుని అపర్ణ, సుభాష్‌లకు ఇస్తుంది. ఇందును చూసిన అపర్ణ, సుభాష్‌లు రాజు గురించి ఇందులో గొప్పగా చెప్తారు. రాజు ఇంట్లో అడుగు పెట్టాడో ధైర్యం వచ్చిందని తమను స్వరాజ్‌ ఎంత ప్రేమగా చూసుకునేవాడో రాజు కూడా మమ్మల్ని అంత ప్రేమగా చూసుకుంటున్నాడని చెప్తారు. ఇందు మాత్రం మా పెళ్లే అబద్దం అంటూ మనసులో ఆలోచిస్తుంటే.. అప్పుడే వచ్చిన రాజు చాలా సంతోషంగా ఉంది అమ్మమ్మ అంటూ వాళ్లకు చెప్పి మరోసారి ధైర్యం ఇస్తాడు. ఇక ఇందు రెడీ అవుతానని వెళ్తుంది. ఇందు వెళ్లాక అపర్ణ ఎమోషనల్ అవుతూ.. మీ పెళ్లి అనుకోకుండా జరిగినా నువ్వు ఇందు జీవితంలోకి వచ్చి చాలా మంచి పని చేశావు బాబు.. అంటుంది.

Advertisement

సుభాష్‌ కూడా అవును బాబు నువ్వు మాకు కొత్త ఊపిరి పోశావు.. ఈరోజు కంపెనీ విషయంలో కూడా జోక్యం చేసుకుంటూ ఇందుకు అండగా నిలబడుతున్నావు అంటాడు. అపర్ణ బాధపడుతూనే అసలు ఈ ఇంటిని కంపెనీని నా మనవడు చూసుకోవాలి.. వాడు మాకు దూరం అయిపోయాడు. ఇప్పుడు వాడి స్థానాన్ని నువ్వు బర్తీ చేస్తున్నావు బాబు. నిజంగా నిన్ను చూస్తుంటే.. నీతో మాట్లాడుతుంటే.. మన మధ్య ఏదో రక్త సంబంధం ఉందనపిస్తుంది అంటూ ఎమోషనల్ అవుతుంటే.. రాజు కూడా నాక్కూడా ఏంటి ఈవిడ స్పర్శ తగలగానే ఏదేదో అయిపోతుంది. ఈవిడ మాటలకు నేను రోజురోజుకు కనెక్ట్‌ అయిపోతున్నాను.. మనం అసలు కనెక్ట్‌ అవ్వకూడదు.. అని మనసులో అనుకంటుంటాడు. ఇంతలో అపర్ణ బాబు నువ్వు ఎప్పుడూ ఇందుకు ఇలాగే తోడుగా ఉంటావు కదా అని అడగ్గానే.. రాజు ఉంటాను అమ్మమ్మ అంటూ వెళ్లిపోతాడు.

రేఖ, భూషణ్‌, భ్రమరాంబ, శేషు నలుగురు కలిసి గార్డెన్‌ లో కూర్చుని రాజును సీఈవో కాకుండా ఉండాలంటే ఏం చేయాలంటూ ఆలోచిస్తారు. అప్పుడే రేఖ రాజుకు పోటీగా ఇందును సీఈవోను చేయాలని చెప్తుంది. అందరూ షాక్‌ అవుతారు. చాటు నుంచి అంతా వింటున్న ఐశ్వర్య భయపడుతుంది. ఇందు సీఈవో అవ్వడం ఏంటి..? అనుకుంటూ వెళ్లిపోతుంది. శేషు మాత్రం నీ మాటలు అర్థం కావడం లేదని పూర్తిగా అర్థం అయ్యేటట్టు చెప్పమని అడుగుతాడు. దీంతో రేఖ ఇందును అడ్డుపెట్టుకుని తాను సీఈవో అవుతానని చెప్తుంది రేఖ. రేఖ ప్లాన్‌ మొత్తం విన్న శేషు, భ్రమరాంబ నీ ప్లాన్‌ వర్కవుట్‌ అవుతుదా..? అంటూ ప్రశ్నిస్తారు. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

Telugu Tv Serials : సీరియల్స్ వీక్లీ రౌండప్.. ఆ ఒక్కటే మళ్లీ టాప్..

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి కొత్త టెన్షన్.. చింటును బాలు తెస్తాడా..? గుణ ప్లానేంటి..?

Podarillu Today Episode : నారాయణకు అడ్డంగా దొరికిన జమున.. కన్నా సీరియస్.. ఇదేం ట్విస్ట్..

Intinti Ramayanam Today Episode: అక్షయ్ మాటతో మీనాక్షి షాక్.. పల్లవికి మైండ్ బ్లాక్.. అరెస్ట్ చేస్తారా..?

Illu Illalu Pillalu Today Episodes: రెచ్చిపోయిన భాగ్యం.. రామరాజు మాస్ వార్నింగ్.. వల్లికి ఇంకో ఛాన్స్..

Sunday TV Movies : ఆదివారం టీవీల్లోకి బోలెడు సినిమాలు.. మస్ట్ వాచ్..

Nindu Noorella Saavasam Serial Today Episode October 18th‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరి కోల్‌ కతా వెళ్లడానికి వైజయంతి ఒప్పుకుంటుందా..?

క్యాస్టింగ్ కౌచ్‌పై ఝాన్సీ ఏమన్నారంటే.. ఇండస్ట్రీలో మహిళల పరిస్థితి ఇదేనా?

Big Stories

Advertisement
×