E-Paper
Advertisement

Brahmamudi Serial Today march 11th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: తాత కోసం పనిమనిషిగా వెళ్లనున్న ఇందు 

Brahmamudi Serial Today march 11th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: తాత కోసం పనిమనిషిగా వెళ్లనున్న ఇందు 
Advertisement

Brahmamudi serial today Episode: 

డాక్టర్‌ వచ్చి సుభాష్ ను చెక్‌ చేసి ఆపరేషన్‌ చేస్తే లేచి నడవొచ్చు అని చెప్తాడు. దీంతో అపర్ణ ఆపరేషన్‌కు ఎంత ఖర్చు అవుతుంది డాక్టర్‌ అని అడగ్గానే.. ఆపరేషన్‌కు పది లక్షల దాకా ఖర్చు అవుతుందని చెప్తాడు. ఆ తర్వాత అబ్జర్వేషన్‌ అని టెస్టులు అని హాస్పిటల్‌ లో కొద్ది రోజులు ఉండాల్సి వస్తుంది. మొత్తం మీద ఒక పదిహేను లక్షలు అవుతాయి అని చెప్పగానే.. అపర్ణ, ఇందు పదిహేను లక్షలా అంటూ నోరెల్లబెడతారు. అపరేషన్‌ కూడా ఎంత త్వరగా చేస్తే అంత మంచిది లేదంటే వెన్నెముక పాడైపోతుంది. అంతవరకు ఈ మెడిసిన్స్‌ వాడండి అంటూ చెప్పి వెళ్లిపోతాడు డాక్టర్‌..

డాక్టర్‌ వెళ్లిపోయాక అపర్ణ బాధగా కోటలో బతుకుతున్నా.. కోట్ల ఆస్థి కళ్ల ముందు కనిపిస్తున్నా..? మీకు ఆపరేషన్‌ చేయించడానికి ఒక్క రూపాయి కూడా లేకుండా చేశాడు ఆ దేవుడు.. ఇప్పుడు అంత డబ్బంటే ఎక్కడి నుంచి తీసుకురావాలి. వచ్చిన డబ్బును వచ్చినట్టే రాబందుల్లా వాళ్లు పీక్కుతింటున్నారు. ఇప్పుడు మనకు అవసరం అయితే అంత డబ్బు ఎవరిస్తారు అని బాధపడుతుంటే.. ఇందు ఇంకెవరు ఇస్తారు ఆ రేఖ ఆంటీ ఇస్తారు.. ఇప్పటి వరుక మన కోసం అంటూ ఎప్పుడూ ఏదీ అడగలేదు.. తాతయ్య కోసమైన ఆ రేఖ ఆంటీని అడుగుతాను నాన్నమ్మ అనగానే.. సుభాష్‌ వద్దమ్మా నువ్వు వెళ్లి ఆ రాక్షసి దగ్గర దేహి అంటూ చేయి చాచడం నాకు ఇష్టం లేదమ్మా..? ఇప్పటి వరకు నీకోసం నేను ఏమీ చేయలేకపోయాను. భవిష్యత్తులో చేస్తానన్న నమ్మకం కూడా లేదు.. అలాంటి నాకోసం నువ్వు వెళ్లి ఆ రాక్షసిని అడగొద్దు అమ్మ మా వల్ల నువ్వు పడుతున్న కష్టాలు అవమానాలు చాలు ఆ అపరేషన్‌ చేయకపోతే ఏమవుతుంది. చచ్చే వరకు ఇలానే జీవచ్చంలా పడి ఉంటాను. దానికి నేను సిద్దమే కానీ నువ్వు మాత్రం వెళ్లి తనను అడగొద్దు అమ్మ.. అని చెప్పినా వినకుండా ఇందు బయటకు వెళ్లిపోతుంది.

Advertisement

మరోవైపు నందు తన షాపు ముందు నిలబడి టీ తాగుతున్న నగల దొంగను పోలీసులకు పట్టిస్తుంది. దీంతో ఆ దొంగ నందును బెదిరిస్తూ  జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత నీ అంతు చూస్తానని అంటాడు. ఇందు బెదురుకోకుండా వెళ్లిపోతుంది.  రేఖ, భ్రమరాంబ నెక్లెస్‌ గురించి మాట్లాడుతుంటే. ఇందు వస్తుంది. ఆంటీ మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అనగానే రేఖ ఇప్పుడు కాదు అంటుంది. దీంతో ఇందు ఇది చాలా ముఖ్యమైన విషయం ఆంటీ తాతయ్యకు ఆపరేషన్‌ చేయించాలి.. డాక్టర్‌ పదిహేను లక్షలు అవుతుంది అంటున్నారు అని చెప్తుంటే.. పట్టించుకోకుండా ఇది ఐశ్వర్య బర్తుడే కోసం డిజైన్‌ చేయించాను. ఎలా ఉంది భ్రమరాంబను అడుగుతుంది. భ్రమరాంబ అబ్బా చూస్తుంటేనే కళ్లు చెదిరిపోతున్నాయి అనుకో.. ఇక ఐశ్వర్య వేసుకుంది అంటే చూసే వాళ్ల కళ్లు పేలిపోతాయేమో అంటూ ఇద్దరూ నవ్వుతుండగానే.. ఐశ్వర్య హాయ్‌ ఆంటీ అనుకుంటూ వస్తుంది.

ఇందును కోపంగా చూస్తుంది. ఇంతలో రేఖ హాయ్‌ ఐశ్వర్య ఏంటి ఇలా రెడీ అయ్యావు ఎక్కడికి వెళ్తున్నావు అని అడగ్గానే.. ఐశ్వర్య మర్చిపోయావా.. నా ఎగ్జామ్ అయిపోగానే నా ఫ్రెండ్స్‌కు పార్టీ ఇస్తానని చెప్పాను కదా అని చెప్పగానే.. భ్రమరాంబ అయితే పబ్‌కు వెళ్తున్నావు అన్నమాట అనగానే.. ఇందు ఆంటీ ఒక్కసారి నేను చెప్పేది వినండి.. అంటుంది. ఐశ్వర్య కోపంగా ఏయ్‌ నీకు ఎన్ని సార్లు చెప్పాలి నేను మాట్లడేటప్పుడు నువ్వు నోరు మూసుకుని ఉండాలని అబ్బా.. నీ ఏడుపు గొంతు వింటుంటేనే నాకు చిరాకు వస్తుంది అంటుంది. దీంతో ఇందు అది కాదు ఐశ్వర్య తాతయ్యకు ఆపరేషన్‌ చేయించాలి అని చెప్పగానే..

Advertisement

ఐశ్వర్య చిరాకుగా చిన్నప్పటి నుంచి నీ దరిద్రం గురించి వింటూనే ఉన్నాను.. రోజుకో బాధ పూటకో రోగం ఇలాంటివి అన్ని చెప్పి నా మూడ్‌ పాడు చేయకు అనగనే.. భ్రమరాంబ కూడా బాగా చెప్పావు వినేవాళ్లు ఉంటే రోజుకో కథ చెప్తుంది ఇది అంటుంది. ఐశ్వర్య వెంటనే ఆంటీ నాకు పార్టీకి టైం అవుతుంది మనీ కావాలి అని చెప్పగానే.. ఎంత అని అడుగుతుంది రేఖ. జస్ట్‌ వన్‌ లాక్‌ అని ఐశ్వర్య చెప్పగానే.. ట్రాన్స్‌ఫర్‌ చేస్తుంది రేఖ. ఐశ్వర్య వెళ్లిపోతుంది. ఇందు ఆపరేషన్‌ గురించి చెప్పి డబ్బులు ఇవ్వమని ప్రాదేయపడుతుంది. దీంతో రేఖ డబ్బులు లేవని వెళ్లిపోతుంది.  తర్వాత ఇంటికి వచ్చిన శివరామ్‌ ఇందు చేసిన ఫుడ్‌ తిని ఇంత రుచికరమైన వంట చేసిన ఇందును రోజూ మా ఇంటికి వచ్చి వంట చేయమని చెప్తారా..? అని రేఖను అడుగుతాడు.. రేఖ సరే అంటుంది. ఇందు, అపర్ణ, స్వాతి షాక్‌ అవుతారు. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

Telugu Tv Serials : ఈ వారం సీరియల్స్ రౌండప్.. టాక్ ఆఫ్ ది సీరియల్ ఏదంటే..?

ఇంద్రజకు ఒక్కరోజు రెమ్యూనరేషన్ ఎన్ని లక్షలో తెలుసా..? సినిమా కన్నా ఎక్కువే..

Gundeninda GudiGantalu Today episode: సంబరాలు చేసుకున్న ప్రభా.. చింతామణి కుట్ర తెలిసిపోతుందా..? బాలుకు షాక్..

Podarillu Today Episode : విగ్నేశ్వరి దెబ్బకు మహా ఫ్యూజుల్ అవుట్.. మహా కోసం సర్ప్రైజ్ ప్లాన్.. నిజం తెలిసిపోతుందా..?

Intinti Ramayanam Today Episode: అయ్యో పాపం శ్రీయ.. పల్లవి నగలను కొట్టేసిందా..? అక్షయ్ సీరియస్..

Illu Illalu Pillalu Today Episodes: ధీరజ్ కు షాక్.. వల్లి ఫిట్టింగ్ అదిరిపోయింది.. నెక్స్ట్ ఏం జరుగుతుంది..?

Sunday Movies in Tv : ఆదివారం టీవీ సినిమాలు.. మాస్ ఫ్యాన్స్ కు పునకాలే..

Nindu Noorella Saavasam Serial Today Episode July 18th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్లాన్ ప్రకారం బుజ్జమ్మ చంపాలనుకున్న ప్రచండ

Big Stories

Advertisement
×