E-Paper
Advertisement

Brahmamudi Serial Today march 17th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: పోలీస్ స్టేషన్ లో కలుసుకున్న ఇందు, నందు   

Brahmamudi Serial Today march 17th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: పోలీస్ స్టేషన్ లో కలుసుకున్న ఇందు, నందు   
Advertisement

Brahmamudi serial today Episode:   ఐశ్వర్యను బైక్‌ మీద తీసుకెళ్తున్న లక్కీని పోలీసులు స్టేషన్‌కు తీసుకెళ్తారు. ఇద్దరినీ కూర్చోబెట్టి ఎంక్వైరీ చేస్తుంటారు. లక్కీ ఎక్స్‌ట్రాలు చేస్తుంటే ఎస్సై ప్రతి సారి కొడుతుంటే.. రాజు వెళ్లి ఎస్సైతో మాట్లాడి లక్కీని తీసుకుని వెళ్లిపోతాడు. ఐశ్వర్య కోసం ఎవరైనా ఫోన్‌ చేస్తే మన స్టేషన్‌లో ఉందని చెప్పండి అంటాడు. ఇంతలో ఇందు, స్వాతి పోలీస్‌స్టేషన్‌కు వెళ్తారు. పోలీస్‌స్టేషన్ లో తాగిన మత్తులో గొడవ చేస్తుంటుంది. లోపలికి వచ్చిన స్వాతి, ఇందు ఐశ్వర్యను చూసి షాక్‌ అవుతారు. ఎస్సై ఇందును అమ్మా ఈవిడ మీ తాలూకానేనా..? అని అడగ్గానే.. ఇందు అవును సార్‌ ఇవాళ ఎగ్జామ్‌ పూర్తి అయిందని ఏదో పార్టీకి వెళ్లింది. అక్కడ కొంచెం డ్రింక్‌ చేసినట్టు ఉంది. సారీ సార్‌ అని చెప్పగానే..

ఎస్సై కోపంగా ఏదో కొంచెమా..? పోలీసులకు రౌడీలకు తేడా తెలియనంతగా తాగేసింది. అని చెప్తుండగానే.. అక్కడికి తన బాబాయ్ తో కలిసి నందు వస్తుంది. ఆశ్చర్యంగా చూస్తుంటుంది. ఎస్సై కోపంగా వచ్చినప్పటి నుంచి కిడ్నాప్‌ అంటూ ఒక్కటే గొడవ. పోనీ పంపిచేద్దాం అనుకుంటే బయటికి వెళ్లగానే.. ఏదైనా జరిగితే అది మాకు ఎక్కడ చుట్టుకుంటుందోనని భయం.. అందుకే ఇప్పటి వరకు భరించాల్సి వచ్చింది.. అని ఎస్సై చెప్పగానే.. స్వాతి పోనీ తన ఫొన్‌ తీసుకుని మాకు కాల్‌ చేయాల్సింది అని చెప్పగానే.. ఎస్సై ఆశ్చర్యంగా ఫోన్‌ తీసుకుని ఫోన్‌ చేయాలా..? అది కూడా చూడండి.. కానిస్టేబుల్‌ ఫోన్‌ ఇవ్వు.. అని చెప్పగానే.. కానిస్టుబుల్‌ ఇదిగో అమ్మా లాక్‌ ఓపెన్‌ చేయ్‌.. అని ఐశ్వర్యకు ఫోన్‌ ఇవ్వగానే.. ఫోన్‌ తీసుకున్న ఐశ్వర్య చెప్పండి కిడ్నాపర్‌ గారు అంటుంది.

Advertisement

దీంతో ఎస్సై ఒకసారి మీ ఫోన్‌ అన్‌లాక్‌ చేసి ఇవ్వండి అని చెప్పగానే.. ఐశ్వర్య మత్తుగా చూస్తూ ష్యూర్‌ ఇప్పుడే చేస్తా.. అంటూ గాలిలో ఆన్‌లాక్ చేస్తుంది. అది చూసిన అందరూ నవ్వుకుంటారు.. ఎస్సై బాధగా వచ్చినప్పటి నుంచి అలా గాలిలో నొక్కుతూనే ఉంది. కానీ ఫోన్‌ మాత్రం లాక్‌ ఓపన్‌ అవ్వదు.. ఎంతో మంది డబ్బున్నోళ్లను చూశాము కానీ ఈ రేంజ్‌ లో మమ్మల్ని ఎవ్వరూ ఆడుకోలేదు అమ్మా.. నిమిషానికో మాట మాట్లాడుతుంది ఐదు నిమిషాలకు ఒక గొడవ చేస్తుంది అని చెప్పగానే.. ఇందు బాధగా సార్‌ మా ఐశ్వర్య చేసిన దానికి నేను సారీ చెప్తున్నాను సార్‌ అని చెప్పగానే..

అంతా గమనిస్తున్న నందు కోపంగా చూశావా బాబాయ్‌ దాని పొగరు.. ఇందాక నేను పబ్బులోకి వెళ్లినప్పుడు కూడా చాలా పొగరుగా మాట్లాడింది. అప్పుడే నాలుగు పీకుదామనుకున్నాను.. పని మీద ఉన్నాను కదా అని వదిలేశాను. అమ్మా బాబులు సంపాదిస్తే ఇదిగో ఇలాగే తయారవుతారు. అని చెప్తుండగానే.. బాబాయ్‌ కోపంగా వాళ్ల సంగతి నీకెందుకు నీ పని నువ్వు చూసుకో.. అని చెప్పగానే.. వాళ్లతో పోలిస్తే నీ కూతరు బంగారం అని చెప్తున్నాను అంటుంది. దీంతో ఆయన అమ్మా బంగారం బయలుదేరు అనగానే.. నందు అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఇందు, స్వాతి ఇద్దరూ కలిసి స్టేషన్‌ నుంచి ఐశ్వర్యను తీసుకెళ్తారు. బయట కారు దగ్గర ఐశ్వర్య కోపంగా ఇందును తోసేస్తుంది. అక్కడే స్కూటీ దగ్గర ఉన్న నందు వెళ్లి ఇందు కింద పడకుండా.. పట్టుకుంటుంది. ఐశ్వర్యను తిట్టి వెళ్లిపోతుంది.

Advertisement

తర్వాత ఐశ్వర్యను ఇంటికి తీసుకెళ్తారు ఇందు, స్వాతి. చీకట్లో లోపల తీసుకెళ్తుంటే.. రేఖ వచ్చి లైట్స్‌ వేస్తుంది. అందరూ హాల్లోకి వస్తారు. భ్రమరాంభ కోసంగా చూశావా రేఖ మన కళ్లు కప్పి బయటకు వెళ్లారు. అంటే మన అనుమానం నిజమే ఈ ఇందు అసలు ఇంట్లోనే లేదు.. దాన్ని కప్పి పుచ్చడానికి దీని ముసలి నాన్నమ్మ మన ముందు బోలెడు నాటకాలు ఆడింది అని చెప్పగానే.. రేఖ అనుమానంగా ఇంత రాత్రి పూట ఎక్కడికి వెళ్లావు.. ఎవరిని కలవడానికి వెళ్లావు.. నిజం చెప్పు అంటూ కోపంగా అడగ్గానే.. ఐశ్వర్య పబ్బుకు వెళ్లింది అని ఇందు చెప్పగానే..

అసలు నీకు ఇంత ధైర్యం ఎలా వచ్చింది. ఎందుకోసం వెళ్లావు అంటూ తిడుతుంటే.. అపర్ణ కోపంగా రేఖను తిడుతుంది. ఏ తప్పు చేయని నా మనరాలిని నిందిస్తే బాగుండదు అంటుంది. దీంతో రేఖ కోపంగా అర్ద్రరాత్రి నీ మనవరాలు ఎక్కడికి వెళ్లింది అంటూ ప్రశ్నిస్తుంటే.. స్వాతి కోపంగా నువ్వు ఉండు అక్కా నిజం చెప్పేస్తాను అంటూ స్వాతి జరిగింది మొత్తం చెప్పేస్తుంది. దీంతో అంతా బాగానే చేశారు కానీ నాకెందుకు చెప్పలేదు అని అడగ్గానే.. మీకు భయపడి చెప్పలేకపోయాను అంటుంది స్వాతి. తనకు నిద్రవస్తుందని స్వాతి వెళ్లిపోతుంది. ఇందు కూడా వెళ్లిపోతుంది. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

చీరకట్టులో శివజ్యోతి..ఆ భారీ హారం చూస్తే మతిపోవాల్సిందే!

ఈశ్వర్ సాయి కేసులో కొత్త ప్రశ్న.. ‘పెళ్లైనోడిని ఎలా నమ్మావ్ మాధురి?’

స్టార్ హీరోల సినిమాల కంటే సీరియల్స్‌కే ఎక్కువ క్రేజ్.. అసలు సీక్రెట్ ఏంటి?

పిచ్చి కుక్కల్లా మొరగండి… ట్రోలర్స్ కు కౌంటర్ ఇచ్చిన శిరీష!

నాని ఫోక్ సాంగ్ తో అదరగొట్టేసిన శ్రీముఖి.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode September 2nd  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: పార్థును చంపేందుకు రెడీగా ఉన్న రౌడీలు

Godavari Janu : హాట్ లుక్ లో రెచ్చగొడుతున్న నిత్య.. కుర్రాళ్ళు తట్టుకోలేరమ్మ..!

Gundeninda GudiGantalu Today episode: బాలుకు షాకిచ్చిన నీలకంఠం.. కన్నీళ్లు పెట్టుకున్న మౌనిక.. పాపం బాలు..

Big Stories

Advertisement
×