BigTV English

Brahmamudi Serial Today March 21st : ‘బ్రహ్మముడి’ సీరియల్: హాస్పిటల్‌లో రాజ్‌ను చూసిన కావ్య –  కావ్య కోసం వెతుకుతున్న రాజ్‌

Brahmamudi Serial Today March 21st : ‘బ్రహ్మముడి’ సీరియల్: హాస్పిటల్‌లో రాజ్‌ను చూసిన కావ్య –  కావ్య కోసం వెతుకుతున్న రాజ్‌

Brahmamudi serial today Episode:  ఎంత ధైర్యం ఉంటే రాజ్‌ ఫోటో ముందు దీపం వెలిగిస్తావు అంటూ రుద్రాణి పీక పట్టుకుని చంపేయబోతుంది కావ్య. అందరూ వచ్చి విడిపించగానే.. వెళ్లి ఫోటో దగ్గర ఉన్న పూలు మొత్తం చెల్లా చెదురు చేస్తుంది. కోపంగా రుద్రాణిని చూస్తూ.. ఊపిరి అందడం లేదు కదా..? చచ్చిపోతావని భయం వేసింది కదా..? బతికున్న నా భర్త ఫోటోకు దండ వేస్తున్న.. దీపం వెలిగిస్తున్న నాక్కూడా అలాగే అనిపించింది. ఇదే నీకు చివరి వార్నింగ్‌ ఇంకొక్కసారి ఇలా చేశావంటే ఊరుకోను చెప్తున్నాను అంటూ వార్నింగ్‌ ఇస్తుంది. దీంతో రుద్రాణి ఊరుకోకపోతే ఏం చేస్తావు.. ఇలాగే పీక పిసికి చంపేస్తావా..? అంటుంది.


దీంతో కావ్య మా వారి కోసం ఎంత దూరం అయినా వెళ్తాను అనగానే.. రుద్రాణి వచ్చిందండి సతీ సావిత్రి. యముడి దగ్గర నుంచి భర్త ప్రాణాలు కాపాడి తీసుకొచ్చినట్టు ఇప్పుడు రాజ్‌ను బతికి తీసుకొస్తుందంట. సరే నీ దగ్గరకే వస్తున్నాను. రాజ్‌ బతికే ఉన్నాడు అంటున్నావు కదా..? ఎక్కడున్నాడు. ఏం చేస్తున్నాడు. ఎవరో అమ్మాయితో కలిసి కారులో వెళ్లాడు అన్నావు కదా..? మరి ఎక్కడికి వెళ్లాడు. తన వాళ్లు అందరూ ఇక్కడే ఉన్నారు కదా..? యాక్సిడెంట్ నుంచి తిరిగి ఇంటికి రావాలి కదా..? ఎందుకు రాలేదు అంటుంది. దీంతో కావ్య అదే ప్రశ్న నేను అడిగితే.. మా ఆయన చనిపోవడం నిజం అయితే ఆయన బాడీ ఎక్కడ..? అని అడుగుతుంది. దీంతో రుద్రాణి.. ఏయ్‌ వెర్రి దానిలా మాట్లాడకు.. నీ చెల్లెలే కన్ఫం చేసింది కదా..? రాజ్‌ బట్టలకు రక్తం మరకలు అంటుకున్నాయి.

ఏ సింహమో పులో తిని ఉంటుందని.. చెప్పింది కదా..? అనగానే కావ్య అలా జరగడం మీరు చూశారా..? అని అడగ్గానే.. అలా చెప్పే కదా పోలీసులు కేసు క్లోజ్‌ చేశారు అంటుంది రుద్రాణి. దీంతో కావ్య.. పోలీసులు చెప్పిన విషయం పక్కన పెట్టండి.. ఆయన అడవిలో చనిపోవడం మీరు చూశారా..? పోనీ మీరెవరైనా చూశారా..? చూడలేదు కదా.? కానీ ఆయన బతికి ఉండటం నేను చూశాను. కాబట్టే ఇలాంటివన్నీ వద్దు అంటున్నాను. ఈ ఇంట్లో ఎవరు నమ్మినా నమ్మకపోయినా నేను చెప్పేది నిజం. ఆయన బతికే ఉన్నారు. త్వరలోనే మీ అందరి ముందుకు తీసుకొస్తాను అంటూ రాజ్‌ ఫోటో తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోతుంది.


మరోవైపు రాజ్‌, యామిని హాస్పిటల్‌కు వెళ్తారు. యామినికి తెలియకుండా ఎలాగైనా కావ్య గురించి సమాచారం తెలుసుకోవాలని రాజ్ అనుకుంటాడు. యామిని కూడా రాజ్‌ను డైవర్ట్‌ చేసి కావ్య గురించి తెలుసుకోవాలనుకుంటుంది. మరోవైపు కావ్య కూడా హాస్పిటల్‌కు వెళ్తుంది. హాస్పిటల్‌లో ఉన్న రాజ్ వాష్‌రూంకు వెళ్లి వస్తానని చెప్పడంతో సరే బావ త్వరగా రా అని చెప్తుంది. దీంతో రాజ్‌ వెళ్లాక రిసెప్షన్‌లో కావ్య గురించి ఆరా తీస్తుంది యామిని. ఇంతలో హాస్పిటల్‌ కు కావ్య వస్తుంది. యామిని రిసెప్షన్‌లో ఉండటం చూసి కావ్యకు ట్రీట్‌మెంట్‌ చేసిన డాక్టర్‌ శ్యామల దగ్గరకు వెళ్తాడు రాజ్‌. డాక్టర్‌ పిలుస్తున్నాడని నర్స్‌ చెప్పగానే.. యామిని డాక్టర్‌ దగ్గరకు వెళ్తుంది.

అప్పుడే రిసెప్షన్‌లోకి వచ్చిన కావ్య రాజ్‌ గురించి అడుగుతుంది. వాళ్లు ఇప్పుడే నీ గురించి అడిగారని ఇటు వైపు వెళ్లారని చెప్పగానే.. కావ్య కూడా అటు వైపు వెతుక్కుంటూ వెళ్తుంది. ఇంతలో డాక్టర్‌ కనబడగానే రాజ్‌ వెళ్లి డాక్టర్‌ మీ కోసమే చూస్తున్నాను… అని చెప్పగానే.. డాక్టర్‌ ఎవరు మీరు అని అడుగుతుంది. దీంతో రాజ్‌ రెండు రోజుల క్రితం ఒక అమ్మాయి రోడ్డు మీద పడిపోయిందని తీసుకొచ్చాను మర్చిపోయారా..? అని చెప్పగానే.. డాక్టర్‌ యా గుర్తుకొచ్చింది చెప్పండి అంటుంది. దీంతో రాజ్‌ మీ నుంచి ఒక ఇన్ఫర్మేషన్‌ తెలుసుకోవాలని వచ్చానండి అనగానే డాక్టర్‌ దేని గురించి అంటుంది. ఆ రోజు నేను అడ్మిట్‌ చేసిన అమ్మాయి డీటెయిల్స్ కావాలండి అని అడగ్గానే.. డాక్టర్‌ సారీ అండి బిల్లు అడ్వాన్స్‌ గా పే చేసి మీరు వెళ్లిపోయారు.

ట్రీట్‌మెంట్‌ కంప్లీట్‌ అవ్వగానే ఆవిడ వెళ్లిపోయారు. సారీ అంటూ డాక్టర్‌ వెళ్లిపోతుంది. ఇంతలో యామిని వచ్చి రాజ్‌ను తీసుకుని డాక్టర్‌ దగ్గరకు వెళ్తుంది. డాక్టర్‌ దగ్గర కూర్చుని ఉన్న యామిని, రాజ్‌ లను కావ్య చూస్తుంది. షాక్‌ అవుతుంది. వాళ్లు మాట్లాడుకోవడం వింటుంది. యామిని, రాజ్‌ ను బావ అనడం విని మా ఆయన్ని బావ అంటుందేంటి..? అనుకుంటుంది. మీరు 6 నెలలు కోమాలో ఉండటం వల్ల మీ బాడీ రియాక్ట్‌ అవడం సరిగ్గా లేదు అని డాక్టర్‌ అనగానే.. ఆరు నెలల కోమాలో ఉన్నారా..? వీళ్లేదో ఆయన్ని మాయ చేస్తున్నారు అని బాధపడుతుంది. ఇంతలో డాక్టర్‌ మీకు యాక్సిడెంట్‌ అవ్వడం వల్ల మీరు గతం మర్చిపోయారు అని డాక్టర్‌ రాజ్‌కు చెప్పడంతో కావ్య బాధపడుతుంది. మా ఆయనకు గతం మర్చిపోయారా అని ఎమోషనల్‌ అవుతుంది. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

 

ALSO READ: సకల బాధలను దూరం చేసే షణ్ముఖి రుద్రాక్ష ధారణ ఎవరు చేయాలి..?

 

Tags

Related News

Brahmamudi Serial Today August 8th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రాజ్‌ను తిట్టిన కావ్య – ప్రేమ లేకపోతే ఎందుకొచ్చావన్న రాజ్‌   

Illu Illalu Pillalu Today Episode: తప్పించుకున్న ఆనందరావు.. భద్రకు దొరికేశాడు.. మొత్తం నిజం కక్కేసాడుగా..

Intinti Ramayanam Today Episode: ఇంట్లోంచి లేచిపోతున్న ప్రణతి, భరత్.. అక్షయ్ ను కూల్ చేసిన అవని… భరత్ ను టార్గెట్ చేసిన పల్లవి..

Gundeninda GudiGantalu Today episode: మీనాకు షాకిచ్చిన పోలీసులు.. రోహిణికి దొరికిపోయిన కల్పన..

Today Movies in TV : శుక్రవారం టీవీలల్లోకి రాబోతున్న సినిమాలు.. ఆ ఒక్కటి డోంట్ మిస్…

Illu Illalu Pillalu Today Episode: ధీరజ్, ప్రేమ గొడవ.. సాగర్, నర్మద సరసాలు.. శ్రీవల్లికి టెన్షన్..

Big Stories

×