E-Paper
Advertisement

Brahmamudi Serial Today Episode May 1st ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఇందును రేఖకు అప్పగించిన రాజు  

Brahmamudi Serial Today Episode May 1st ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఇందును రేఖకు అప్పగించిన రాజు  
Advertisement

Brahmamudi serial today Episode: ఇందు వచ్చి మంచిగా బతకమని రాజుకు చెప్పగానే.. రాజు పేదల బతుకుల్లో ఉండే కష్టాలను చెప్తాడు. డబ్బు ఉంటేనే ఏదైనా సాధ్యం అంటూ ఎమోషనల్ అవుతూ చెప్తుంటాడు. నీకంటే లెక్క లేనంత డబ్బు ఉంది కాబట్టి నీకు దాని విలువ తెలియకపోవచ్చు. కానీ మాకు రేపటి నుంచి పెట్రోల్ రేటు రూపాయి పెరుగుతుందంటే ఈరోజే క్యూలో నిలబడి పెట్రల్‌ కొనే బతుకులు మావి.. అంటూ చెప్పి వెళ్లిపోతాడు రాజు. దీంతో ఇందు మాత్రం వీడు మంచోడే కానీ కాస్త డబ్బు పిచ్చి ఎక్కువగా ఉంది అంతే అనుకుంటుంది.

ఐశ్వర్యకు రాకేష్‌ ఫోన్‌ చేస్తాడు. ఐశ్వర్య భయంగా వీడేంటి ఇప్పుడు ఫోన్‌ చేస్తున్నాడు.. అనుకుంటూ లిఫ్ట్‌ చేస్తుంది. దీంతో రాకేష్‌ ఏంటి ఫోన్‌ లేటుగా లిఫ్ట్ చేస్తున్నావు.. ఎత్తాలా వద్దా అనుకుంటూ ఎత్తావా..? అంటాడు. అదేం లేదు ఫోన్‌ చూసుకోలేదు అని చెప్పగానే.. నా డబ్బు సంగతి కూడా మర్చిపోయాయా.. అంటూ రాకేష్‌ అడిగితే ఏం లేదు.. నాకు కొన్ని డబ్బులు వచ్చేది ఉంది. అవి రాగానే ఇస్తాను.. అని చెప్పగానే.. రాకేష్‌ ఇప్పటికి ఇలా చాలాసార్లు చెప్పావు..ఇక నేను నిన్ను నమ్మను.. నేరుగా వచ్చి మీ ఆంటీనే అడుగుతాను అంటూ కాల్ కట్‌ చేస్తాడు. దీంతో ఐశ్వర్య రేఖ ఆంటీ కోటి రూపాయల పని ఏం చేసిందో కనుక్కోవాలి అనుకుంటూ కిందకు వెళ్లి.. రేఖను ఆంటీ ఏం ఆలోచిస్తున్నారు అంటూ అడగ్గానే.. భ్రమరాంబ వెటకారంగా మాట్లాడుతుంది. దీంతో ఐశ్వర్య కోపంగా పిన్ని మీరు కాస్త సైలెంట్‌గా ఉంటావా..? నేను ఆంటీతో మాట్లాడాలి. ఆంటీ ఇందును కిడ్నాప్‌ చేసి చాలా రోజులు అయింది కదా..? వాళ్లు అడిగిన కోటి రూపాయలు రెడీ అయ్యాయా..? అని అడగ్గానే..

Advertisement

రేఖ లేదు ఐశ్వర్య చాలా కష్ట మీద సర్దితే ఒక ఇరవై లక్షలు రెడీ అయ్యాయి… ఇక అంతకు మించి డబ్బులు వస్తాయని నాకు నమ్మకం లేదు. ఎవ్వరినీ అడిగినా డబ్బులు ఇవ్వడం లేదు.. అని చెప్పగానే.. ఐశ్వర్య అలా అయితే ఎలా ఆంటీ అంటుంది. అది నాకు అర్థం కావడం లేదు ఆ కిడ్నాపరేమో రేపటి వరకు టైం ఇచ్చాడు. ఆ తర్వాత ఇందును కనిపించకుండా చేస్తామని బెదిరిస్తున్నారు అని చెప్తుండగానే.. ఐశ్వర్య అయితే ఒక పని చేయండి ఆంటీ ఆ ఇరవై లక్షలు ఇస్తామని కన్వీన్స్‌ చేయండి అంటూ మనసులో ఆ ఇరవై లక్షలన్నా చేతిలో పడితే ఆ రాకేష్‌ గాడి పీడ విరగడి అవుతుంది అనుకుంటుంది. రేఖ మాత్రం నీకేమన్నా పిచ్చిగా ఉందా..? లాస్ట్‌ టైం యాభై లక్షలు ఇస్తామన్నా వాళ్లు ఒప్పుకోలేదు.. ఇప్పుడు ఇరవై లక్షలు ఇస్తామంటే ఒప్పుకుంటారా..? అనగానే.. ఐశ్వర్య ఏమో ఎవరికి తెలుసు.. డబ్బు అవసరం ఎవరికి ఎలా ఉంటుందో మనకు తెలియదు కదా..? ఒకసారి అడిగి చూడండి అని ఐశ్వర్య చెప్పగానే.. భ్రమరాంబ నువ్వేంటి అంతా తెలిసిదానిలా మాట్లాడుతున్నావు అనగానే.. ఐశ్వర్య షాక్‌ అవుతుంది.

ముందు నువ్వు ఆపుతావా పిన్ని ఆంటీ మీరు ఒకసారి ట్రై చేయండి.. ఇప్పుడు ఇరవై లక్షలు ఇస్తామని చెప్పండి.. ఇందు ఇంటికి వచ్చాక మిగతా డబ్బు ఇస్తామని చెప్పండి అనగానే.. భ్రమరాంబ కూడా అవును రేఖ ఆలోచిస్తే ఇదే మంచిదని అనిపిస్తుంది. ఒకసారి ఫోన్‌ చేయ్‌ అనగానే.. రేఖ ఫోన్‌ చేయగానే.. రాజు కోపంగా ఏంటి లేటు నీ ఫోన్‌ కోసమే వెయిట్‌ చేస్తున్నాను.. డబ్బులు రెడీ అయ్యాయా..?అంటూ అడగ్గానే.. రేఖ ఇరవై లక్షలు మాత్రమే రెడీ అయ్యాయి అంటూ చెప్పగానే.. రాజు కోపంగా తిట్టి ఫోన్‌ కట్‌ చేస్తాడు. రేఖ కోపంగా అందరినీ తిడుతుంది. ఐశ్వర్య పైకి వెళ్లి రాజుకు ఫోన్‌ చేసి ఇప్పుడున్న పరిస్థితుల్లో మా ఆంటీ దగ్గర రూపాయి కూడా లేదు. ఇంకా ఆలస్యం చేస్తే ఈ డబ్బులు కూడా దొరకవు అని చెప్తుంది. మా ఆంటీకి ఫోన్‌ చేసి ఇరవై లక్షలు ఇవ్వమని అడుగు అని చెప్పగానే.. సరేలే అంటూ రాజు రేఖకు కాల్ చేస్తాడు. నాకు ఇరవై లక్షలు ఓకే రేపు మీరు డబ్బుతో ఎక్కడికి రావాలి ఎలా రావాలి అనేది నేను మెసేజ్‌ చేస్తాను అంటూ కాల్‌ కట్‌ చేస్తాడు. లక్కీకి విషయం చెప్తాడు. తర్వాత డబ్బు ఎలా తీసుకునేది ఇందును ఎలా అప్పగించాలి అనే ప్లాన్‌ చెప్తాడు.

Advertisement

మరుసటి రోజు ఇందును తీసుకుని గుడికి వెళ్తారు లక్కీ, రాజు. అక్కడే ఇందును అప్పగించాలని చూస్తారు. డబ్బులు తీసుకుని రేఖ, భూషణ్‌ వస్తుంటారు. కోటి రూపాయలు ఇవ్వలేదని వాళ్లు మనల్ని మోసం చేయరు కదా అంటూ భూషణ్‌ అనుమానం వ్యక్తం చేస్తే.. అలా చేస్తే వాళ్లకు మనమేంటో చూపించాలి అంటుంది రేఖ. ఇటువైపు కూడా లక్కీ అదే అనుమానిస్తాడు. డబ్బులు ఇవ్వకుండా మనల్ని మోసం చేయాలని చూస్తే అని అడగ్గానే.. వాళ్లకు మనమేంటో చూపిస్తాము కదా నువ్వు ముసుగు వేసుకుని వెళ్లు అంటూ చెప్తాడు. గుడిలో దేవుడికి ప్రదక్షిణ చేస్తున్న ఇందు దేవుడి ముందు నిలబడి నా సమస్యలకు నాకు ఒక పరిష్కారం చూపించు అంటూ మెక్కి పక్కకి తిరిగి చూడగానే.. రేఖ ఎదురుగా ఉంటుంది. రేఖను చూసిన ఇందు షాక్‌ అవుతుంది. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

చీరకట్టులో శివజ్యోతి..ఆ భారీ హారం చూస్తే మతిపోవాల్సిందే!

ఈశ్వర్ సాయి కేసులో కొత్త ప్రశ్న.. ‘పెళ్లైనోడిని ఎలా నమ్మావ్ మాధురి?’

స్టార్ హీరోల సినిమాల కంటే సీరియల్స్‌కే ఎక్కువ క్రేజ్.. అసలు సీక్రెట్ ఏంటి?

పిచ్చి కుక్కల్లా మొరగండి… ట్రోలర్స్ కు కౌంటర్ ఇచ్చిన శిరీష!

నాని ఫోక్ సాంగ్ తో అదరగొట్టేసిన శ్రీముఖి.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode September 2nd  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: పార్థును చంపేందుకు రెడీగా ఉన్న రౌడీలు

Godavari Janu : హాట్ లుక్ లో రెచ్చగొడుతున్న నిత్య.. కుర్రాళ్ళు తట్టుకోలేరమ్మ..!

Gundeninda GudiGantalu Today episode: బాలుకు షాకిచ్చిన నీలకంఠం.. కన్నీళ్లు పెట్టుకున్న మౌనిక.. పాపం బాలు..

Big Stories

Advertisement
×