E-Paper
Advertisement

ప్రతి ఒక్కరికీ గుర్తుండిపోయే యాక్షన్ సినిమాలు… ఇవి ఓటీటీలో కూడా తోపే

ప్రతి ఒక్కరికీ గుర్తుండిపోయే యాక్షన్ సినిమాలు… ఇవి ఓటీటీలో కూడా తోపే
Advertisement

Action Movies on OTT : ఓటీటీలో యాక్షన్ సినిమాలు బోలెడు ఉన్నాయి. కానీ కొన్ని సినిమాలు ఎవర్ గ్రీన్ గా నిలిచిపోతాయి. సీటు అంచున కూర్చోబెట్టే ఒళ్లు గగుర్పొడిచే విన్యాసాలతో ప్రేక్షకుడికి సరికొత్త అనుభూతిని ఇస్తాయి. అలాంటి సినిమాలపై ఓ లుక్ వేద్దాం పదండి. వీకెండ్‌లో అదిరిపోయే యాక్షన్ ఎంటర్టైన్మెంట్ కోసం చూస్తున్నట్లయితే, ఓటీటీలో అందుబాటులో ఉన్న ఈ ఐదు సినిమాలు మస్ట్ వాచ్ లిస్ట్‌లో ఉండాల్సిందే.

1. మ్యాడ్ మ్యాక్స్: ఫ్యూరీ రోడ్ (Mad Max: Fury Road – 2015)

యాక్షన్ సినిమాల్లో ఇదొక మాస్టర్ పీస్. మాటలు తక్కువ, మంటలు ఎక్కువ అనేలా దర్శకుడు జార్జ్ మిల్లర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఎడారిలో సాగే భారీ వాహనాల ఛేజింగ్ సీన్లు చూస్తుంటే మనమే ఆ ప్రయాణంలో ఉన్నామా అన్నంతగా లీనమైపోతాం. టామ్ హార్డీ, షార్లీజ్ థెరాన్ నటన ఈ సినిమాకు ప్రాణం పోసింది. కేవలం యాక్షన్ మాత్రమే కాదు, సినిమాటోగ్రఫీ, సౌండ్ ఎఫెక్ట్స్ పరంగా ఇది ఒక సంచలనం. వీకెండ్‌లో హై-వోల్టేజ్ యాక్షన్ కావాలంటే దీని తర్వాతే ఏదైనా! prime video, apple tvలలో దీనిని చూడచ్చు.

2. కెప్టెన్ అమెరికా: సివిల్ వార్ (Captain America: Civil War – 2016)

Advertisement

మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ (MCU) లో ఈ సినిమా ఒక చెప్పుకోదగిందే. ఇద్దరు సూపర్ హీరోలు (ఐరన్ మ్యాన్ vs కెప్టెన్ అమెరికా) తమ సిద్ధాంతాల కోసం తలపడటం ఇందులో హైలైట్. విమానాశ్రయం వద్ద సూపర్ హీరోల మధ్య జరిగే భారీ ఫైట్ సీక్వెన్స్ సినీ చరిత్రలోనే అత్యుత్తమ యాక్షన్ సీన్లలో ఒకటిగా చెప్పుకోవచ్చు. jio hotstarలో ఇది అందుబాటులో ఉంది.

3. లోగాన్ (Logan – 2017)

మిగతా సూపర్ హీరో సినిమాలతో పోలిస్తే ‘లోగాన్’ చాలా భిన్నంగా ఉంటుంది. వోల్వరైన్ పాత్రకు హ్యూ జాక్మన్ ప్రాణం పోశారు. ఇది కేవలం యాక్షన్ సినిమా మాత్రమే కాదు, ఒక తండ్రికి, కూతురికి మధ్య ఉండే బంధాన్ని ఎంతో ఎమోషనల్ గా చూపిస్తుంది. సినిమా ముగిసేసరికి కళ్ళలో నీళ్లు తిరగడం ఖాయం. లోగాన్ పోరాట పటిమ, ఆ రక్తం చిందించే యాక్షన్ సీన్లు చాలా పవర్‌ఫుల్‌గా ఉంటాయి. దీనిని jio hotstarలో చూడచ్చు.

4. మిషన్ ఇంపాజిబుల్ – ఫాల్ అవుట్ (Mission: Impossible – Fallout – 2018)

Advertisement

50 ఏళ్లు దాటిన టామ్ క్రూజ్ చేసే స్టంట్స్ చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. ఈ సినిమాలో హెలికాప్టర్ ఛేజింగ్ సీన్, స్కై డైవింగ్ సీక్వెన్స్ చూస్తున్నప్పుడు మనకు ఊపిరి ఆగిపోయినంత పని అవుతుంది. సిజిఐ వాడకుండా సాధ్యమైనంత వరకు రియలిస్టిక్ గా తీసిన యాక్షన్ సీన్లు ఈ సినిమాను ఒక లెవల్‌లో నిలబెట్టాయి. స్పై యాక్షన్ సినిమాల్లో ఇది ఒక తోపు సినిమా ఇది. నెట్ ఫ్లిక్స్, ప్రైమ్ వీడియోలో ఇది ఉంది.

5. అవెంజర్స్: ఎండ్‌గేమ్ (Avengers: Endgame – 2019)

పదేళ్ల నిరీక్షణకు దక్కిన ప్రతిఫలం ఈ సినిమా. ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసిన ఈ చిత్రం యాక్షన్ ప్రియులకు ఒక పండగ. క్లైమాక్స్‌లో థానోస్ సైన్యానికి, అవెంజర్స్ బృందానికి మధ్య జరిగే ఆ మహా యుద్ధం వర్ణనాతీతం. “అవెంజర్స్ అసెంబుల్” అన్న ఒక్క డైలాగ్ థియేటర్లలో ఏ స్థాయిలో ప్రకంపనలు సృష్టించిందో అందరికీ తెలిసిందే. ప్రతి యాక్షన్ ప్రేమికుడు తన జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిన సినిమా ఇది. జియో హాట్ స్టార్ లో ఇది అందుబాటులో ఉంది. ఈ ఐదు సినిమాలు కేవలం యాక్షన్ మాత్రమే కాదు, అద్భుతమైన మేకింగ్, బలమైన కథాంశంతో సాగుతాయి. ఇక మీ వీకెండ్‌ను పక్కాగా ప్లాన్ చేసుకోండి.

Read Also : హారర్ చిత్రాల చరిత్రను మార్చిన ఒక ప్లాస్టిక్ బొమ్మ… భయం పుట్టిస్తున్న ప్రాంఛైజీ

Related News

This week OTT Releases : ఈ వారం ఓటీటీ లవర్స్ కు పండగే.. ఏకంగా 18 సినిమాలు స్ట్రీమింగ్..!

Weekend OTT Movies: వీకెండ్ సినిమాల సందడి.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..

రెండు రోజుల్లో నలుగురి మర్డర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

చెరువులో బాలుడి శవం… దేవుడికి ఆచారాల పేరుతో గుండె జారిపోయే పనులు

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్

Big Stories

Advertisement
×