E-Paper
Advertisement

Brahmamudi Serial Today May 27th: ‘బ్రహ్మముడి’ సీరియల్:  చార్లెస్‌ ఎస్కేప్‌ – గదిలోంచి అప్పు జంప్‌ – ధాన్యలక్ష్మీ ఫైర్‌

Brahmamudi Serial Today May 27th: ‘బ్రహ్మముడి’ సీరియల్:  చార్లెస్‌ ఎస్కేప్‌ – గదిలోంచి అప్పు జంప్‌ – ధాన్యలక్ష్మీ ఫైర్‌
Advertisement

Brahmamudi serial today Episode:  అప్పు కోపంగా కళ్యాణ్‌ దగ్గరకు వెళ్లి ఈ ఫస్ట్ నైట్‌ ప్లాన్‌ నీదే కదూ అంటూ నిలదీస్తుంది. దీంతో లేదని మనం రాత్రి మాట్లాడుకోవడం మా అమ్మ విందేమో అంటాడు. అయితే నాకు మాత్రం కదరదు నేను చార్లెస్ అనే దొంగను పట్టుకున్నాను. వాడు ఇప్పటికే 49 సార్లు తప్పించుకున్నాడు. మళ్లీ ఇప్పడు తప్పించుకుంటే.. మా డిపార్ట్‌మెంట్‌ పరువు పోతుంది. అందుకే మా సీఐ గారు నాకు గట్టిగా చెప్పారు. ఈసారి వాడు తప్పించుకుంటే నన్ను సస్పెండ్‌ చేస్తా అన్నారు అని చెప్తుంది.

అలాగా అయితే మీ సీఐ గారికి ఫ్యామిలీ ప్రాబ్లమ్‌ అని చెబితే అంటాడు కళ్యాణ్‌. నేను ఇవాళ రాత్రికి స్టేషన్‌లోనే ఉంటానని చెప్పగానే ఆయన ఫ్యామిలీతో  తిరుపతి వెళ్లిపోయారు.. అందుకే నేను తప్పకుండా స్టేషన్‌కు వెళ్లాలి. నువ్వే ఎలాగైనా ఆంటీని ఒప్పించి.. ఫస్ట్‌నైట్‌ను పోస్ట్ ఫోన్‌ చేయించాలి అని చెప్తుంది. ఇంతలో ధాన్యలక్ష్మీ వచ్చి అది మాత్రం జరగదు. నీకు ఇందాకే చెప్పాను. ఈరోజు నేను పెట్టిన ముహూర్తానికే మీకు మొదటి రాత్రి జరగాల్సిందే.. అని చెప్తుంది. దీంతో అప్పు అది కాదు అత్తయ్యా.. అంటూ ఏదో చెప్పబోతుంటే.. ఇంకా నాకేం చెప్పకు నేను వీడిలాగా చవటను కాదు అంటుంది. దీంతో ఇద్దరిని తిట్టి గదుల్లోకి పంపిస్తుంది.

Advertisement

కావ్య కిచెన్‌లో ఉండగా రాజ్‌ గట్టిగా కళావతి గారు అంటూ అరుస్తూ.. వెళ్తాడు. దీంతో కావ్య ఎందుకండి అలా అరుస్తున్నారు నేనేదో కోర్టులో ముద్దాయిని అయినట్టు అలా పిలుస్తారేంటి..? అంటుంది. దీంతో రాజ్‌ నిజంగా మీరు పెద్ద దొంగ అండి.. అవును మరి అవతల మీ చెల్లెలు పోలీస్‌ స్టేషన్‌ కు వెళ్లకుండా స్వప్న గదిలో కూర్చుంది. ఇవతల మా తమ్ముడు ఫస్ట్‌ నైట్‌ ఎప్పుడెప్పుడా అని వాళ్ల నాన్న గదిలో కూర్చున్నారు అని రాజ్‌ చెప్పగానే.. అలా అని మీకు చెప్పారా అని కావ్య అడుగుతుంది. దీంతో రాజ్‌ చెప్పాలా సాటి మగాడిగా నా తమ్ముడి బాధేంటో అర్థం చేసుకోగలను అంటాడు. దీంతో కావ్య అందరి మనసులు బాగీనే అర్తం చేసుకుంటున్నారు ఒక్క నా మనసు తప్పా అని మనసులో అనుకుంటుంది. దీంతో రాజ్ ఏంటి ఏమ్మన్నారు అని అడుగుతాడు. ఏం లేదు.

వచ్చిన పనేంటో చెప్పండి అంటుంది. అంటే ఇందాక అందరి ముందు వాళ్ల శోభనం గదిని అందంగా అలంకరిస్తామని చెప్పాము కదా.. అందుకే మీరు ఇంకా ఇలా ఉంటే ఎలా అంటాడు. పంతులు గారు చెప్పింది రాత్రి పదకొండు గంటలకు దానికి ఇంకా చాలా టైం ఉంది అని చెప్తుంది కావ్య. దీంతో రాజ్‌ అసలే మన దగ్గర టైం లేదు మీరు వంట తర్వాతచేసుకోవచ్చు రండి అంటూ కావ్య చేయి పట్టుకుని లాక్కెళ్లతాడు రాజ్‌. కావ్య తదేకంగా రాజ్‌ను చూస్తూ వెనకాలే వెళ్తుంది. కావ్యను తీసుకెళ్లి లిస్టు రాయమని రాజ్‌ చెప్తుంటే.. కావ్య ఆశ్చర్యపోతుంది. ఇవన్నీ ఎందుకు అని అడుగుతుంది. నేను రాయను అంటుంది. ఇంతలో అపర్ణ, ఇంద్రాదేవి వస్తారు.  అబ్బబ్బా ఏమైంది ఎందుకు అలా గొడవ పడుతున్నారు అని ఇంద్రాదేవి అడుగుతుంది.

Advertisement

నాన్నమ్మ చూడు నాకో డౌటు.. ఇవాళ మన ఇంట్లో జరుగుతున్నది దుగ్గిరాల ఇంటి వారసుడి శోభనమేనా అంటాడు రాజ్‌. నీకా డౌటు ఎందుకు వచ్చింది అని ఇంద్రాదేవి అడగ్గానే.. మీ మనవరాలి మాటలు వింటుంటే ఆ అనుమానమే వస్తుంది అంటాడు రాజ్‌. దీంతో అపర్ణ.. అసలు ఏమైంది ఇప్పుడు అని అడుగుతుంది. దీంతో రాజ్‌ అరె గుప్పెడు స్వీట్లు, కాసిని పళ్లు తెమ్మంటే గొడవ చేస్తుంది అంటూ రాజ్‌ చెప్పగానే.. కావ్య ఏంటి నేను గొడవ చేస్తున్నానా… మీరు చెప్పిన లిస్టు ఏంటో వాళ్లకు చెప్పండి అంటుంది. ఏముంది వంద కిలోల మల్లెపూలు, వంద కేజీల రోజా పూల ఐదు కేజీల లడ్డు, ఐదు కేజీల జాంగ్రీ అంటూ రాజ్‌ చెప్పబోతుంటే ఇంద్రాదేవి చాలు చాలు ఇక నువ్వు ఏమేం చెప్తున్నావో మాకు అర్థం అయింది. ఒసేయ్‌ వాడు ఏం చెప్పాడో అవన్నీ తీసుకురా.? అని అపర్ణ చెప్తుంది. సరేనని కావ్య వెళ్లిపోతుంది.

స్టేషన్‌లో పోలీసులకు చార్లెస్‌ మనిషి టీ తీసుకొచ్చి ఇస్తాడు. ఆ టీ తాగిన పోలీసులు మత్తుగా నిద్రలోకి జారుకుంటారు. మరోవైపు స్వప్న రూంలో అప్పును రెడీ చేస్తుంది. అప్పు నగలు వేసుకోవడానికి ఇష్టం లేదని చెప్తుంది. ఇంతలో రాహుల్ వస్తాడు. అలా అంటావేంట అప్పు నీకోసం కష్టపడి బ్యాంకులో పెట్టిన నగలన్నీ తీసుకొచ్చాం. నువ్వు వేసుకుంటేనే కదా మా స్వప్న కూడా హ్యాపీ అంటాడు. అవును అవును సడెన్‌గా రాహుల్‌లో అంత మంచి బుద్ది ఎందుకు వచ్చిందో నాకు అర్థం కావడం లేదు. ఇప్పటికీ నాకు అనుమానంగానే ఉంది అంటుంది స్వప్న.

దీంతో రాహుల్‌.. మంచి చెప్పినా చెడును చూసే ప్రపంచంలో బతుకుతున్నాం ఏం చేయమంటావు.. అయినా అప్పును చూడు ఆ నగల్లో ఎంత అందంగా కనిపిస్తుందో అంటాడు. దీంతో అప్పు.. అంటే నగల వల్లే నాకు అందం వచ్చిందా..? అంటుంది. నా ఉద్దేశం అది కాదు అప్పు.. లైఫ్‌ లో  ఇలాంటి అకేషన్స్‌ ఒక్కసారే జరగుతాయి.  వాటిని ఇలా అందంగా మార్చుకోవాలనేదే నా ఉద్దేశం అంటాడు రాహుల్‌. దీంతో స్వప్న తమ పెళ్లి జరిగిన నాటి రోజులు గుర్తు చేస్తుంది. ఇప్పుడు అవన్నీ ఎందుకు కానీ కావ్య స్వీట్లు తీసుకురమ్మంది వెళ్దాం పద అంటాడు స్వప్న సరేనని వెళ్తుంది.

ఇంతలో అప్పుకు స్టేషన్‌ నుంచి కానిస్టేబుల్‌ ఫోన్‌ చేసి సెల్ లోంచి ఆ చార్లెస్‌ గాడు తప్పించుకున్నాడు మీరు వెంటనే రండి మేడం అని చెప్తాడు. ఎలా తప్పించుకున్నాడు అని అడుగుతుంది అప్పు. దీంతో స్టేషన్‌ లో జరిగింది చెప్తాడు కానిస్టేబుల్‌. వెంటనే అప్పు కళ్యాణ్‌ దగ్గరకు వెళ్లి స్టేషన్‌లో చార్లెస్‌ గాడు తప్పించుకున్నాడు. ఇప్పుడు నేను వాడిని పట్టుకోకపోతే నా జాబ్‌ పోతుంది అని చెప్తుంది. ఇప్పుడు ఈ శోభనం ఆగిపోతే మా అమ్మ మన ప్రాణాలు తీసేస్తుంది అని కళ్యాణ్‌ చెప్తాడు.  ఇద్దరూ కలిసి రాజ్‌ హెల్ప్‌ తీసుకోవాలని డిసైడ్‌ అవుతారు. మరోవైపు కావ్య, రాజ్‌ బెడ్‌ రూం డెకరేట్‌ చేస్తుంటారు. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: సకల బాధలను దూరం చేసే షణ్ముఖి రుద్రాక్ష ధారణ ఎవరు చేయాలి..?

 

Tags

Related News

అవినాష్, అరియానా మధ్య గొడవలు నిజమేనా? బయటపెట్టిన శ్రీముఖి!

Nindu Noorella Saavasam Serial Today Episode September 4th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆత్మ కోసం ప్రచండ ప్రత్యేక పూజ  

Gundeninda GudiGantalu Today episode: మీనాను దెబ్బ అదుర్స్.. సంజుకు దిమ్మతిరిగే షాక్.. బాలుకు రాఖీ కట్టిన మౌనిక..

Ninnu kori Serial Today Episode September 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: చంద్రకు నిజం తెలిసిందన్న మందర – షాక్‌ అయిన మాయ      

Podarillu Today Episode : చక్రితో అంట్లు కడిగించిన మహా.. నారాయణ హర్ట్.. జయంతి మాటతో షాక్..

Karthika Deepam 2 Serial Today Episode September 4th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలిని ఇంట్లో పని మనుషుల్లాగా ఉంటామన్న దీప, కార్తీక్         

Illu Illalu Pillalu Today Episodes: శ్రీవల్లి మాటతో నర్మద షాక్.. విశ్వంకు భద్ర వార్నింగ్.. కన్నీళ్లు పెట్టుకున్న వేదవతి..

Intinti Ramayanam Today Episode: పల్లవికి టెన్షన్.. ప్రణతి ఎంట్రీతో ఆల్ హ్యాపీ.. ఫైనల్ ట్విస్ట్ అదిరింది..

Big Stories

Advertisement
×