Kannappa : మంచు విష్ణు (Manchu Vishnu) అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం కన్నప్ప (Kannappa). అక్షయ్ కుమార్ (Akshay Kumar), మోహన్ లాల్(Mohan Lal), ప్రభాస్ (Prabhas), కాజల్ అగర్వాల్(Kajal Agarwal) , మోహన్ బాబు (మోహన్ babu) వంటి భారీ తారాగణంతో తెరకెక్కుతున్న ఈ సినిమా జూన్ 27వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో అటు మంచు విష్ణు ప్రమోషన్స్ జోరు పెంచారు. అందులో భాగంగానే వరుస యూట్యూబ్ ఛానల్స్ కు ఇంటర్వ్యూలు ఇస్తూ పలు విషయాలు పంచుకుంటున్న విషయం తెలిసిందే. ఇలాంటి సమయంలో మంచు విష్ణుకి అతిపెద్ద షాక్ తగిలింది అని చెప్పవచ్చు. కన్నప్ప సినిమా ఉన్న హార్డ్ డ్రైవ్ ని కొట్టేశారు. ఇక ఈ విషయం తెలిసి అటు మంచి విష్ణు నే కాదు ఇటు ఇండస్ట్రీ కూడా ఉలిక్కిపడింది. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. విడుదల దగ్గర పడుతున్న నేపథ్యంలో ఇలాంటి పరిస్థితులు ఎవరికీ రాకూడదు అంటూ నెటిజన్స్ కూడా కామెంట్లు చేస్తున్నారు
కన్నప్ప హర్డ్ డ్రైవ్ కొట్టేసిన ఆఫీస్ బాయ్.. ఆ ఇద్దరిపై కేస్ ఫైల్..
అసలు విషయంలోకి వెళ్తే.. త్వరలోనే విడుదల కానున్న కన్నప్ప చిత్రానికి సంబంధించిన హార్డ్ డ్రైవ్ ను తమ అనుమతి లేకుండా తీసుకెళ్లారని, ఆ చిత్ర ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిలింనగర్ పోలీసుల కథనం మేరకు.. కోకాపేటకు చెందిన రెడ్డి విజయ్ కుమార్ 24 ప్రేమ్స్ ఫ్యాక్టరీ ప్రైవేట్ లిమిటెడ్ కి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా పనిచేస్తున్నారు. కన్నప్ప చిత్రానికి కీలకమైన.. కన్నప్ప సినిమా స్టోరీ ఉన్న హార్డ్ డ్రైవ్ ను ముంబైలోని హెచ్ఐవీఈ స్టూడియోస్ వారు డీటీడీసీ కొరియర్ ద్వారా ఫిలింనగర్ లోని రెడ్డి విజయ్ కుమార్ కార్యాలయానికి పంపించారు. అయితే ఆ పార్సిల్ ను ఈనెల 25న ఆఫీస్ బాయ్ రఘు తీసుకున్నారు. అతను ఈ విషయం ఎవరికీ చెప్పకుండా ఆ హార్డ్ డ్రైవ్ ను చరిత అనే మహిళకి అప్పగించారట. అప్పటినుంచి వారిద్దరూ తప్పించుకుని తిరుగుతున్నారని సమాచారం. ఇక ఎవరి మార్గదర్శకత్వంలోనో తమ ప్రాజెక్టుకు నష్టం కలిగించేలా.. దురుద్దేశంతోనే రఘు, చరితలు కలిసి ఇలా కన్నప్ప సినిమా కథ ఉన్న హార్డ్ డ్రైవ్ ను దొంగతనం చేశారు అంటూ విజయకుమార్ ఫిలింనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆ ఇద్దరిపై కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం ఈ విషయం సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.
కన్నప్ప మూవీ విశేషాలు..
టెలివిజన్ షో ‘మహాభారతం’ కి దర్శకత్వం వహించిన ముఖేష్ కుమార్ సింగ్ (Mukhesh kumar singh)ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. పరుచూరి గోపాలకృష్ణ, తోట ప్రసాద్, ఈశ్వర్ రెడ్డి, జి నాగేశ్వరరెడ్డి ఈ సినిమాకు కథ అందించగా మోహన్ బాబు 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్, ఏవిఏ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై నిర్మిస్తున్నారు. మంచు విష్ణు, మోహన్ లాల్ , అక్షయ్ కుమార్, ప్రభాస్ , కాజల్ అగర్వాల్ వంటి భారీ తారాగణం నటిస్తున్న ఈ చిత్రానికి స్టీఫెన్ దేవస్సీ, మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నారు. భారీ అంచనాల మధ్య జూన్ 27న విడుదల కాబోతున్న ఈ సినిమా మంచు విష్ణుతో పాటు మిగతా వారికి ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.
ALSO READ:Sandeep Reddy Vanga: దీపికా పదుకొణెకు డైరెక్టర్ స్ట్రాంగ్ కౌంటర్.. వ్యక్తిత్వం లేని మనుషులంటూ..!