Gundeninda GudiGantalu Today episode May 27th: నిన్నటి ఎపిసోడ్ లో.. మనోజ్ జాబ్ వచ్చింది అని చెప్పగానే ప్రభావతి గాల్లో లేసి ఎగిరినట్లు ఫీల్ అయిపోయి ఓవరాక్షన్ చేస్తుంది.. అది చూసిన ఇంట్లోని వాళ్ళందరూ ఏమైంది ఏంటి మీ ఓవరాక్షన్ ఏంటి తట్టుకోలేకపోతున్నామని అంటారు. మనోజ్ అప్పుడే కెనడాకు వెళ్లిపోయినట్లు, ఎలా ఉండాలో అని ఇప్పటినుంచి అని చెప్తూ ఉంటుంది. నాన్న ఈ ఓవరాక్షన్ తట్టుకోలేకపోతున్నాను. అసలేం జరిగిందో చెప్పమని బాలు అంటాడు. మనోజ్ కి జాబ్ వచ్చేసింది అని చెప్తుంది. ఎప్పుడు జాయినింగ్ ఎక్కడ జాయినింగ్ అని సత్యం అడుగుతాడు. కెనడాలో జాబ్ వచ్చింది నాన్న అని మనోజ్ అంటాడు. అయితే ముందుగా 14 లక్షలు సెక్యూరిటీ డిపాజిట్ చేస్తే కెనడాకు పంపిస్తారు అంట. ముందు ఆ డబ్బులు కట్టాలి నాన్న అని అనగానే అందరూ షాక్ అవుతారు.. ప్రభావతి మనోజ్ కి ఎలాగైనా డబ్బులు అరేంజ్ చేయాలని రోహిణి అని అడుగుతుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. ఉదయం రోహిణి పార్లర్ కి వెళ్ళాలని ఆటోని పిలుస్తుంది. ఆటో డ్రైవర్ గా బాలు ఉండడం చూసి షాక్ అవుతుంది. ఇదేంటి కారు నుంచి ఆటో కొచ్చాడే ఏం జరిగింది కార్ ఏం చేసాడో అని ఆలోచిస్తూ బాలుని ఇండైరెక్టుగా ఆటో ఏంటి అని అడుగుతుంది.. అయితే బాలు కూడా రోహిణికి అదే విధంగా సమాధానం చెప్తాడు. ఇక రోహిణికి అసలు విషయం తెలిస్తే ఇంట్లో చెప్పేస్తుందని భయపడి రాజేష్ కి ఫోన్ మాట్లాడుతూ కారు అద్దెకిచ్చిన విషయాన్ని చెప్తాడు.. రోహిణి కూడా అదే నిజమని నమ్ముతుంది. రోహిణి పార్లర్ దగ్గర డ్రాప్ చేసి వెళ్తున్న టైంలో ఒక వ్యక్తి వచ్చి బాలు కారు అమ్మేశావట ఏమైంది అని అడుగుతాడు. బాలు మాత్రం చిన్న పని ఉండి అమ్మేశానన్న అని చెప్పేసి వెళ్ళిపోతాడు పక్కనే ఉండి విన్న రోహిణి ఈ విషయం ఎలాగైనా ఇంట్లో చెప్పాలని వెళ్తుంది..
ముందుగా మనోజ్ కి ఈ విషయాన్ని చెప్తే మనోజ్ లైట్ తీసుకుంటాడు. ఎప్పుడూ డబ్బులు తీసుకెళ్తే ఇప్పటికీ నేను సాధిస్తున్నారు కదా ఇప్పుడు ఈ విషయం చెప్తే అందరూ నిన్ను గ్రేట్ అనుకుంటారు అనేసి అంటే.. మనోజ్ మాత్రం నాకు అవసరం లేదు కచ్చితంగా వాడు ఏదో ఒకటి మెలిక చేసి మనల్ని మళ్ళీ తిట్టేస్తాడు అని అంటాడు. ఊరుకున్న నేను ఊరుకోను కదా ఎవరికి చెప్పాలి వాళ్ళకి చెప్తాను అనేసి ప్రభావతి దగ్గరికి రోహిణి వెళ్తుంది. అయితే రోహిణి రావడం చూసి ఏమ్మా నిప్పు పెట్టడానికి వచ్చావు అని ప్రభావతి అంటుంది. ఏంటి ఆంటీ అలా అన్నారు అంటే మా సైడు నిప్పు పెట్టడం అని అంటారు అని అనగానే అవును ఆంటీ నేనే ఆ దీపం వెలిగిస్తాను అని అంటుంది.
ఆ తర్వాత బాలు కారు అమ్మేసిన విషయాన్ని ప్రభావతికి పూసగొచ్చినట్టు చెప్పేస్తుంది. ప్రభావతి మీనా కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. మార్కెట్ కి వెళ్ళిన మీ నాకు బాలు ఆటో తోలుతూ కనిపిస్తాడు. ఇదేమైంది కారు అమ్మేసాడా లేకపోతే ఎవరికైనా ఇచ్చాడా అని ఆలోచిస్తూ ఇంటికి వెళుతుంది. ఇంట్లో ప్రభావతి అప్పటికే పెద్ద రచ్చ చేస్తూ ఉంటుంది. అయినా రాగానే ఇంకాస్త ఎక్కువగా చిందులు తొక్కుతుంది. ఈ మహారాణి అడుగుపెట్టిన తర్వాత ఓడలు బండ్లు అవుతున్నాయి కదా అందుకే కారు కాస్త ఆటో అయిందేమో అంటుంది.
అప్పుడే ఇంట్లోకి వచ్చిన సత్యం ఏమైంది ప్రభావతి ఎందుకలా అరుస్తున్నావంటే నీ ముద్దుల కొడుకు కారు నమ్మేసాడండి.. ఈ విషయం మీకు తెలుసా అని అడుగుతుంది. అదేంటి కార్ అమ్మేసాడా అయినా మీ నాన్న అడిగితే ఆ విషయం గురించి మీ నాకు ఎలా తెలుసు అని అంటాడు. నీకు తెలియకుండా ఏది జరగదు కచ్చితంగా తెలిసే ఉంటుంది మొగుడు పెళ్ళాలు ఇద్దరు కారు అమ్మేసి ఏదో దాస్తున్నారు అని నిందలు వేస్తుంది. అయితే మీనాను సత్యం అడుగుతాడు. ఏంటమ్మా మీనా ఇదంతా నిజమా వాడు కారు నమ్మేసిన విషయం నీకు తెలుసా? అని అడగ్గానే, మీనా నాకు తెలియదు మావయ్య ఇందాక పూల మార్కెట్ కి వెళ్ళినప్పుడు ఆయన ఆటోలో కనిపించడం చూశాను అని అంటుంది…
అప్పుడే బాలు ఇంట్లోకి ఎంట్రీ ఇస్తాడు.. ఇంట్లోకి వచ్చి రాగానే సత్యం ఏంట్రా కారు నమ్మేసావంట అనేసి అడుగుతాడు. అయితే బాలుని చూసిన ప్రభావతి రెచ్చిపోతుంది.. ఇక రోహిణి ఇంటి పత్రాలు తాకట్టు పెట్టి నా చేత పార్లర్ పెట్టించారని ఎంత హంగామా చేశాడు. అదే ఇంటి పత్రాలు తాకట్టు పెట్టి కారు కొంతే అమ్మేసి ఎవరికీ చెప్పకుండా.. ఏదో దాస్తున్నాడు ఆంటీ అని అడుగుతుంది.. ఇదంతా కాదు మనోజ్ బోను తీసుకురా ఆరోజు నన్ను ఎలాగైతే బోన్ లో నిలిచిపెట్టి వాడు లాయర్ లాగా అడిగాడో ఇప్పుడు నేను కూడా వాన్ని లాయర్ లాగే అడగాలి అనేసి ప్రభావతి అంటుంది.
అయితే బోన్లో నిల్చబెట్టిన బాలుని ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తుంది ప్రభావతి. మధ్యలో రోహిణి కలగజేసుకొని కారును ఎందుకమ్మేసావు? అని అడగగానే బాలు.. నాన్న నేను ఇంకా ఆగలేను నాకు తెలిసిన నిజాన్ని బయట పెట్టాలి. ఆ మాట వినగానే రోహిణి టెన్షన్ పడుతుంది. నా గురించి బాలుకి ఏదో నిజం తెలిసిపోయింది అందుకే ఇంతగా నా మీద వాదిస్తున్నాడు అంటూ టెన్షన్ పడుతూ ఉంటుంది.. ఇక బాలు అసలు నిజం చెప్తాడా లేదా అన్నది ప్రశ్నార్ధకంగా మారింది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో.. మీనా రాజేష్ దగ్గరికి వెళ్లి అసలు నిజాన్ని తెలుసుకుంటుంది.. తర్వాత ఏం జరుగుతుందో చూడాలి..