E-Paper
Advertisement

అసలు పవన్ కళ్యాణ్ ఎక్కడైనా కనిపిస్తున్నాడా? ఈసారి వచ్చేది జగనే! – దువ్వాడ మాధురి

అసలు పవన్ కళ్యాణ్ ఎక్కడైనా కనిపిస్తున్నాడా? ఈసారి వచ్చేది జగనే! – దువ్వాడ మాధురి
Advertisement

Duvvada Madhuri: జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Deputy CM Pawan Kalyan) పై, దువ్వాడ మాధురి (Duvvada Madhuri) షాకింగ్ కామెంట్స్ చేశారు. చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) పల్లకి మోయడానికి తప్పితే, అసలు పవన్ కళ్యాణ్ ఎక్కడైనా కనిపిస్తున్నాడా? అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారాన్ని రేపుతున్నాయి. తాజాగా ఆమె బిగ్ టీవీ కిస్సిక్ టాక్స్ పాడ్ క్యాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈసారి కచ్చితంగా ఎన్నికలలో దువ్వాడ శ్రీనివాస్ (Duvvada Srinivas) గెలుస్తారని, అలాగే మేము ఎంతో ఇష్టపడే, ఫాలో అయ్యే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వమే ఈసారి వస్తుందని, ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలింతకీ ఆమె ఏపీ పాలిటిక్స్ గురించి మాట్లాడుతూ.. ఏమన్నారంటే?

Also Read- అభిమానించే వాళ్ళనే చూశా.. అసహ్యించుకునే వాళ్ళని చూడలేదు- దువ్వాడ మాధురి

వ్యతిరేకత స్టార్ట్ అయ్యింది

Advertisement

‘‘పవన్ కళ్యాణ్ ఎక్కడ కనిపిస్తున్నారు చెప్పు అసలు? మేం అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పి, చంద్రబాబు నాయుడు పల్లకి మోస్తున్నారు తప్పితే, అంతకు మించి ఏం చేయట్లేదు కదా! ప్రతి ఒక్క పవన్ కళ్యాణ్ అభిమాని కూడా పవన్ కళ్యాణ్‌ను సీఎంగా చూడాలనుకున్నారు. అది ఎప్పటికీ సాధ్యం కాదు. ఎందుకంటే ఎప్పటికీ పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు పల్లకి మోస్తూనే ఉంటాడు, ఇంకెప్పుడు సీఎం అవుతాడు? మరి పవన్ కళ్యాణ్‌ని నమ్ముకున్న ప్రజలు ఏమవుతారు? దీని కోసమా పవన్ కళ్యాణ్‌ని ప్రజలు ఎన్నుకున్నారు? ఇప్పుడు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గెలిచినా.. వాళ్ళు అనుకున్నది, చెప్పింది చేయలేదనే అంటున్నాను, చేయలేదు కూడా. అందుకే జనాల్లో వ్యతిరేకత స్టార్ట్ అయ్యింది, ఎక్కడికి వెళ్లినా జనాలు అదే చెప్తున్నారు. మేము జనాల్లోకి వెళ్లినప్పుడు జనాలందరూ అదే చెప్తున్నారు! కచ్చితంగా వ్యతిరేకత స్టార్ట్ అయ్యింది.

Also Read- అత్యాశకు పోతున్న ‘పెద్ది’ నిర్మాత.. అసలుకే మోసం వస్తుందేమో!

ఎవరి దమ్ము ఏంటో తెలుస్తుంది

Advertisement

ఇక జనసైనికులకి ఎక్కడా కూడా అసలు వేల్యూ లేదు. వాళ్ళు జెండా మోసే కూలీలుగానే మిగిలిపోయారు తప్పితే, ఎక్కడా కూడా వేల్యూ లేదు. పవన్ కళ్యాణ్‌‌ని సీఎంగా చూడాలనుకున్నారు, అది ఎప్పటికీ సాధ్యం కాదు. ఎందుకంటే ఎప్పటికీ పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు పల్లకి మోస్తూనే ఉంటాడు. చంద్రబాబు నాయుడు పల్లకిని పవన్ కళ్యాణ్ మోస్తున్నారు తప్పితే.. పవన్ కళ్యాణ్ ఇండిపెండెంట్‌గా ఎదగట్లేదు. మొదటి నుంచి జగన్మోహన్ రెడ్డి చెబుతున్నది అదే కదా.., సింగిల్‌గా పోటీ చేస్తే ఎవరి దమ్ము ఏంటో తెలుస్తుంది. ఇప్పుడు ముగ్గురు కలిసి వచ్చారు, 60 శాతం ఓట్ బ్యాంకింగ్ వచ్చింది. జగన్మోహన్ రెడ్డి సింగిల్‌గా వచ్చారు, 40 శాతం ఓట్ బ్యాంకింగ్ వచ్చింది, అంతే కదా! సో.. మళ్ళీ జగన్మోహన్ రెడ్డినే జనాలు కోరుకుంటున్నారు, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ గెలుస్తారు’’ అని ఆమె జోష్యం చెప్పుకొచ్చారు.

Also Read- అవినీతి మరకలేని వ్యక్తి దువ్వాడ శ్రీనివాస్.. అందుకే అరెస్ట్ చేయలేకపోయారు- మాధురి

Related News

Telugu Tv Serials : సీరియల్స్ వీక్లీ రౌండప్.. ఆ ఒక్కటే మళ్లీ టాప్..

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి కొత్త టెన్షన్.. చింటును బాలు తెస్తాడా..? గుణ ప్లానేంటి..?

Podarillu Today Episode : నారాయణకు అడ్డంగా దొరికిన జమున.. కన్నా సీరియస్.. ఇదేం ట్విస్ట్..

Intinti Ramayanam Today Episode: అక్షయ్ మాటతో మీనాక్షి షాక్.. పల్లవికి మైండ్ బ్లాక్.. అరెస్ట్ చేస్తారా..?

Illu Illalu Pillalu Today Episodes: రెచ్చిపోయిన భాగ్యం.. రామరాజు మాస్ వార్నింగ్.. వల్లికి ఇంకో ఛాన్స్..

Sunday TV Movies : ఆదివారం టీవీల్లోకి బోలెడు సినిమాలు.. మస్ట్ వాచ్..

Nindu Noorella Saavasam Serial Today Episode October 18th‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరి కోల్‌ కతా వెళ్లడానికి వైజయంతి ఒప్పుకుంటుందా..?

క్యాస్టింగ్ కౌచ్‌పై ఝాన్సీ ఏమన్నారంటే.. ఇండస్ట్రీలో మహిళల పరిస్థితి ఇదేనా?

Big Stories

Advertisement
×